కర్రోతు బంగార్రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కర్రోతు బంగార్రాజు విజయనగరం జిల్లా నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గంకు చెందిన రాజకీయ నాయకుడు మరియు సంఘసేవకుడు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా, నెల్లిమర్ల శాసనసభా స్థానానికి తెలుగుదేశం పార్టీ ఇంచార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విజయనగరంలోని కాష్వీ మల్టి స్పెషాలిటీ ఆసుపత్రికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

కర్రోతు బంగార్రాజు
కర్రోతు బంగార్రాజు
నియోజకవర్గం నెల్లిమర్ల శాసనసభా నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1969 నవంబర్ 03
పోలిపల్లి గ్రామం భోగాపురం మండలం, విజయనగరం జిల్లా
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు తండ్రి : కర్రోతు పైడియ్య. తల్లి : కర్రోతు సత్యమమ్మ
జీవిత భాగస్వామి కర్రోతు మంగమ్మ
సంతానం కుమారుడు : కర్రోతు నారాయణరావు (శేఖర్)

కుమార్తె: డా. మోపాడ చంద్రకళ M.B.B.S; అల్లుడు: డా. మోపాడ ప్రవీణ్ కుమార్ M.S. (Ortho) - కాష్వీ మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి, విజయనగరం

నివాసం పోలిపల్లి, భోగాపురం మండలం విజయనగరం జిల్లా
వృత్తి రాజకీయ నాయకుడు,వ్యవసాయదారుడు సంఘసేవకుడు & చైర్మన్ - కాష్వీ మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి, విజయనగరం

కుటుంబ నేపథ్యం

బంగార్రాజు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో పైడియ్య, సత్యమమ్మ దంపతులకు 1969 నవంబర్ 03న జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. భార్య మంగమ్మ పోలిపల్లి ప్రాధమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం(ఎఫ్.ఎస్.సి.ఎస్)అధ్యక్షురాలిగా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. సోదరుడు కర్రోతు సత్యనారాయణ పోలిపల్లి సర్పంచ్ గా రెండు దఫాలు పని చేశారు.పూసపాటిరేగ వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ గా పనిచేసారు. 

రాజకీయ జీవితం

బంగార్రాజు చిన్నతనము నుండి నందమూరి తారక రామారావు అభిమాని. 1983వ తెలుగుదేశం స్థాపన తరువాత కార్యకర్తగా రాజకీయ ప్రవేశం చేశారు. 1983 నుండి 1987 వరకు బాపూజీ యువజన సేవా సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. 1987 నుండి 1995 వరకు పోలిపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసారు. 1995 నుండి 2005 వరకు భోగాపురం మండల తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా పనిచేసారు. 2005 నుండి 2013 వరకు పోలిపల్లి ప్రాధమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం (పి.ఎ.సి.ఎస్.) అధ్యక్షుడిగా పనిచేశారు.2014 నుంచి 2019 వరకూ భోగాపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా పనిచేశారు. ఈ పదవీ కాలంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం 15000 ఎకరాలు అవసరమని భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. భూసేకరణపై రైతులు,ప్రజలు నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన సమయంలో బంగార్రాజు క్రియాశీలక పాత్ర పోషించి రైతులను ఒప్పించి,అధికార్లతో సమన్వయం చేశారు. భూసేకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు కృషిచేశారుఓ. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, నెల్లిమర్ల శాసనసభా స్థానం తెలుగుదేశం పార్టీ ఇంచార్జిగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. దశాబ్దాలుగా నెల్లిమర్ల నియోజకవర్గంలో వివిధ ఆధ్యాత్మిక, క్రీడా, సాంస్కృతిక, సేవాకార్యక్రమాలకు ఆర్ధిక సహకారం అందిస్తూ గ్రామాల వికాసానికి కృషి చేస్తున్నారు.


మూలాలు

  1. Tension prevails as airport-displaced block officials
  2. నెల్లిమర్ల టీడీపీ ఇన్‌చార్జిగా బంగార్రాజు
  3. మహిళా సంక్షేమం కోసమే ‘మహాశక్తి’