కాపర్(II)కార్బొనేట్
పేర్లు | |
---|---|
IUPAC నామము
Dicopper carbonate dihydroxide
| |
ఇతర పేర్లు
copper carbonate hydroxide, cupric carbonate, copper carbonate
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [12069-69-1] |
ధర్మములు | |
Cu2(OH)2CO3 | |
మోలార్ ద్రవ్యరాశి | 221.116 g/mol |
స్వరూపం | green powder |
సాంద్రత | 4 g/cm3 |
ద్రవీభవన స్థానం | 200 °C (392 °F; 473 K) |
బాష్పీభవన స్థానం | 290 °C (554 °F; 563 K) decomposes |
insoluble | |
Solubility product, Ksp | 7.08·109 |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−595 kJ/mol |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
88 J/mol·K |
ప్రమాదాలు | |
భద్రత సమాచార పత్రము | Oxford MSDS |
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | [1] |
జి.హెచ్.ఎస్.సంకేత పదం | Warning |
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H302, H315, H319, H335[1] |
GHS precautionary statements | P261, P305+351+338[1] |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | R22, R36/37/38 |
S-పదబంధాలు | S26, S36 |
Lethal dose or concentration (LD, LC): | |
LD50 (median dose)
|
159 mg/kg (rat, oral) |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
కాపర్ (II)కార్బొనేట్ ఒక రసాయన సమ్మేళన పదార్థం. ఇది ఒక అకర్బన సమ్మేళనపదార్థం .కాపర్ (II)కార్బొనేట్‌ను ప్రాథమిక/మౌలిక కాపర్‌కార్బొనేట్ అనిఅందురు.ప్రాథమిక/మౌలిక కాపర్ కార్బొనేట్ యొక్క రసాయన సంకేత పదం(Cu2(OH)2CO3)(ఖనిజం malachite).కొన్ని సందర్భాలలో సంకేత పదాన్ని Cu3(OH)2(CO3)2 (ఖనిజం azurite) గా కూడా వ్యవహరిస్తారు. మాలసైట్(malachite), అజురైట్(azurite)లు దీర్ఘకాలం వాతావరణప్రభావానికి గురైన ఇత్తడి,కంచు,, రాగి లోహాల మీద చిలుము/కిలుము రూపంలో ఏర్పడుతాయి.[2]
చరిత్ర-లభ్యత
[మార్చు]కాపర్ (II)కార్బొనేట్ సహాజం గా,స్వాభావికంగా ప్రకృతిలో లభించిన దాఖాలాలు లేవు.[3] 1973లో 500°Cఉష్ణోగ్రత,, 2 GPa వత్తిడి వద్ద, కార్బన్ డయాక్సైడ్ సమక్షంలో కాపర్ ఆక్సైడ్ లేదా అజురైట్ (Cu3(CO3)2(OH)2)నుండి కాపర్ కార్బోనేట్‌ను ఉత్పత్తి చేసినట్లు తెలియవచ్చినది.[4] తరచుగా కాపర్ (II)కార్బొనేట్ లేదా కుప్రిక్ కార్బోనేట్ అనబడు ఈ సమ్మేళన పదార్థము నిజానికి మౌలిక/ ప్రాథమిక కాపర్ కార్బోనేట్.1794 లో ఫ్రెంచి రసాయన శాస్త్ర వేత్త జోసెఫ్ లూయిస్ ప్రౌస్ట్ ( Joseph Louis Proust:1754–1826)మొదటి సారి కాపర్ కార్బోనేట్‌ను కాపర్, కర్బనం, ఆక్సిజన్ మూలకాలుగా విడగొట్టినాడు.
ఇతర పేర్లు
[మార్చు]కాపర్ (II)కార్బొనేట్ యొక్క IUPAC పేరు డైకాపర్‌కార్బొనేట్ డైహైడ్రాక్సైడ్.కాపర్ కార్బొనేట్‌ను ఇంకా కాపర్‌కార్బొనేట్ హైడ్రాక్సైడ్, కాపర్ కార్బొనేట్, కుప్రిక్ కార్బొనేట్ అనికూడా పిలుస్తారు.
భౌతిక లక్షణాలు
[మార్చు]కాపర్ (II)కార్బొనేట్ భౌతికంగా ఆకుపచ్చని పొడిరూపంలో ఉండును. ఈ సమ్మేళనపదార్థం యొక్క అణుభారం 221.116 గ్రాములు/మోల్.కాపర్ (II)కార్బొనేట్ సంయోగపదార్థం యొక్క సాంద్రత 4.0 గ్రాములు/సెం.మీ3.కాపర్ (II)కార్బొనేట్ యొక్క ద్రవీభవన స్థానం 200 °C (392 °F;473K).కాపర్ (II)కార్బొనేట్ సమ్మేళనపదార్థం యొక్క బాష్పీభవన స్థానం 290 °C(554 °F; 563 K),ఈ ఉష్ణోగ్రత వద్ద వియోగం/విచ్చెదన చెందును. ఈ సంయోగ పదార్థము నీటిలో కరుగదు.
ఉత్పత్తి
[మార్చు]మౌలిక కాపర్ కార్బోనేట్ కాపర్(II)సల్ఫేట్ సజలద్రావణాన్ని, సోడియం కార్బోనేట్ సజల ద్రావణంలను సంయోగపరచి ఉత్పత్తి చెయ్యుదురు.మిశ్రమ ద్రావణంలో మౌలిక కార్బొనేట్ అవక్షేపంగా ఏర్పడుతుంది .
- 2 CuSO4 + 2 Na2CO3 + H2O → Cu2(OH)2CO3 + 2 Na2SO4 + CO2
పై విధానంలో ఏర్పడిన మిశ్రమద్రావణంలోని మౌలిక కాపర్ కార్బోనేట్‌ను ఈ దిగువ పేర్కొన్న పధ్ధతిలో వేరు చేసెదరు. మొదట అవక్షేపాన్ని ఒడబోత (filter)లేదా అపకేంద్రిత (centrifuge)పద్ధతిలో ద్రావణం నుండి వేరు చేసెదరు.అవక్షేపాన్ని స్వేదనజలంతో కడిగి తిరిగి అపకేంద్రితం ద్వారా లేదా ఒడబోతద్వారా వేరు చేసెదరు. ఇలా వేరుపరచిన అవక్షేపం నీలిరంగులో ఉండును.
రసాయన చర్యలు
[మార్చు]సంయోగ పదార్థము లోని అన్ని మూలకాలు వేరు వేరుగా(రాగి,కర్బనం,ఆక్సిజన్)విడగొట్టబడిన/విచ్చేదింపబడిన మొదటి సంయోగపదార్థం కాపర్ కార్బోనేట్.ఈ సంయోగ పదార్థాన్ని వేడి చేసిన ఉష్ణాత్మకంగా కార్బన్ డయాక్సైడ్, కుప్రిక్ఆక్సైడ్(CuO)గా వియోగం చెందును.[5] ప్రాథమిక కాపర్ కార్బొనైట్ లైన మలచిట్, అజురైట్‌లు రెండు వియోగం చెందినపుడు కార్బన్ డయాక్సైడ్, కుప్రిక్ఆక్సైడ్(CuO)విడుదల అగును.
ఉపయోగాలు
[మార్చు]మాలాచిట్, అజురైట్ మౌలిక కాపర్ కార్బోనేట్‌లు రెండింటిని వర్ణకాలను తయారుచెయ్యుటకు ఉపయోగిస్తారు.మనుషుల పై విషప్రభావం కలిగించు లక్షణాలు కలిగిఉన్నను,లిప్‌స్టిక్ వంటి ముఖ సౌందర్యసామాగ్రి తయారీలో ఉపయోగిస్తారు.చాలా సంవత్సరాలుగా కాపర్ కార్బొనేట్‌ను ఆల్గేనాశినిగా కొలనులలో,ఆక్వాకల్చర్ చెరువులలో కూడా ఉపయోగిస్తున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Copper(II) carbonate basic
- ↑ Encyclopedia Of Corrosion Technology (Google eBook), Philip A. Schweitzer P.E.; CRC Press, 2004, ISBN 08247-4878-6
- ↑ మూస:Holleman&Wiberg
- ↑ Seidel, H.; Ehrhardt, H.; Viswanathan, K.; Johannes, W. (1974). "Darstellung, Struktur und Eigenschaften von Kupfer(II)-Carbonat". Zeitschrift fur anorganische und allgemeine Chemie. 410 (2): 138–148. doi:10.1002/zaac.19744100207. ISSN 0044-2313.
- ↑ Brown, I.W.M.; Mackenzie, K.J.D.; Gainsford, G.J. (1984). "Thermal decomposition of the basic copper carbonates malachite and azurite". Thermochimica Acta. 75 (1–2): 23–32. doi:10.1016/0040-6031(84)85003-0. ISSN 0040-6031.