కాపర్ మొనోసల్ఫైడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాపర్ మొనోసల్ఫైడ్
పేర్లు
IUPAC నామము
Copper sulfide
ఇతర పేర్లు
Covellite
Copper(II) sulfide
Cupric sulfide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [1317-40-4]
పబ్ కెమ్ 14831
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య GL8912000
SMILES [Cu]=S
ధర్మములు
CuS
మోలార్ ద్రవ్యరాశి 95.611 g/mol
స్వరూపం black powder or lumps
సాంద్రత 4.76 g/cm3
ద్రవీభవన స్థానం above 500 °C (932 °F; 773 K) (decomposes)[1]
0.000033 g/100 mL (18 °C)
Solubility product, Ksp 1.27 x 10−36
ద్రావణీయత soluble in HNO3, NH4OH, KCN
insoluble in HCl, H2SO4
వక్రీభవన గుణకం (nD) 1.45
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
hexagonal
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
zinc sulfide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

కాపర్ మొనోసల్ఫైడ్ (ఆంగ్లం: Copper monosulfide) ఒక రసాయన సమ్మేళనం. ఇది ఒక అకర్బన సంయోగపదార్థం.రాగి, సల్ఫర్ /గంధకం మూలకపరమాణు సంయోగం వలన కాపర్ మొనోసల్ఫైడు ఏర్పడినది. ఇది ప్రకృతిలో ముదురు ఇండిగో(కప్పనీలి) నీలి వర్ణపుకొవెలైట్(covellite) అను ఖనిజరూపంలో లభిస్తుంది.ఈ సంయోగ పదార్థం మితమైన విద్యుత్తువాహకం. కాపర్(ii) లవణా ద్రావణులలో హైడ్రోజను సల్ఫైడును బుడగల రూపంలో ప్రసరింప చేసిన బంకగా ఉన్న కాపర్ మొనోసల్ఫైడ్ ఏర్పడును.కాపర్ మొనోసల్ఫైడ్ సమ్మేళనపదార్థం, రాగి, సల్ఫర్‌ల ద్విభాగశీల, / యుగ్మసంయోగ పదార్థాలలో ఒకటి.

ఇతర పేర్లు[మార్చు]

కాపర్ మొనోసల్ఫైడ్ అనబడు ఈ రసాయన సమ్మేళనపదార్థాన్ని కొవెలైట్', కాపర్(II) సల్ఫైడు, కుప్రిక్ సల్ఫైడుఅనికూడా పిలుస్తారు.

భౌతిక ధర్మాలు[మార్చు]

కాపర్ మొనోసల్ఫైడు నల్లని పొడి/పుడిగా లేదా ముద్దలు/పలుకులుగా ఉండును. కాపర్ మొనోసల్ఫైడు సంయోగ పదార్థం యొక్క అణుభారం 95.611 గ్రాములు/మోల్.25°Cవద్ద కాపర్ మొనో సల్ఫైడు యొక్క సాంద్రత 4.76 గ్రాములు/సెం.మీ3. కాపర్ మొనోసల్ఫైడు సమ్మేళనపదార్థం యొక్క ద్రవీభవన స్థానం 500 C (932 °F; 773K) కంటే ఎక్కువ, కాని ఈ ఉష్ణోగ్రత వద్ద ఈసంయోగ పదార్థం విఘటన చెందును. ఈ రసాయన సంయోగపదార్థం నీటిలో కరుగదు. నీటిలో గరిష్ఠ ద్రావణియత 0.000033 గ్రామ/100 మీ.లీ నీటిలో. అలాగే హైడ్రోక్లోరిక్ ఆమ్లం,, సల్ఫ్యూరిక్ ఆమ్లాలలో కరుగదు. నైట్రిక్ ఆమ్లం( HNO3), ఆమ్మోనియం హైడ్రాక్సైడు(NH4OH), పొటాసియం సైనైడు(, KCN) లలోకరుగును. కాపర్ మొనోసల్ఫైడు యొక్క వక్రీభవన సూచిక 1.45.

అణు నిర్మాణం[మార్చు]

కాపర్ మొనోసల్ఫైడ్ అణువు షడ్భుజ/షట్కోణ స్పటిక నిర్మాణాన్ని కలిగి, ఖనిజం కొవేలైట్ అణు సౌష్టావానికి సామీప్యం కలిగి ఉండును. ఈ రకపు అణు సౌష్టవమే కాకుండగా అధిక పీడనం వద్ద అసంగతమైన, స్ఫటికముగా ఏర్పడని అణు నిర్మాణం కూడా కలిగిన్నది.[2] ఈ నియత రూపములేని నిర్మాణం రామన్‌స్పెక్ట్రం ఆధారంగా రూపొంధించిన కొవేలైట్ ఖనిజరూపాన్ని పోలిఉన్నది.

అనియత గదిఉష్ణోగ్రత వద్ద థియొరియాటో కుప్రస్(II) ఇథైలిన్ డైఅమీన్ చర్యవలన అర్ధవాహకతత్వం ఉన్న నిర్మాణం కలిగిఉన్న కాపర్ సల్ఫైడు ఏర్పడును. 30 °C వద్ద ఈ నిర్మాణ రూపం కోవలైట్ ఖనిజ స్పటికంగా మారును.[3]

  • కొనలైట్ యూనిట్^కణం 6 ఫార్ములా యూనిట్(12 పరమాణువు) రూపాలను ప్రదర్శించును.
  • 4 రాగి పరమాణువులు చతుర్భుజ సమన్వయంరూపం కలిగిఉండుట.
  • రెండు రాగి పరమాణువులతో ఏకసమక్షేత్ర సమన్వయంరూపం కలిగిఉండుట.
  • రెండుజతల సల్ఫర్ పరమాణువులు కేవలం 207.1 pm దూరం కలిగి ఉండటం సల్ఫర్ర్-సల్ఫర్ బంధఅస్తిత్వాన్ని తెలుపుతున్నది.మిగిలిన రెండు సల్ఫర్ పరమాణువులు త్రికోణాకారపు ఏక సమక్షేత్రమ్ కలిగి, రాగి పరమాణువు చుట్టూ ఈ త్రికోణం ఆవృతమై ఉండును. పంచభుజ బైపిరమిడ్‌సౌష్టవంలో 5 కాపర్ పరమాణువులు ఉండును.XPS ను ఉపయోగించి కావించిన అధ్యాయనంలో అన్ని రాగి పరమాణువుల ఆక్సీకరణ స్థాయి+1 స్థాయిఅని తెలిసింది.
ball-and-stick model of part of
the crystal structure of covellite
trigonal planar
coordination of copper
tetrahedral
coordination of copper
trigonal bipyramidal
coordination of sulfur
tetrahedral
coordination of sulfur-note disulfide unit

ఉత్పత్తి[మార్చు]

  • రాగి లోహం యొక్క సంయోగ లవణాలను కలిగిన ద్రావణంలోకి హైడ్రోజన్‌సల్ఫైడు వాయువును ప్రసరింప చెయ్యడం/పంపించడం ద్వారా కాపర్ మొనోసల్ఫైడును ఉత్పత్తి చెయ్యుదురు.
  • ప్రత్నామ్యాయంగా కాపర్(I) సల్ఫైడుతో అధికంగా సల్ఫరును ద్రవికరించి, కాపర్ మొనోసల్ఫైడ్‌ను ఉత్పత్తి చెయ్యవచ్చును. అనార్ద్ర ఇథనాల్లో ఉన్ననిర్జల/అనార్ద్ర కాపర్(II) క్లోరైడు నుండి హైడ్రోజన్సల్ఫైడ్ ద్వారా అవక్షేపంగా వేరు చెయ్యవచ్చును.
  • రాగి లోహాన్ని ద్రవికరించిన గంధకం(సల్ఫర్) తో చర్య జరిపి, సోడియం హైడ్రాక్సైడ్లో మరిగించడం వలన, ఏర్పడిన సోడియం సల్ఫైడుతో సజల కాపర్‌సల్ఫైడుతో చర్య వలన కాపర్ మొనోసల్ఫైడు ఏర్పడును.

ఉపయోగాలు[మార్చు]

కాపర్ మొనోసల్ఫైడ్ ను ఈ దిగువ పేర్కొన్న పరికరాలలో ఉపయోగిస్తారు[4]

  • సోలార్ సెల్స్
  • సుపిరియొనిక్ కండక్టరులు
  • పొటోడెటెక్టరులు
  • ఎలక్ట్రొకండక్టివ్ ఎలక్ట్రోడులు
  • పొటోథెర్మల్ కన్వర్సన్ పరికారాలు
  • గ్యాస్ సెన్సరులు

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Blachnik, R.; Müller, A. (2000). "The formation of Cu2S from the elements I. Copper used in form of powders". Thermochimica Acta. 361 (1–2): 31–52. doi:10.1016/S0040-6031(00)00545-1.
  2. Peiris, M; Sweeney, J.S.; Campbell, A.J.; Heinz D. L. (1996). "Pressure-induced amorphization of covellite, CuS". J. Chem. Phys. 104 (1): 11–16. Bibcode:1996JChPh.104...11P. doi:10.1063/1.470870.{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link)
  3. Grijalva, H.; Inoue, M.; Boggavarapu, S.; Calvert, P. (1996). "Amorphous and crystalline copper sulfides, CuS". J. Mater. Chem. 6 (7): 1157–1160. doi:10.1039/JM9960601157.
  4. "Copper Sulfide (CuS) Semiconductors". azom.com. Retrieved 2015-08-27.