Jump to content

కల్లూరు (కురిచేడు)

అక్షాంశ రేఖాంశాలు: 15°56′55.788″N 79°28′16.320″E / 15.94883000°N 79.47120000°E / 15.94883000; 79.47120000
వికీపీడియా నుండి
కల్లూరు (కురిచేడు)
పటం
కల్లూరు (కురిచేడు) is located in ఆంధ్రప్రదేశ్
కల్లూరు (కురిచేడు)
కల్లూరు (కురిచేడు)
అక్షాంశ రేఖాంశాలు: 15°56′55.788″N 79°28′16.320″E / 15.94883000°N 79.47120000°E / 15.94883000; 79.47120000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంకురిచేడు
విస్తీర్ణం14.26 కి.మీ2 (5.51 చ. మై)
జనాభా
 (2011)[1]
2,786
 • జనసాంద్రత200/కి.మీ2 (510/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు1,434
 • స్త్రీలు1,352
 • లింగ నిష్పత్తి943
 • నివాసాలు627
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523304
2011 జనగణన కోడ్590651


కల్లూరు ప్రకాశం జిల్లా, కురిచేడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కురిచేడు నుండి 13 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మార్కాపురం నుండి 63 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 627 ఇళ్లతో, 2786 జనాభాతో 1426 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1434, ఆడవారి సంఖ్య 1352. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 657 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 18. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590651[2].

కల్లూరు చరిత్ర

[మార్చు]

ఈ గ్రామాన్ని కండ్రిక అని కల్లూరివారి కండ్రిక అని కూడా పిలుస్తారు. ఈ గ్రామాన్ని ఆనుకొని దక్షిణం వైపుగా చాలా పెద్ద చెరువు నిర్మాణం జరిగిఉంది. ఇది గ్రామ సర్వేనెంబర్లు 159, 202 నందు షుమారు 246.79 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిఉంది. ఇక్కడ ఒక శాసనం లభ్యమవుతుంది.దీని ప్రకారం ఈ చెరువును  "పెద్దసముద్రం" చెరువుగా నామకరణం చేయబడింది.

పరీధావి సంవత్సరం శాలివాహన శకం 1594 వ సంవత్సరం (1672-73) నాడు 'మాదాల' గోత్రోద్భవులైన శాయపనాయని గోపాలనాయుని మునిమనుమరాలు, రాయప్ప నాయుని మనుమరాలు, వెంకటాద్రినాయునాయుని కుమార్తె యగు 'తమ్మనూరు' గోత్ర "మేదరమెట్ల పెద్దమ్మన్" ఈ పెద్దసముద్రం చెరువును త్రవ్వించినట్లు తెలుస్తుంది. .ఈమె వందకుపైగా చెరువులనిర్మించిందని ఇక్కడి ప్రజలు చెప్పుకుంటారు. ఈ పెద్దసముద్రం చెరువు నిర్మాణానికి పూర్వమే ఈ ప్రదేశం (ఇప్పటి చెరువుకట్ట పడమర తూము ప్రక్కన)లో "గంగాధరేశ్వర" (గంగేశ్వర)స్వామివారి గుడి ఉంది.అచ్చట గల క్రింది శాసనం పై విషయాలను తెలియపరుస్తుంది. శాసనం తెలుగు, సంస్కృత లిపిలో ఉంది. ఎన్నో శతాబ్దాలు గడచినా ఈ తటాకంలో నీరు నిల్వఉండి ఎన్నో వేల ఎకరాలకు నీటినిచ్చి ఎందరినో పోషించింది. ఆమె పేరుమీదగా ఇప్పటికీ పేదరాసి పెద్దమ్మ చెరువుగా పిలబడుతుంది.చెరువుకట్ట పడమర తూమువద్ద ఇప్పటికీ ఓ చిన్న శిలా రూపంలో పెద్దమ్మను  చెరువుకు కొత్తనీరు చేరు సమయంలో పసుపు, కుంకుమలతో పూజిస్తారు.

గంగాధరేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

సా.శ 11వ శతాబ్దానికి చెందిన అతిపురాత గంగాధరేశ్వర ఆలయంతో పాటు మహిషమర్దని అమ్మవారు వెలసిింది. వీరితోపాటు శ్రీ సూర్యనారాయణుడు, వీరభద్రుడు ఉన్నారు.ఆ కాలంలో  ఈగుడి అత్యంతవైభవోపేతంగా వెలుగొంది మహిమానిత్వం అలరారిందని చెపుతారు .ప్రస్తుతం ఈ ఆలయం శిధిలమై ఉంది. అచట కేవలం నంది, కొన్ని శిధిల విగ్రహాలు బయల్పడినాయి. నందిశ్వరుని విగ్రహం కూడా మద్యకు రెండుభాగాలుగా పగలగొట్టబడి ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో శైవం ఆరాధించబడింది. చుట్టుపక్కల గ్రామాలైన ఆవులమంద లో బురుజు చేనువద్ద కాశీవిశ్వేశ్వరాలయం, నాయుడుపాలెం మచ్చాపురం వద్ద నాగులమ్మబోడు నాగేశ్వరాలయం తోపాటు ఈ గంగాధరేశ్వరుని ఆలయాలు త్రికోణంలో ఉండి, ఒక దానికి ఒకటి సమానదూరంలో ఉండటం విశేషం. ఈ గంగాధరేశ్వర స్వామివారి శిధిలాలయంవద్ద మరో రెండుశాసనాలు లభ్యమవుతున్నాయి. ఈ శాసనాలు తటాకనిర్మాణ శాసనాలకన్నా షుమారు 300 సంవత్సరాల పూర్వం నాటివని చెపుతారు.

సాధారణనామ సంవత్సరం శాలివాహన శకం 1292 (1370-71) సంవత్సరం శనివారం పుష్యం నాడు "అనపొలినాయుడు" అనువారు ఈ గంగేశ్వర(గంగాధరేశ్వర) స్వామివారికి నిత్య"నూనాభిషేకం" చేయుటకై ఇతని పెద తండ్రియగు 'బారినాయుడు, పెదతల్లి 'నూకసాని' పేర్లమీద ఒక నూనె గానుగను ఈ స్వామివారికి సమర్పించారు. ఎవ్వరైనా ఈ నూనె గానుగను ఆపినవారు 'పెదగంగ' వద్ద శిశు హత్యచేసిన వారగుదురని శాసనంలో తెలిపిఉంది. ఈ శాసనంనుబట్టి ఈ గంగాధరేశ్వరుడు పూర్వం అత్యంత మహిమోపేతుడై వెలుగొంది యున్నాడని తెలుస్తుంది. అదే సంవత్సరం అనగా శాలివాహనశకం 1292(1370-71) పుష్య సాధారణ నాడు ఇంకొక శాసనం కూడా ఉన్నది. ఆనాడు ఈ గంగేశ్వరునికి చెల్లనీరునేల, పడమటి తూము మొగదలన పాతికచెనున్నూ, సోమేపల్లిదారిలోని నాగటిచాలు రేపడచేను కలిపి ఈ మూడుచేలు నిత్యకైంకర్యాలకై దానంగా ఇచ్చినట్లు ఈ శాసనం తెలుపుతుంది. ఇది కూడా 'అనపోలినాయుడు'ఇచ్చినట్లు తెలుస్తుంది. శాసనాలలో ఊరిపేరు తెలిపియుండలేదు కానీ, అప్పటి గంగాధరేశ్వరాలయపు ఆనవాళ్ళు మాత్రం ఉన్నాయి. సగానికి పగులగొట్టబడిన నందీశ్వరుడు, సూర్యనారాయణుడు, వీరభద్రుడు, 11వ శతాబ్ధానికి చెందిన తలలేని అద్భుతమైన మహిష మర్ధిని విగ్రహాలున్నాయి. ఇంకొక అమ్మవారి విగ్రహం గుడిక్రింద కాలువమట్టిలో కలిసిపోయిందని కొందరు చెపుతారు. అలాగే గ్రామంలోకి వస్తే నక్కా త్రిపురయ్య ఇంటి కొష్టం ముందు ఎద్దులు కట్టేసే గాడిలో త్రిపురమ్మ(శ్రీశ్రీశ్రీ త్రిపురసుందరి)విగ్రహం ఉంది. కల్లూరు, కండ్రిక గా పిలవబడే ఈ గ్రామం మండల కేంద్రానికి పడమర దిక్కుగా పదిమైళ్ళ దూరంలో కలదు. ఈ గ్రామానికి తూర్పు ఆవులమంద, బొల్లికొండ,పడమర గుండ్లకమ్మ(సోమేపల్లి) కాశీపురం, ఉత్తరం గుండ్లకమ్మ(మిరియంపల్లి) దక్షిణం దేశిరెడ్డిపల్లి (చందవరం) సమీప గ్రామాలుగా ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి కురిచేడులో ఉంది. సమీప జూనియర్ కళాశాల కురిచేడులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల దర్శిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ కంభంలోను, మేనేజిమెంటు కళాశాల మార్కాపురంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మార్కాపురంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

కల్లూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

కల్లూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

కల్లూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 131 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 161 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 81 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 60 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 123 హెక్టార్లు
  • బంజరు భూమి: 109 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 757 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 237 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 752 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

కల్లూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 604 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 107 హెక్టార్లు
  • చెరువులు: 40 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

కల్లూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, పెసర, కంది

సమీప గ్రామాలు

[మార్చు]

పశ్చిమ నాయుడుపాలెం 4 కి.మీ,గొళ్లపల్లి 5 కి.మీ,ఆవులమంద 6 కి.మీ,కంకణాలపల్లి 7 కి.మీ,వెల్లంపల్లి 7 కి.మీ.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".