కిలోమీటరు
Appearance
(కి.మీ. నుండి దారిమార్పు చెందింది)
కిలోమీటరు (Kilometer:గుర్తు km) అనేది 1000 మీటర్ల పొడుగుకి సమానం. ఇది మెట్రిక్ పద్ధతిలో దూరాన్ని కొలవడానికి వాడే కొలమానం.
- మొదట్లో, అనగా సా. శ. 1793 లో, మీటరు అంటే భూమి ఉత్తర ధ్రువం నుండి భూమధ్యరేఖ్హ వరకు ఉన్న దూరంలో పది మిలియనవ వంతు అని అనుకునేవారు.
- తరువాత, సా. శ. 1799లో, పేరిస్ లో దాచిన ఒక ప్లేటినం-ఇరిడియం కడ్డీ పొడుగుని మీటరుకి ప్రమాణంగా వాడేవారు.
- తరువాత, సా. శ. 1960లో, క్రిప్టాన్-86 వెలువరించే కాంతి యొక్క తరంగపు పొడుగుతో ముడి పెట్టారు
- ఇప్పుడు, సా. శ. 1983 నుండి, మీటరు అంటే 1/299 792 458 సెకండు కాల వ్యవధిలో కాంతి శూన్యంలో ప్రయాణించే దూరం అని స్థిరపరచేరు.
ఇతర దూరమానాలతో పోలిక
[మార్చు]ఈ క్రింది దూరాలు 1 కిలోమీటరుకు సమానం:
1 kilometre ≡ 1000 మీటర్లు ≈ 3281 అడుగులు ≈ 1094 గజాలు ≈ 0.621 మైళ్లు ≈ 0.540 నాటికల్ మైళ్లు ≈ 6.68×10−9 astronomical units[1] ≈ 1.06×10−13 కాంతి సంవత్సరాలు లేదా జ్యోతిర్వర్షాలు[2] ≈ 3.24×10−14 పార్సెక్లు
- (1 మీటరు = 0.001 కిలోమీటర్లు)
- (1 మైలు = 1.609344 కిలోమీటర్లు)
- సూత్రం: "కిలోమీటర్లని 5 తో గుణించి, 8 తో భాగిస్తే మైళ్లు వస్తాయి"
- (1 అంతర్జాతీయ గజం = 0.0009144 కిలోమీటర్లు)
- (1 అడుగు = 0.0003048 కిలోమీటర్లు)
కొన్ని ముఖ్యమైన కొలతలు (కిలోమీటర్లలో)
[మార్చు]- భూమద్యరేఖ దగ్గర భూమి వ్యాసం = 2 x 3,963 miles (2 x 6,378 kilometers)
- భూమి నుండి సూర్యుడి వరకు సగటు దూరం = 92,955,807 miles (149,597,870 km)
- సూర్యుడి సగటు వ్యాసం = 2 x 432,450 miles (2 x 696,000 kilometers)