కాల్షియం క్లోరైడ్

వికీపీడియా నుండి
(కాల్సియం క్లోరైడ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కాల్సియం క్లోరైడ్
Structure of calcium chloride, (chlorine is green, calcium is gray)
Sample of calcium chloride
పేర్లు
IUPAC నామము
Calcium chloride
ఇతర పేర్లు
Calcium(II) chloride, Calcium dichloride, E509
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [10043-52-4]
పబ్ కెమ్ 24854
డ్రగ్ బ్యాంకు DB01164
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:3312
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య EV9800000
SMILES [Ca+2].[Cl-].[Cl-]
ధర్మములు
CaCl2
మోలార్ ద్రవ్యరాశి 110.98 g·mol−1
స్వరూపం White powder, hygroscopic
వాసన Odorless
సాంద్రత 2.15 g/cm3 (anhydrous)
2.24 g/cm3 (monohydrate)
1.85 g/cm3 (dihydrate)
1.83 g/cm3 (tetrahydrate)
1.71 g/cm3 (hexahydrate)[1]
ద్రవీభవన స్థానం 772–775 °C (1,422–1,427 °F; 1,045–1,048 K)
anhydrous[5]
260 °C (500 °F; 533 K)
monohydrate, decomposes
175 °C (347 °F; 448 K)
dihydrate, decomposes
45.5 °C (113.9 °F; 318.6 K)
tetrahydrate, decomposes[5]
30 °C (86 °F; 303 K)
hexahydrate, decomposes[1]
బాష్పీభవన స్థానం 1,935 °C (3,515 °F; 2,208 K) anhydrous[1]
Anhydrous:
74.5 g/100 mL (20 °C)[2]
Hexahydrate:
49.4 g/100 mL (−25 °C)
59.5 g/100 mL (0 °C)
65 g/100 mL (10 °C)
81.1 g/100 mL (25 °C)[1]
102.2 g/100 mL (30.2 °C)
α-Tetrahydrate:
90.8 g/100 mL (20 °C)
114.4 g/100 mL (40 °C)
Dihydrate:
134.5 g/100 mL (60 °C)
152.4 g/100 mL (100 °C)[3]
ద్రావణీయత Soluble in CH3COOH, alcohols
Insoluble in liquid NH3, DMSO, CH3COOC2H5[4]
ద్రావణీయత in ethanol 18.3 g/100 g (0 °C)
25.8 g/100 g (20 °C)
35.3 g/100 g (40 °C)
56.2 g/100 g (70 °C)[4]
ద్రావణీయత in methanol 21.8 g/100 g (0 °C)
29.2 g/100 g (20 °C)
38.5 g/100 g (40 °C)[4]
ద్రావణీయత in acetone 0.1 g/kg (20 °C)[4]
ద్రావణీయత in pyridine 16.6 g/kg[4]
ఆమ్లత్వం (pKa) 8–9 (anhydrous)
6.5–8.0 (hexahydrate)
అయస్కాంత ససెప్టిబిలిటి −5.47·10−5 cm3/mol[1]
వక్రీభవన గుణకం (nD) 1.52
స్నిగ్ధత 3.34 cP (787 °C)
1.44 cP (967 °C)[4]
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Orthorhombic (rutile, anhydrous), oP6
Tetragonal (anhydrous, > 217 °C), oP6[6]
Trigonal (hexahydrate)
Pnnm, No. 58 (anhydrous)
P42/mnm, No. 136 (anhydrous, > 217 °C)[6]
2/m 2/m 2/m (anhydrous)
4/m 2/m 2/m (anhydrous, > 217 °C)[6]
a = 6.259 Å, b = 6.444 Å, c = 4.17 Å (anhydrous, 17 °C)[6]
α = 90°, β = 90°, γ = 90°
కోఆర్డినేషన్ జ్యామితి
Octahedral (Ca2+, anhydrous)
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−795.42 kJ/mol (anhydrous)[1]
−1110.98 kJ/mol (monohydrate)
−1403.98 kJ/mol (dihydrate)
−2009.99 kJ/mol (tetrahydrate)
− 2608.01 kJ/mol (hexahydrate)
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
108.4 J/mol·K[1]
విశిష్టోష్ణ సామర్థ్యం, C 72.89 J/mol·K (anhydrous)[1]
106.23 J/mol·K (monohydrate)
172.92 J/mol·K (dihydrate)
251.17 J/mol·K (tetrahydrate)
300.7 J/mol·K (hexahydrate)
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS07: Exclamation mark[7]
జి.హెచ్.ఎస్.సంకేత పదం Warning
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H319[7]
GHS precautionary statements P305+351+338[7]
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R36
S-పదబంధాలు మూస:S22, మూస:S24
Lethal dose or concentration (LD, LC):
1000 mg/kg (rats, oral)
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Beryllium chloride
Magnesium chloride
Strontium chloride
Barium chloride
Radium chloride
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

కాల్సియం క్లోరైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం. ఇది ఒక అకర్బన సమ్మేళన పదార్థం. కాల్సియం, క్లోరిన్ ల అయోనిక్ సంయోగ పదార్థం. ఈ లవణం అయోనిక్ క్లోరైడ్ లా ప్రవర్తిస్తుంది. కాల్సియం క్లోరైడ్ యొక్క రసాయన సంకేత పదం CaCl2. గది ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉండు ఈ కాల్సియం క్లోరైడ్ లవణం నీటిలో కరుగుతుంది. కాల్సియం క్లోరైడ్ ను శీతలీకరణ పరిశ్రమ (refrigeration plants) లలో, ఐస్/మంచు తయారు చేయుపరిశ్రమలలో బ్రైన్ (brine=సంతృప్త లవణ ద్రవం) గా వాడెదరు. అలాగే రోడ్ల మీద ధూళినియంత్రణ కై ఉపయోగిస్తారు.

భౌతిక ధర్మాలు[మార్చు]

కాల్సియం క్లోరైడ్ ఆర్ద్రతాకర్షణ కల్గిన తెల్లని ఘనపదార్థం.కాల్సియం క్లోరైడ్‌కు వాసన లేదు. క్లోరైడ్ అణుభారం 110.98గ్రాములు/మోల్. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద నిర్జలకాల్సియం క్లోరైడ్ సాంద్రత 2.15గ్రాములు/ సెం.మీ3.ఒక జలాణువు కల్గిన కాల్సియం క్లోరైడ్ సాంద్రత 2.24 గ్రాములు/సెం.మీ3. రెండు జలాణువులు కల్గిన కాల్సియం క్లోరైడ్ సాంద్రత 1.84 గ్రాములు/సెం.మీ3, నాలుగు జలాణువులు కల్గిన కాల్సియం క్లోరైడ్ సాంద్రత 1.83 గ్రాములు/సెం.మీ3, ఆరు జలాణువులు కల్గిన కాల్సియం క్లోరైడ్ సాంద్రత 1.71 గ్రాములు/సెం.మీ3. నిర్జల/అనార్ద్ర కాల్సియం క్లోరైడ్ యొక్క ద్రవీభవన స్థానం 772–775 °C (1,422–1,427 °F; 1,045–1,048 K).ఒక/ఏక జలాణువు కల్గిన కాల్సియం క్లోరైడ్ యొక్క ద్రవీభవన స్థానం 260 °C (500 °F; 533K, (ఈ ఉష్ణోగ్రతవద్ద ఈ రసాయన పదార్థం వియోగం చెందును). రెండు జలాణువులు కల్గిన కాల్సియం క్లోరైడ్ యొక్క ద్రవీభవన స్థానం 175 °C (347 °F;448K), ఈ ఉష్ణోగ్రతవద్ద ఈ రసాయన పదార్థం వియోగం చెందును).నిర్జల/అనార్ద్ర కాల్సియం క్లోరైడ్ యొక్క బాష్పీభవన స్థానం 1,935 °C (3,515 °F; 2,208K).కాల్సియం క్లోరైడ్ యొక్క వక్రీభవన సూచిక 1.52

ద్రావణీయత[మార్చు]

ఆల్కహాల్ లలో, ఎసిటిక్ ఆమ్లం (CH3COOH) లో కరుగుతుంది.అయితే ద్రవ అమ్మోనియా,, డైమిథైల్ సల్ఫక్సైడ్ (DMSO, ఇథైల్ ఎసిటెట్ (CH3COOC2H5) లలో కరుగదు.

ఇథనాల్ లో ద్రావణీయత[మార్చు]

100 గ్రాముల నీటిలో, 0 °C వద్ద 18.3 గ్రాములు,20 °C వద్ద 25.8 గ్రాములు, 40 °C వద్ద 35.3గ్రాములు, 70 °C వద్ద56.2 గ్రాములు కాల్సియం క్లోరైడ్ కరుగును.

మిథనాల్ లో ద్రావణీయత[మార్చు]

100 గ్రాముల నీటిలో 0 °C వద్ద 21.8గ్రాములు, 20 °C వద్ద29.2గ్రాములు, 40 °C వద్ద 38.5గ్రాముల కాల్సియం క్లోరైడ్ కరుగును.

రసాయన ధర్మాలు[మార్చు]

కాల్సియం క్లోరైడ్ నీటిలో కరుగు ధర్మం కలిగి ఉన్నందున, జల ద్రావణాలలో కాల్సియం క్లోరైడ్ కాల్సియం అయానుల (ions) వనరుగా పనిచేస్తుంది.ఈ లక్షణం వలన, ద్రవాలలో లోని ఆయానులను తొలగించుటకు కాల్సియం క్లోరైడ్ ఉపయోగపడుతుంది.ఉదాహరణకు ద్రవణాలలోని ఫాస్పేట్ ను కాల్సియం ద్వారా తొలగించవచ్చు:

3 CaCl2(aq) + 2 K3PO4(aq) → Ca3(PO4)2(s) + 6 KCl(aq)

కరిగించిన (ద్రవికరించిన) కాల్సియం క్లోరైడ్ ను విద్యుత్‌ విశ్లేషణచేయు (electrolyse) ట వలన కాల్సియం లోహం, క్లోరిన్ వాయువుగా విడిపోవును.

CaCl2(l) → Ca(s) + Cl2(g)

ఉత్పత్తి[మార్చు]

కాల్సియం క్లోరైడ్‌ను నేరుగా సున్నపురాయి (limestone) నుండి ఉత్పత్తి చెయ్యవచ్చును.సాల్వే ప్రాసెస్ (Solvay process) చర్యలో అధిక ప్రమాణంలో, పెద్ద మొత్తంలో ఉప ఉత్పత్తిగా కాల్సియం క్లోరైడ్ లభిస్తుంది. 2002సంవత్సరంలో ఉత్తర అమెరికా వినియాగం 1.687 మిలియను టన్నులు (3.7 బిలియను పౌండ్లు).అమెరికాలో ఉత్పత్తి అగు కాల్సియం క్లోరైడ్ పరిమాణంలో 35% మిచిగాన్ లోని ఎడౌవ్ కెమికల్ కంపెని ఉత్పత్తి చేస్తోంది.

స్వాభావిక లభ్యత[మార్చు]

ఉపయోగాలు[మార్చు]

పొడిపరచు/తేమను తొలగించు రసాయనపదార్థంగా(Desiccant)[మార్చు]

డ్రైయింగ్ ట్యూబ్ (drying tubes:పొడి పరచు గొట్టాలు) లలో తరచుగా కాల్సియం క్లోరైడ్ తో నింపెదరు.సోడియం కార్బోనేట్ ను ఉత్పత్తి కావించు నపుడు కెల్ప్/ సముద్రపుపాఁచి, శైవలము (Kelp) ను పొడి పరచుటకై కాల్సియం క్లోరైడ్ ను ఉపయోగిస్తారు.తేమ/చెమ్మను తొలగించు ఉపకరణాలలో కాల్సియం క్లోరైడ్ నింపుటకు FDA అనుమతి ఉంది.గృహాలలో, ఇతర పరిసర ప్రాంతాలలోని గాలిలోని తేమను తొలగించుటకై ఉపయోగించు లవణ/రసాయాన ఆధారిత డిహ్యుమిడిఫెయిర్ (dehumidifiers) లలో కాల్సియం క్లోరైడ్ ను ఉపయోగిస్తారు.

రహదారుల సిమెంటు కాంక్రీటు పూత పరిరక్షణ[మార్చు]

రోడ్ల మీద కాల్సియం క్లోరైడ్ ను చల్లడం వలన రోడ్ల శైథిల్యం (weathering) ను నివారించవచ్చును. కాల్సియం క్లోరైడ్ ను చల్లడం వలన పొడివాతావరణంలో కూడా రోడ్లు తడిగా ఉన్నట్లు కన్పించును. కాల్సియం క్లోరైడ్ యొక్క అర్ద్రతా కర్షకగుణం (తేమను పీల్చుస్వభావం) కారణంగా, దీనిని మట్టి బాటలఉపరితలంపై నీటిపొరను పట్టి ఉంచు కోవటానికి ఉపయోగిస్తారు.తేమ కారణంగా మట్టి రోడ్లపైన దుమ్ము పైకి లేవదు.

ఘనీభవన స్థానాన్ని తగ్గించు , మంచు ఏర్పడటాన్ని నిరోధించు రసాయనకంగా[మార్చు]

కాల్సియం క్లోరైడ్ ను నీటిలో కలపడం వలన అది నీటీ ఘనీభవన స్థానాన్ని తగ్గిస్తుంది. అలాగే రోడ్లపై చల్లడం వలన మంచు కురియు సమయంలో రోడ్లపై దట్టంగా మంచు ఏర్పడకుండ నిరోధించును, బాట/రోడ్లపై ఏర్పడిన మంచును త్వరగా కరిగేలా చెయ్యును.ఈ చర్యను డిఐసింగ్ (Deicing) అంటారు.

ఈతకొలనులలో, జలజీవశాల / జలజంతు ప్రదర్శన శాలలోవినియోగం[మార్చు]

ఈత కొలనులలో నీటి యొక్క కఠినత్వాన్ని పెంచుటకు, కాల్సియం క్లోరైడును నీటిలో కలుపుతారు. ఇందువలన కొలను యొక్క కాంక్రీటు అరుగుదల (erosion) నిరోధింప బడుతుంది. లి చాటేలియర్ సిద్ధాంతం (Le Chatelier's principle) ప్రకారం, సాధారణ అయాన్ ప్రభావం ప్రకారం, నీటిలో కాల్సియం గాఢత పెంచిన, కాంక్రీట్‌లోని, కాంక్రిటును బలపరచు/దృఢపరచు/ గట్టిపరచుటకు అవసరమైన కాల్సియం సమ్మేళనపదార్థాలు నీటిలో కరిగి తొలగింపబదు ప్రమాదం నివారింపబడును.

కార్బోనేట్ యుత గుల్లలను (carbonate-shelled) కలిగిన నత్త మొదలైన, ఒకజాతి జంతువు (mollusks) గుల్లల నిర్మాణానికి,, కొన్నివెన్నెముక లేని జలచరాలు, జంతువుల (cnidarians) లో అవసరమైయ్యే జీవసంబందిత అవసర కాల్సియం అందించుటకై మెరైన్ అక్వేరియంలలో కాల్సియం క్లోరైడ్‌ను కలుపుతారు.

ఆహారం లో వినియోగం[మార్చు]

ఆహార పదార్థాలలో కాల్సియం క్లోరైడ్ ను ఆహారఉత్పత్తుల నాణ్యతను, నిల్వ సామార్ధ్యాన్ని పెంపొందించుటకు sequestrant గా ఉపయోగిస్తారు., ఆహారంలోని పెప్టిన్ (pectin) పదార్థాన్ని అవక్షెపము చేయు firming agent గా కూడా వినియోగిస్తారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేసన్ కాల్సియం క్లోరైడ్ ను GRAS (generally recognized as safe) గా గుర్తించారు.ఒక వ్యక్తీ సగటున తీసుకొను కాల్సియం క్లోరైడ్ మోతాదు/పరిమాణం సగటున 160–345 మి.గ్రాములు /రోజుకు. కాల్సియం క్లోరైడ్ ను అధికకాలం నిల్వఉంచు ఆహార పదార్థాలు పాడవ్వకుండ ఉంచుటకు firming agent గా ఉపయోగిస్తారు.డబ్బాలలో ఉంచు శాకాహార ఉత్పత్తులలో కాల్సియం క్లోరైడ్ నుfirming agent గా ఉపయోగిస్తారు.స్పోర్ట్స్ పానీయాలలో,, beveragesలలో ఎలక్ట్రోలైట్ గా వాడెదరు. బాటిల్లో/సీసాలలో అమ్ము నీటిలో కూడా కాల్సియం క్లోరైడ్ నుకలుపుతారు. కాల్సియం క్లోరైడ్ ఘనీభవన స్థానాన్ని తగ్గించు గుణం కల్గి ఉన్నందున, దీనిని కారమేల్ కలిగిన చాకొలేట్ బార్ లోని కారమేల్ ఘనిభవస్థానాన్ని తగ్గించుటకు వాడెదరు.

జున్నుతయారు చేయునపుడు, క్రిమిరహితక్షీరం ( pasteurized milk) / సజాతీయత పాలలో ( homogenizedmilk, దాని స్వాభావిక కాల్సియం, ప్రోటీన్ తుల్యతకై కాల్సియం క్లోరైడ్ నుకలుపుతారు.

వైద్యపరంగా వినియోగం[మార్చు]

హైడ్రో ఫ్లోరిక్ ఆమ్ల వలన ఏర్పడిన అంతర్గత కాలిన గాయాలను చికిత్సచేయుటకై కాల్సియం క్లోరైడ్ ను సిరంజి మందుగా ఇస్తారు. అలాగే మాగ్నిషియంవలన కల్గు మయకము, మత్తు. తొలగించుటకు కూడా కాల్సియం క్లోరైడ్ ను ఉపయోగిస్తారు. hyperkalemia (రక్తంలో అధిక ప్రమాణంలో ఎలక్ట్రోలైట్ పొటాషియం (K+) కలిగిఉండటం) వలన మయోకార్డియంలో ఏర్పడు అధికస్థాయి సెరం పొటాషియాన్ని తగ్గించి, రక్షించును.

జంతువుల వంధ్యీకరణం[మార్చు]

మగజంతువులను వంధ్యీకరణం కావించుటకు ఇథనాల్ (95% ABV) లో డై హైడ్రేట్ కాల్సియం క్లోరైడ్ (20% /భారం) నుఉపయోగిస్తారు. శస్త్రచికిత్సరహిత ఈ విధానంలో పైన పేర్కొన్న ద్రవాన్ని మగ జంతువుల వృషణాలలోకి సిరంజి మందుగా పంపెదరు. సిరంజి మందుగా ఇచ్చిన నెలలోపు వృషణ సంబంధిత కోశకణాలు వంధ్యీకరణం చెందును.

ఇతర ప్రయోజనాలు[మార్చు]

  • కాంక్రీట్ లోని మిశ్రమపదార్థాలు ప్రాథమికంగా/మొదటి స్థితిలో త్వరితంగా సెట్టింగ్ కావటానికి కాల్సియం క్లోరైడ్ ను ఉపయోగిస్తారు.అయితే కాల్సియం క్లోరైడ్ ను ఉక్కు ఊచలు/ కడ్డిలని తినివేయు గుణం కల్గినండున, కాల్సియం క్లోరైడ్ ను R.C. ( reinforced concrete.) నిర్మాణాలలో వాడరాదు.
  • కాల్సియం క్లోరైడ్ ను ప్లాస్టిక్‌, నిప్పునుఆర్పు అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగిస్తారు. అలాగే వ్యర్ధజలాల చికిత్స (wastewater treatment) లో డైనేజిఎయిడ్ గా వాడెదరు.

ఆరోగ్యంపై ప్రభావం[మార్చు]

చర్మాన్ని తాకినపుడు, చర్మంలోని తేమను తొలగించడం వలన ప్రకోపం (irritant) కల్గించును. ఘన కాల్సియం క్లోరైడ్‌ను మింగినపుడు, గొంతులో తేమలో కరిగి, ఉష్ణం/వేడి విడుదల కారణంగా (కాలిన) గాయాలు నోరు/గొంతు, అన్నవాహిక, /ఆహారనాళంలో ఏర్పడును. గాఢ కాల్సియం క్లోరైడ్ ద్రవం, లేదా ఘన కాల్సియం క్లోరైడ్ కడుపు లోకి వెళ్ళినపుడు, లేదా మింగినపుడు ప్రకోపం కలగవచ్చును, లేదా లోపల పుళ్ళు, వ్రణాలు ఏర్పడును.

కాల్సియం క్లోరైడ్ వలన ఆరోగ్య పరంగా కల్గు ఇతర ప్రభావాలు:

  • నోటిలో సుద్ధ రుచి కల్గడం
  • జ్వరం వంటి లక్షణంతో వళ్లంతా వేడెక్కడం
  • రక్త పీడనంలో తగ్గుదల
  • ఆకలి మందగించడం
  • తలతిప్పడం
  • వాంతులు
  • మలబద్ధకం
  • కడుపు నొప్పి
  • నిస్సత్తుగా అయిన భావన
  • మానసిక ఒత్తిడికిలోనవ్వడం
  • అధిక దప్పిక
  • అతిమూత్రం
  • ఎముకల నొప్పులు
  • మూత్రపిండాలలో రాళ్ళు
  • క్రమరహిత గుండె స్పందన (స్పందనలో హెచ్చు తగ్గులు)
  • సృహకోల్పోవడం

ఈ లక్షణాలన్ని రక్తంలోని ఎక్కువ మోతాదులో కాల్సియం ఉండటానికి సూచన.

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 Lide, David R., ed. (2009). CRC Handbook of Chemistry and Physics (90th ed.). Boca Raton, Florida: CRC Press. ISBN 978-1-4200-9084-0.
  2. "CALCIUM CHLORIDE (ANHYDROUS)". ICSC. International Programme on Chemical Safety and the European Commission.
  3. Seidell, Atherton; Linke, William F. (1919). Solubilities of Inorganic and Organic Compounds (2nd ed.). New York: D. Van Nostrand Company. p. 196.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 Anatolievich, Kiper Ruslan. "Properties of substance: calcium chloride". chemister.ru. Retrieved 2014-07-07.
  5. 5.0 5.1 Pradyot, Patnaik (2003). Handbook of Inorganic Chemicals. The McGraw-Hill Companies, Inc. p. 162. ISBN 0-07-049439-8.
  6. 6.0 6.1 6.2 6.3 Müller, Ulrich (2006). Inorganic Structural Chemistry (2nd ed.). England: John Wiley & Sons Ltd. p. 33. ISBN 978-0-470-01864-4. {{cite book}}: |work= ignored (help)
  7. 7.0 7.1 7.2 మూస:Sigma-Aldrich
  8. "MSDS of Calcium chloride". fishersci.ca. Fisher Scientific. Retrieved 2014-07-07.