Jump to content

కర్రెద్దుల కమల కుమారి

వికీపీడియా నుండి
కర్రెద్దుల కమల కుమారి
కర్రెద్దుల కమల కుమారి

కర్రెద్దుల కమల కుమారి


పదవీ కాలం
1989 - 1996
ముందు సోడే రామయ్య
తరువాత సోడే రామయ్య
నియోజకవర్గం భద్రాచలం

వ్యక్తిగత వివరాలు

జననం (1946-08-08) 1946 ఆగస్టు 8 (వయసు 78) /1946, ఆగస్టు 8
లక్కవరం, తూర్పు గోదావరి జిల్లా, India
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి రాజారావు

కర్రెద్దుల కమల కుమారి (Karredula Kamala Kumari) ప్రముఖ పార్లమెంటు సభ్యురాలు.[1]

ఈమె తూర్పు గోదావరి జిల్లాలోని లక్కవరం గ్రామంలో 1946 సంవత్సరంలో జన్మించింది. ఈమె రాజారావు గారిని 1968 సంవత్సరంలో వివాహం చేసుకున్నది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఈమె ఏలూరులోని సెయింట్ తెరెసా కళాశాలలో B.A., B.Ed., పట్టా పొంది; సిస్టర్ గా పనిచేసింది.

ఈమె 1989 లో 9వ లోక్‌సభకు ఎన్నికయ్యింది. తర్వాత రెండవసారి 10వ లోక్‌సభకు భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు సభ్యురాలిగా పోటీచేసి ఎన్నికయ్యింది. 1991లో కేంద్ర ప్రభుత్వంలో ఉప మంత్రిగా పదవీబాధ్యతలను నిర్వహించింది.

మూలాలు

[మార్చు]