కలియుగ పాండవులు
| కలియుగ పాండవులు (1986 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కె. రాఘవేంద్ర రావు |
|---|---|
| నిర్మాణం | డి. రామానాయుడు |
| తారాగణం | వెంకటేష్, ఖుష్బూ, అశ్వని (నటి), చలపతిరావు, రావు గోపాలరావు, నూతన ప్రసాద్, సాక్షి రంగారావు, జె.వి.సోమయాజులు |
| సంగీతం | కె. చక్రవర్తి |
| నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
ప్రముఖ తెలుగు సినిమా అగ్రకథానాయకుడు వెంకటేష్ ఈ సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యాడు.ఈ సినిమా 1986 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో విడుదలై ఘనవిజయం సాధించి వెంకటేష్ కు నూతన కథానాయకుడుగా నంది అవార్డ్ ను తెచ్చింది.
కథా నేపథ్యం
[మార్చు]హుషారుగా, అల్లరి చిల్లరగా తిరిగే కాలేజీ విద్యార్థి విజయ్ (వెంకటేష్) కి, భారతి (కుష్బూ) తో ఘర్షణతోనే తొలి పరిచయమవుతుంది. భారతి ఎన్.సి.సి. క్యాంపు కి డార్జిలింగ్ వెళుతోందని తెలిసి, ఆ విజయ్ తనూ ప్రయాణమవుతాదు. అతడు మంచి గైడర్ పైలట్ కూడా. విజయ్ కి ముగ్గురు స్నేహితులు. వాళ్లతో కథానాయికతో ఓ చిన్న విమానంలో గగనయానం చేస్తూ విదేశీ శక్తులతో చేతులు కలిపే దేశద్రోహుల ముఠా చిక్కుతాడు. అక్కడ వారి నుంచి భారతిని కాపాడి, వారి అంతు చూసి, పతకం సంపాయిస్తాడు విజయ్. కథానాయకుడు తండ్రి ధనికుడు. ఒక సాదాసీద పిల్లలను తన కొడుకు ప్రేమించడం ఇష్టం లేక, కుట్ర పన్ని ఆమెకి పతిత అని ముద్రవేసి అరెస్ట్ చేయిస్తాడు. ఆత్మహత్య చేసుకోబోయిన భారతిని ఆమె సోదరి కాపాడుతుంది. ఈ విషయం తెలిసి, తన తండ్రి ఫ్యాక్టరీని మంటల పాలు చేసి ఆగ్రహం చల్లారక, కథానాయికను వెదుకుంటూ వెళ్లి చేరుకుంటాడు విజయ్.
ఆమెతో, తన స్నేహితులతో కలిసి, 'కలియుగ పాండవులు' గా మారి, సంఘంలో పెద్ద మనుమలుగా చలామణి అవుతున్న చీడ పురుగుల మీద పగ తీర్చుకోబోతాడు. చివరికి అతని తండ్రిలో పశ్చాత్తాపం... ప్రజా కోర్టులో దుర్మార్గులను శిక్షించడంతో చిత్రం పూర్తవుతుంది.
తారాగణం
[మార్చు]- దగ్గుబాటి వెంకటేష్_ విజయ్
- కుష్బూ_భారతి
- సూర్య_భాత
- చిట్టిబాబు_ భాస్కర్
- సరిత_ కృష్ణవేణి
- అశ్వని_మేకు
- రావు గోపాలరావు_చక్రపాణి
- నూతన్ ప్రసాద్_యం.ఎల్.ఎ.ఏకాంబరం
- రంగనాథ్_భీష్మ నారాయణ
- రాళ్ళపల్లి_ చక్రపాణి బావమరిది
- శక్తికపూర్_కర్మచంద్
- రాధారవి_భైరవమూర్తి
- రాజీవ్_డాక్టర్ వాయునందనరావు
- నర్రా వెంకటేశ్వరరావు_లాయర్ జలంధర్
- చలపతిరావు_యస్.ఐ.ఆగ్రేయమూర్తి
- జొన్నలగడ్డ వెంకట సోమయాజులు_జడ్జీ
- పి జె.శర్మ_ఐ.జి.
- పి.ఎల్.నారాయణ_జగన్నాథం
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి_డి.ఐ.జి.
- కె. కె. శర్మ _కాంపౌండర్ నారాయణ
- చిడతల అప్పారావు_హోటల్ మేనేజర్
- మాడా వెంకటేశ్వరరావు
- జయంతి_రాజేశ్వరి
- రమాప్రభ_చక్రపాణి చెల్లెలు
- కల్పనా రాయ్
- వై.విజయ_ భూదేవి.
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కోవెలమూడి రాఘవేంద్రరావు
- కధ: పరుచూరి బ్రదర్స్
- సంగీతం: కొమ్మినేని చక్రవర్తి
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్య గాయకులు: శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
- ఛాయ గ్రహణం: కె. ఎస్. ప్రకాశరావు
- ఎడిటింగ్:కె. ఎ.మార్తాండ్
- నిర్మాత: దగ్గుబాటి రామానాయుడు
- నిర్మాణ సంస్థ:సురేష్ ప్రొడక్షన్స్
- విడుదల:14:08:1986.
పాటలు
[మార్చు]ఈచిత్రంలో అన్ని పాటలు వేటూరి సుందర రామమూర్తి రచన చేసినారు.
- ఈ కౌరవ ఈ దానవ ఈ రౌరవ నీతికి, గానం:ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి
- ఎందుకో వొళ్ళు వేడెక్కె మామా ఏమిటొ కళ్ళు కైపెక్కె భామా, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
- హా హా హా ఆగవా హ హ హా ఎందుకూ, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
- ఒక పాపకు పదహారేళ్ళు దొర బాబుకు ఇరవై ఏళ్ళు, గానం:ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
- బుగ్గ బుగ్గ చెప్పాలి, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి
- నేను పుట్టిన రోజు, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి.