కాపు (కులం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాపు అనేది దక్షిణ భారత రాష్ట్రమైన తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా అగుపించే మున్నూరు కాపు, తూర్పు కాపు మరియు ఒంటరి మొదలైన ఉప-కులముల యొక్క సామాజిక వర్గాన్ని సూచిస్తుంది. తెలుగులో కాపు అనే పదానికి అర్ధం కర్షకుడు లేదా రక్షకుడు . కాపులు తెలుగు మాట్లాడుతారు మరియు వారు ప్రధానంగా కర్షక వర్గం వారు. తెలంగాణాలో పటేల్ అని పేరు చివర ఈ మధ్య పెట్టుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కాపులు ఎక్కువగా తీరప్రాంత జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క ఉత్తర తెలంగాణా మరియు రాయలసీమ ప్రాంతములలో ఎక్కువగా ఉన్నారు. వారు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఒడిషా మరియు భారత దేశంలోని కొన్ని ఇతర రాష్ట్రములు అదేవిధంగా శ్రీలంకలో కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. కాపు ఉప కులాలైన బలిజ, తెలగ, మున్నూరు కాపు, తూర్పు కాపు మరియు ఒంటరి ఆంధ్రప్రదేశ్ జనాభాలో సుమారు 28 శాతం ఉన్నారు.తెలంగాణాలో 18% ఉన్నరు. దీనితో వీరు ఆయా రాష్ట్రములలో ఏకైక పెద్ద వర్గం అయ్యారు. ఇరవయ్యవ శతాబ్దం యొక్క చివరి దశాబ్దములలో, వారిలో కొందరు విదేశములలో స్థిరపడ్డారు, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డం, బోనైర్, న్యూజీలాండ్, మలేషియా, దక్షిణఆఫ్రికా, సింగపూర్, కెనడా, ట్రినిడాడ్, నెదర్లాండ్స్, జింబాబ్వే, క్యురకావ్, చైనా, గయానా, మారిషస్ మరియు ఆస్ట్రేలియాలలో స్థిరపడ్డారు.

చరిత్ర[మార్చు]

కాపులు ఆంధ్ర తెలంగాణా ప్రాంతమునకు చెందినవారు.[1] కాపులు ఇండో- ద్రావిడియాన్ జాతికి చెందినవారు. ఈ జాతి వారు ఉత్తరప్రదేశ్, బీహార్ అంతటా విస్తరించిన ఉత్తర భారతదేశపు గంగా మైదానములలో ఉన్న పురాతన నగరములైన, కపిలవస్తు పట్టణం రాజధాని ప్రాంతం రాజ్యం నుండి దేశమంతా వలస వెళ్లారు. ఈ వలస 2500 సంవత్సరముల క్రితం జరిగి ఉండవచ్చని అనిపిస్తుంది. చారిత్రక ఆధారాల ప్రకారం హిందూ ధర్మ తత్వ విభాగాలైన కపిల న్యాయ జెమిని వైశేషిక పూర్వమీమాంస ఉత్తర మీమాంస లలో అతి ప్రాచినమైన విభాగము తత్వవేత్త కపిలుడు ప్రవచించిన శాంక్య సిద్ధాంతం. కపిలుడు శాఖ్య వంశానికి చెందినా వాడు. ఈ కపిలుడి సిద్ధాంతాన్ని నమ్మి వ్యవసాయము చేస్తూ మరియు విదేశీయుల నుండి దేశాన్ని కాపాడుతూ పరిపాలన చేసిన వారే కాపులు. కపిలుని పేరిటనే అతని శాక్య వంశస్థులకు కాపులు అనే పేరు వచ్చింది. దేశ వ్యాప్తంగా కాపులది శాక్య వంశం. ఈ శాక్య వంశములో గొప్పవాడైన శుద్ధోదనుడు కపిలుడు మరణించిన 200 సంవత్సరాల తర్వాత అతని మీది గౌరవముతో పేరుతొ " కపిలవస్తు " నగరాన్ని నిర్మించి తన రాజధానిగా చేసుకున్నాడు. శుద్ధోదనుడు కొడుకైన సిద్ధార్ధుడు కపిలుడి శాంఖ్య సిద్దాంతాన్ని విస్తరించి బుద్ధ ధర్మాన్ని బోధించిండు. బుద్ధుని తర్వాత అతని వారసుల కాలములో రాజ్యముని కోల్పోయి ఈ శాఖ్య వంశస్థులందరూ దేశమంతా విస్తరించారు. ఒక్కో రాష్ట్రములో ఒక్కో పేరుతొ పిలవబడ్డారు. కాన్భీ (కున్భీ ), కాపు, కుర్మి,మాలీలు, ఒక్కలిగలుగా ఆయా స్థానిక భాష ప్రకారం పిలుచుకోబడ్డారు.

మొదటి ఆంధ్ర సామ్రాజ్యం, శాతవాహనులు{{Citation needed|date=A, గోదావరి ఒడ్డున ఉన్న గోదావరి డెల్టా జిల్లాలైన, తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణ డెల్టా, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలలో మున్నూరు కాపులు ఎక్కువగా కనిపిస్తారు. ఈ స్థావరం ద్రాక్షారామం (తూర్పుగోదావరి జిల్లా), శ్రీశైలం (కర్నూలు జిల్లా) మరియు శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా)లలో మూడు శివ లింగములు ఉన్న భౌగోళిక ప్రాంతములకు నెమ్మదిగా విస్తరించింది. తెలంగాణాలో మున్నూరూ కాపులే అధికంగా ఉన్నారు.


ఈ స్థావరం మరియు భౌగోళిక ప్రాంతం పురాతన గ్రంథములలో త్రి-లింగ దేశంగా ప్రస్తావించబడింది మరియు ఇక్కడ స్థిరపడిన ప్రజలు తెలగలుగా పిలవబడ్డారు మరియు వారు మాట్లాడే భాష తెలుగు[ఉల్లేఖన అవసరం] అని పిలవబడింది. అదే తెలంగాణా ప్రాంతంగా పిలవబడుతున్నది . సహా అనేక వర్గముల యొక్క నాయుడు అనే పేరు, మొట్టమొదట విష్ణుకుండినుల రాజ్యం సమయంలో ఉపయోగించబడింది. వీరు మూడవ శతాబ్దం AD[ఉల్లేఖన అవసరం] సమయంలో కృష్ణా మరియు గోదావరి నదుల డెల్టాలను పాలించారు. నాయడు అనే పదం నాయక (దాని అర్ధం "నాయకుడు") అనే పదం నుండి ఉద్భవించింది.

కాపులు వారి మూలములను బీహార్ మరియు UP[clarification needed]కి చెందిన కుర్మిస్ మరియు మహారాష్ట్రకు చెందిన కున్బిస్,మాలీలు మరియు కర్ణాటకకు చెందిన వొక్కలిగా వంటి ఒకేరకమైన యోధ/కర్షక వర్గములతో పంచుకుంటారు. కాపులు ప్రధానంగా కర్షక వర్గము వారు. వీరు యుద్ధ సమయములలో సైనిక వృత్తిని స్వీకరిస్తారు.ఛత్రపతి శివాజీ మహారాజు పూర్తిగా రైతు సైన్యముపైనే ఆధారపడి తన రాజ్యాన్ని విస్తరించాడు.

వృత్తి ఆధారంగా కాపు ఉప కులములు కూడా పుట్టుకొచ్చాయి. తర్వాత కాలములో ఈ శాఖ్య వంశములో గొప్ప రాజులు చక్రవర్తులుగా అశోక చక్రవర్తి, శివాజీ, సాహు మహారాజు కనిపిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ రాజు ఐన మున్నూరు కాపు బిడ్డ మల్లన్న అన్నదమ్ములచే మోసగించబడి సిద్ధిపేట కొమరవేల్లికి వెళ్లి ముస్లిం రాజులచే మతం మార్చబడిన యాదవులని ఇతర ప్రజలని కాపాడి ప్రజలచే దేవుడిగా కొలవబడి " కొమరెల్లి మలన్న "గా ప్రసిద్ధం. సంతు తుకారం లాంటి భక్తీ గురువులు, మహాత్మా జ్యోతీ బాఫూలే,సావిత్రి బాయి ఫూలే , పెరియార్ లాంటి సంఘ సంస్కర్తలు కనిపిస్తారు.ఇటీవలి కాలములో వంగవీటి రంగ మరియు పుంజాల శివశంకర్,కొణిదెల పవన్ కల్యాణ్ లు గొప్ప నాయకులు.

కాపులు ఆ తర్వాత కాలములో కళలు మరియు విద్యా రంగముల వైపు మరలారు. అయినప్పటికీ, జనాభాలో ఎక్కువ మంది ఇంకా కర్షకులుగానే ఉన్నారు.

తెలంగాణలో మున్నూరు కాపులు సామాజికంగా, ఆర్థికంగా వెనకబడి ఉండడము వాళ్ళ BC వర్గం లోనికి చేర్చబడ్డారు. మైదాన ప్రాంతాల్లో నీటి జాడని దొరకబట్టి మూడు దిక్కులా నీటిని ఆపి చెరువులు కట్టి వ్యవసాయము చేయడము వాళ్ళ వీరు మున్నీటి లేదా మున్నేరు కాపులైనారు ( మున్నూరు కాపు ) . 1930 కన్నా ముందు నిజాం రాజ్యములో వీళ్ళు "మున్నీటి లేదా మున్నేరు కాపులు "గా గుర్తింపబడ్డారు.1930 లో నిజాం ప్రభుత్వం మొదటిసారిగా గజెట్ లో మున్నూరు కాపుగా ప్రకటించింది. మిగతావారు గూడతో నీళ్ళు పారించి వ్యవసాయము చేసిన వాళ్ళు గుడేటి కాపులు, మోటతో నీళ్ళు పారించి వ్యవసాయము చేసినవారు మొటాటి కాపులైనారు.

ఉప కులములు[మార్చు]

 • తూర్పు కాపు
 • మున్నూరు కాపు
 • తెలగ
 • ఒంటరి
 • బలిజ
 • వెల్లపు కాపు
 • గురటి కాపు
 • గోనె కాపు

Motati


వృత్తి[మార్చు]

మధ్యయుగపు కాలంలో కాపు వర్గం యోధులుగా బందిపోట్ల నుండి లేదా దండెత్తి వచ్చే బలగముల నుండి గ్రామములను మరియు ప్రాంతములను రక్షించేవారుగా పనిచేసారు. శాంతి సమయములలో, గ్రామములకు సమీపంలో నివసించే యోధులు గ్రామ పెద్దలుగా పనిచేసారు లేదా వ్యవసాయం చేసుకున్నారు. యుద్ధ సమయములలో, వారు అనేక దక్షిణ భారత రాజవంశముల సైన్యములలో సైనికులుగా, గవర్నర్లుగా (అనగా, నాయక్స్ ) మరియు సేనాధిపతులుగా పనిచేసారు. ఆధునిక యుగపు కాపు వర్గం ఎక్కువగా కర్షకులు, కానీ వారిలో చాలా మంది వ్యాపారం, పరిశ్రమలు, కళలు మరియు విద్యా రంగములవైపు మరలిపోయారు.

వృత్తి పేర్లు[మార్చు]

కొన్ని కాపు పేర్లు మధ్య యుగంలో ఆచరించిన వృత్తులతో సంబంధం కలిగి ఉన్నాయి.

 • గ్రామీణ మరియు ప్రాంతీయ రక్షణ కమిటీలు (కార్యవర్గములు): వూరు కాపు, ప్రాంత కాపు
 • పరిపాలన: చిన్న కాపు, పెద్ద కాపు.
 • బందిపోటు దొంగల నుండి పొలములను, పశువులను కాపాడటం: పంట కాపు

శాఖలు[మార్చు]

 • వెల్లపు కాపు (తెలంగాణా ప్రాంతం)
 • మున్నూరు కాపు (తెలంగాణా ప్రాంతం)
 • పెద్దకాపు
 • తెలగనాటి (తెలగ)
 • చాళుక్య కాపు
 • ముంగారు
 • మొగలి
 • మేకల
 • పాకనాటి (తూర్పు పరగణా)
 • సింహపురి (బలిజ/రెడ్డి)
 • వెలనాటి
 • ఓరుగంటి

 • నేరావతి
 • పెదకంటి (నరోల్లు)
 • నాగలి
 • నామదర్లు
 • నాగరాలు
 • మోదికర్లు
 • కొరగంజి
 • మాకెన
 • ఉగ్గిన

దక్షిణ భారతదేశానికి రాజకీయ, సామాజిక మరియు సాంస్కృతిక సహకారములు[మార్చు]

తరువాతి శతాబ్దములలో కాపు వర్గం తెలుగు భాషను మరియు సంస్కృతిని వికసింపజేస్తూ ఇతర ప్రాంతములకు విస్తరించింది. కాపులు మొట్టమొదట శాంతి కాముకులు కానీ ఉత్తర దిశ నుండి దండెత్తి వస్తున్న బలగముల ఆక్రమణ మూలంగా వారు స్వయంగా ఒక బలగంగా తయారయ్యారు. ఈ బలగం యుద్ధం ద్వారా తమ స్వాతంత్ర్యాన్ని కాపాడుకుంది. దండెత్తి వస్తున్న బలగముల నుండి సమాజం యొక్క సాంస్కృతిక మరియు మతసంబంధ కట్టడములను కాపాడగలిగిన సామర్ధ్యం మూలంగా కాపుల మధ్య యుగం అంతటా ఇతర వర్ణము లన్నింటిలోకి తమంతట తాము ఉన్నత స్థాయికి చేరుకున్నారు] ద్వారా మరియు వివిధ నాయక్ ల ద్వారా కాపు కులం దక్షిణ భారతదేశం మరియు శ్రీ లంక అంతటా తెలుగు సామ్రాజ్యము మరియు దాని సంస్కృతి యొక్క స్థాపన మరియు విస్తరణలో గణనీయ పాత్ర పోషించింది.

దక్షిణ భారతదేశం యొక్క సామాజిక, సాంస్కృతిక మరియు రాజకీయ అంశములకు సహకరించిన అనేక మంది నాయకులు ఈ వర్గం వారే. వీరిలో కొందరు స్వాతంత్ర్య పోరాటము[which?]నకు మరియు జులుం[which?] మరియు సాంఘిక దురాచారములకూ వ్యతిరేకంగా పోరాటడం ద్వారా అణగదొక్కబడ్డ వారి ఉద్ధరణకు గొప్పగా సహకరించారు.


మదురై మరియు కాందీ రాజులు తెలుగు సామ్రాజ్యాన్ని మరియు దాని సంస్కృతిని భారతదేశం మరియు శ్రీలంక యొక్క సుదూర దక్షిణ భాగములకు విస్తరించారు. కాపు సంతతికి చెందిన కాకతీయ ప్రభువులు అనేక మంది ముస్లిముల దండయాత్రల[which?] నుండి తెలుగు భూమిని కాపాడారు.[మార్చు]

సాహితీ సహకారములు[మార్చు]

కాపు నాయక రాజులు అనేకమంది స్వయంగా గొప్ప కావటంతో అనేకమంది తెలుగు కవులను[which?] ప్రోత్సహించటం ద్వారా తెలుగు భాషను సుసంపన్నం చేసారు. మదురై నాయక రాజ్యంలో తన తండేడ్రిని "విష్ణువు"తో పోల్చుతూ రాజుగారి కుమారుడు ఒక ద్విపద పద్యమును స్వరపరచటం నసాధారణ ఆచారం. . పహిహేడవ శతాబ్దములో బలిజ కులానికి చెందిన యోధులు/వర్తకులు మదురై సామ్రాజ్యానికి రాజులు కావటంతో అవి మరింత స్పష్టమైనాయి. ఆ ఆస్థానానికి రాజే స్వయంగా ముఖ్య అంశంగా ద్విపద రీతిలో రచనలు చేయటానికి ఉంవకవులకు అనుమతి ఉండి ఉండేది.

ఇరవయ్యవ శతాబ్దములో కాపులు[మార్చు]

పందొమ్మిదవ శతాబ్దం వరకు తెలుగు సమాజం యొక్క వివిధ సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక విషయములలో కాపులకు గొప్ప పాత్ర లేకపోయినప్పటికీ, భారత స్వాతంత్ర్యం తర్వాత వారు ఆర్థిక మరియు రాజకీయ విజయాన్ని ఆస్వాదించలేకపోయారు. వారు నిలకడగా తిరోగమించటం ప్రారంభించారు. కానీ ఆ సమాజములో కొన్ని వర్గముల వారు ఆధునిక విద్య మరియు ఆర్థిక మార్పులకు అలవాటు పడ్డారు. ఆ తిరోగమనము 1970లు మరియు 1980ల సమయంలో ఉచ్చదశలో ఉంది. ఆర్థిక స్వేచ్ఛతో మరియు ప్రభుత్వ రంగములపైన లైసెన్స్ రాజ్ మరియు ప్రభుత్వ నిరంకుశత్వం యొక్క తొలగింపుతో, ఈ సమాజము నెమ్మదిగా కానీ నిలకడగా తనని తాను పునరుద్దరించుకుంటోంది.

వ్యవసాయము, విద్య, వ్యాపారము మరియు రాజకీయములకు సంబంధించిన ఆధునిక విధానములకు అలవాటుపడటంలో కాపు వర్గం నిదానంగా ఉంది. ఆ సమాజంలోని ధనిక వర్గం ముఖ్యంగా ఆంధ్ర తీరప్రాంతం వారు పునరుద్ధరణలో పాలు పంచుకున్నారు కానీ రాయలసీమ మరియు తెలంగాణాలోని మధ్య తరగతి కర్షకులు దీని నుండి అంతగా ప్రయోజనం పొందలేదు ఎందుకనగా ఈ ప్రాంతం వారికి వారి తీరప్రాంత ప్రజల వలె సహజ వనరులు లేవు. దీనితో రాయలసీమ, తెలంగాణా మరియు ఉత్తర ఆంధ్రాలలో విద్య గణనీయంగా తగ్గిపోయింది. ఇది పేదరికానికి కారణమైంది.

సామాజికంగా ఇప్పటికీ ఒక ఉన్నత వర్గం అయినప్పటికీ, రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు, సంక్షేమ కార్యక్రమాలలో ప్రభుత్వ ఆసరా లేకపోవటంతో కొన్ని కాపు వర్గములు ఆర్థికంగా వెనుకబడ్డారు. రాష్ట్ర జనాభాలో 20.5% ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగములలో కేవలం 5% మాత్రమే ఉన్నారు. పార్లమెంట్ మరియు శాసనసభ స్థానములు రెండింటిలో వీరి తరఫున కేవలం 48 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇది రాష్ట్రంలో ఈ వర్గం వారి సంఖ్యను సూచించదు. రెండు ప్రధాన పార్టీలు,కాంగ్రెస్ మరియు తెలుగుదేశం కాపుల జనాభాకు సరిపడేటట్లు వారికి శాసనసభా స్థానములను పంచలేదని ఒక అభిప్రాయం[25]. ఉదాహరణకు, రాయలసీమ జిల్లాలలో బలిజలు అధిక సంఖ్యాక వర్గం అయినప్పటికీ రాష్ట్ర శాసనసభలో వారి ప్రతినిధిగా ఒక్క MLA కూడా లేరు.[2] వ్యూహాత్మకంగా లేదా సంయుక్తముగా నిర్ణయములు తీసుకోవటంలో లోపం మరియు రాజకీయములలో చేరటానికి అనాసక్తి ఆ వర్గం పైన హానికరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని నమ్ముతు\

మూలాలు[మార్చు]

. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ap-ta.org)

సూచనలు[మార్చు]

 1. "భారతదేశపు డిజిటల్ గ్రంథాలయము". మూలం నుండి 2013-05-23 న ఆర్కైవు చేసారు. Retrieved 2020-01-07. Cite web requires |website= (help)
 2. http://books.google.com/books?id=r-ffeWmj2JUC&printsec=toc&dq=subject:%25.18 Balija+(Indic+people)%25.18&output=html