కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ | |||
శాసనమండలి సభ్యుడు
| |||
పదవీ కాలం 2007–2011 | |||
మన పార్టీ అధ్యక్షుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం ఆగష్టు 2007 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | బాచుపల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం[1] | 1954 ఆగస్టు 19||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | మన పార్టీ తెలుగుదేశం పార్టీ (2007 వరకు) కాంగ్రెస్ పార్టీ (2018 - 2022 అక్టోబరు 14) తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | కాసాని రాములు | ||
జీవిత భాగస్వామి | కాసాని చంద్రకళ | ||
సంతానం | రాజేశ్వరి, మాధవి , శిల్పా, కాసాని సాయి రాజేంద్రప్రసాద్ | ||
నివాసం | కుత్బుల్లాపూర్ |
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు.[3][4] ఆయన ప్రస్తుతం తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు.[5]
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[6] కాసాని జ్ఞానేశ్వర్ 2022 అక్టోబరు 14న హైదరాబాద్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు.[7] ఆయన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా 2022 నవంబరు 04న నియమితుడయ్యాడు.[8]
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో మనస్థాపంతో చెందిన ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేశాడు.[9][10] ఆయన 2023 నవంబరు 03న మర్కూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాడు.[11]
నిర్వహించిన పదవులు
[మార్చు]పదవి కాలం | బాధ్యత |
---|---|
2001–2006 | రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ |
2007–2011 | ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు |
2007– ప్రస్తుతం | మన పార్టీ అధ్యక్షుడు |
1975–1987 | ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు |
1987–1993 | రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి |
1993 | రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి |
1999 | ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు |
2005 | తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు |
2022-2023 | తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు |
మూలాలు
[మార్చు]- ↑ CEO Telangana (2010). "Kasani Gnaneshwar Affidavit" (PDF). Retrieved 9 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Eenadu (14 March 2024). "సాధారణ కార్యకర్తగా మొదలై రాష్ట్రస్థాయికి". Archived from the original on 14 March 2024. Retrieved 14 March 2024.
- ↑ "Mana Party launched". The Hindu. 21 August 2007.
- ↑ "93 BC bodies form party in Andhra". Tribune India. 16 July 2007. Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 12 మే 2022.
- ↑ Namasthe Telangana (18 October 2021). "'ముదిరాజ్ మహాసభ' @100". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
- ↑ Deccan Chronicle (12 December 2018). "Telangana polls: It was a mixed luck for the wealthiest of the lot" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
- ↑ Andhra Jyothy (14 October 2022). "టీడీపీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2022. Retrieved 14 October 2022.
- ↑ Eenadu (4 November 2022). "తెదేపా తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్". Archived from the original on 4 November 2022. Retrieved 4 November 2022.
- ↑ Eenadu (30 October 2023). "తెదేపాకు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా". Archived from the original on 30 October 2023. Retrieved 30 October 2023.
- ↑ Sakshi (30 October 2023). "తెలంగాణ టీడీపీకి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా". Archived from the original on 30 October 2023. Retrieved 30 October 2023.
- ↑ Andhrajyothy (3 November 2023). "బీఆర్ఎస్‌లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్". Archived from the original on 3 November 2023. Retrieved 3 November 2023.