కాళిమఠ్ (ఉత్తరాఖండ్)
కాళీమఠ్
కవిల్త | |
---|---|
గ్రామం | |
Coordinates: 30°33′50″N 79°05′06″E / 30.563887°N 79.085083°E | |
Country | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తరాఖండ్ |
జిల్లా | రుద్రప్రయాగ |
జనాభా (2001) | |
• Total | దాదాపు 2 లక్షలు |
Languages | |
• Official | Hindi |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 246439 |
Vehicle registration | UK |
సమీప నగరం | గుప్తకాశీ |
Sex ratio | 1032/1000 ♀/♂ (2001) |
Literacy | 68.86% (2001) |
కాళిమఠ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న ఒక గ్రామం.
భౌగోళికం
[మార్చు]ఇది హిమాలయాలలో సరస్వతి నదికి సుమారు 6,000 అడుగుల (1,800 మీ) ఎత్తులో ఉంది, దాని చుట్టూ కేదార్‌నాథ్ శిఖరాలు ఉన్నాయి. కాళిమఠ్ ఉఖీమఠ్, గుప్తకాశీకి సమీపంలో ఉన్నాయి.
మతం
[మార్చు]అక్కడి హిందూ దేవత కాళి ఆలయాన్ని భక్తులు ఏడాది పొడవునా, ముఖ్యంగా నవరాత్రుల సమయంలో సందర్శిస్తారు.[1] ఇది శ్రీమద్ దేవి భగవత్ ప్రకారం భారతదేశంలోని 108 శక్తిపీఠాలలో ఒకటి.[2]
శ్రీ యంత్ర భక్తికి సంబంధించినది. ప్రతి సంవత్సరం అర్ధరాత్రి పూజ వేళలో కాళి విగ్రహాన్ని బయటకు తీసి, ఆలయంలో పూజిస్తారు, దీనికి, ప్రధాన పూజారి మాత్రమే హాజరవుతారు.[3] ఈ ఆలయానికి సమీపంలో లక్ష్మిదేవి, సరస్వతి, గౌరీ శంకర్, అనేక పురాతన శివలింగాలు, నంది, గణేష్ విగ్రహాలు మొదలైనవి ఉన్నాయి.
లక్ష్మీ ఆలయంలో నిత్య జ్వాల ఎప్పుడూ మండుతుంది. భైరవ మందిరం దీనికి సమీపంలో ఉంది.[4]
యాత్రికులు బస చేయగలిగేలా సత్పాల్ మహారాజ్ ఆలయానికి సమీపంలో ఒక చిన్న ధర్మశాల ఏర్పాటు చేశారు. తూర్పున సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంజేతి గ్రామంలో మాతా మననా దేవి, మంకమేశ్వర్ మహాదేవ్ దేవాలయాలు ఉన్నాయి. కాళిమఠ్ నుండి 6 కి. మీ. ల దూరంలో ఒక కొండ పైభాగంలో భారీ కాళీశిల, మరొక కాళీ ఆలయం ఉన్నాయి.
ప్రత్యేకత
[మార్చు]ఈ గ్రామం సంస్కృత కవి కాళిదాస్ జన్మస్థలం.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Kalimath: District of Rudraprayag, Uttarakhand, India". rudraprayag.nic.in. Archived from the original on 2011-10-23.
- ↑ "Shri Badrinath - Shri Kedarnath Temple Committee". Archived from the original on 28 March 2013. Retrieved 2012-09-03..
- ↑ 3.0 3.1 "Kalimath, Kalimath in Rudraprayag, Rudraprayag Villages, Uttarakahnd Villages, Uttaranchal Villages, Rudraprayag, Villages, Uttarakhand, Uttaranchal". Archived from the original on 23 December 2011. Retrieved 22 March 2012. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "auto" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Kalimath". wikimapia.org (in ఇంగ్లీష్). Retrieved 2019-03-19.