Jump to content

కామినేని ఈశ్వరరావు

వికీపీడియా నుండి
కామినేని ఈశ్వరరావు

శ్రీ కామినేని ఈశ్వరరావు గారు

[మార్చు]
  • జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో, కృష్ణా జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకొని వెళ్ళిన ఘనత, అర్జున అవార్డు గ్రహీత శ్రీ కామినేని ఈశ్వరరావు గారికే దక్కుతుంది. భారతదేశంలోని అనేక నగరాలలో, భారత వెట్ లిఫ్టింగ్ ఫెడెరేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో 9 పసిడి పతకాలూ, భారతదేశంలో 12 జాతీయ రికార్డులను సాధించిన మొదటి భారతీయుడు శ్రీ ఈశ్వరరావు కావటం విశేషం.[మూలాలు తెలుపవలెను]
  • వీరు భట్ల పెనుమర్రు గ్రామంలో 1926, ఆగస్టు-28వ తేదీన ఒక రైతు కుటుంబంలో జన్మించారు. వెయిట్ లిఫ్టింగ్ లో గోసాలలోని గురువు శ్రీ రంగదాసుగారి వద్ద, శిక్షణ పొందినారు. జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో కోల్ కతా, చెన్నై, ముంబై, కొత్త డిల్లీ, జబల్ పూర్ మొదలగు నగరాలతో పాటు, విదేశాలలోని హెల్సింకీ (ఫిన్లెండు), వార్సా (పోలెండ్), మెల్బోర్న్ (ఆస్ట్రేలియా), జకార్తా (ఇండోనేషియా) మొదలగు చోట్ల జరిగిన పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచారు. 1951లో కోల్ కతాలో జరిగిన అన్ని విభాగాలలోనూ, శరీర సౌష్టవ పోటీలలోనూ, పసిడి పతకాలు సాధించారు. 1963లో అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా "అర్జున" అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా నిలిచారు.
  • ఎన్నో రికార్డులు:- 1951లో ఆసియా క్రీడలలో, ఇంతవరకూ ఏ భారతీయుడూ సాధించని రజత పతకాన్ని ఈయన వెయిట్ లిఫ్టింగులో సాధించారు. దేశంలో 12 జాతీయ రికార్డులు, ఆసియా ఖండంలో 4 రికార్డులు స్థాపించిన తొలి భారతీయుడు. ఈయన కృష్ణా జిల్లా క్రీడా సంఘానికి కార్యదర్శిగా పనిచేశినారు. వీరికి చలనచిత్ర రంగంలో గూడా ప్రవేశం ఉంది. "భీమాంజనేయ యుద్ధం" అను చిత్రంలో వీరి ప్రత్యర్థి శ్రీ దండమూడి రాజగోపాలరావుతో పోటీగా ఆంజనేయ పాత్ర ధరించి పలువురు ప్రశంసలు పొందినారు. వీరు 1977, నవంబరు-7న గుండెపోటుతో కన్నుమూశారు.
  • కుటుంబ నేపథ్యం:- వీరి ఇద్దరు సంతానం. కుమారుడు డాక్టర్ కె.పిరావు, హాంగ్ కాంగ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. కుమార్తె శ్రీమతి వసుంధర, విజయవాడలో గృహిణిగా ఉన్నారు.
  • యోధానుయోధులు:- గతంలో ఆంధ్రప్రదేశ్ లో, వెయిట్ లిఫ్టింగ్ అంటే కృష్ణాజిల్లా నే గుర్తుకు వచ్చేది. జిల్లాకు చెందిన శ్రీ కామినేని ఈశ్వరరావు, శ్రీ దండమూడి రాజగోపాలరావు వంటి యోధానుయోధులు, జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకొని వచ్చారు. వీరితోపాటు బొబ్బా వెంకటేశ్వరరావు, ఎం.పి.రంగా, మాదు వెంకటేశ్వరరావు, సంపత్, రామస్వామి, అచ్యుతరావు వంటి ఎందరో వెయిట్ లిఫ్టర్లు 1945-70 మధ్య జిల్లాకు మంచిపేరు తీసుకొని వచ్చారు. [ఈనాడు కృష్ణా; 2013, ఆగస్టు-28; 15వపేజీ.]

కృష్ణా జిల్లా ప్రముఖులు