కిలాడి సింగన్న
స్వరూపం
కిలాడి సింగన్న (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఐ.ఎన్.మూర్తి |
---|---|
నిర్మాణ సంస్థ | సుప్రజ పిక్చర్స్ |
భాష | తెలుగు |
కిలాడి సింగన్న 1971లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి ఐ.ఎన్.మూర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఎస్ . వి. రంగారావు, వాణీశ్రీ, నాగభూషణం , చంద్రమోహన్, హరనాథ్, మున్నగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎస్.కోదండపాణి అందించారు.
నటవర్గం
[మార్చు]- ఎస్.వి.రంగారావు
- వాణిశ్రీ
- నాగభూషణం
- విజయలలిత
- హరనాథ్
- సూర్యకాంతం
- చంద్రమోహన్
- జూనియర్ కాంచన
- రాజబాబు
- విజయశ్రీ
- అర్జా జనార్ధనరావు
- కల్పన
- పెమ్మసాని రామకృష్ణ
- రమణారెడ్డి
- రత్నశ్రీ
- విజయరాధిక
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఐ.ఎన్.మూర్తి
- మాటలు : కొండేపూడి లక్ష్మీనారాయణ
- పాటలు: కొసరాజు
- సంగీతం: ఎస్.పి.కోదండపాణి
- ఛాయాగ్రహణం: కన్నప్ప
- కూర్పు: కె.బాబు
- కళ: బి.చలం
- నృత్యం: వెంపటి చినసత్యం, చిన్ని సంపత్, తంగరాజు
- స్టంట్: ఆర్.రాఘవులు
- నిర్మాణ సంస్థ: సుప్రజ పిక్చర్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలను కొసరాజు రచించగా ఎస్.పి.కోదండపాణి స్వరపరిచాడు.
క్ర.సం | పాట | పాడినవారు |
---|---|---|
1 | ముంతకింద పప్పు ఎలాగుందో చెప్పు ఉప్పు కారం కలిపిన బలే శనగపప్పు | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
2 | మామా ఓయ్ మామా సైరా ఇటు రారా | ఎల్.ఆర్.ఈశ్వరి |
3 | నవ్వులరాణీ కవ్విస్తూంది నా రాజా నీకూ నాకూ జోడైతేనే ఉంది మజా | ఎల్.ఆర్.ఈశ్వరి |
4 | వయ్యారి వాలుచూపుల మంగమ్మో వళ్ళోన ఒరిగిపోతా రావమ్మో | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి |