కుందనపుబొమ్మ
కుందనపు బొమ్మ (2016 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వర ముళ్ళపూడి |
---|---|
నిర్మాణం | జి.అనిల్ కుమార్, రాజు, జి.వంశీకృష్ణ |
తారాగణం | చాందినీ చౌదరి, సుధాకర్ కోమాకుల, సుధీర్ వర్మ, నాగినీడు, షకలక శంకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ |
సంగీతం | ఎం.ఎం. కీరవాణి |
సంభాషణలు | అనురాధా ఉమర్జీ, గౌతమ్ కాశ్యప్, |
ఛాయాగ్రహణం | ఎస్.డి.జాన్ |
నిర్మాణ సంస్థ | ఎస్.ఎల్.ఎంటర్టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | జూన్ 24 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పెట్టుబడి | తెలుగు |
కుందనపుబొమ్మ ముళ్ళపూడి వెంకటరమణ గారి అబ్బాయి, వర ముళ్ళపూడి దర్శకత్వంలో నిర్మించిన తెలుగు సినిమా.[1]
కథ
[మార్చు]విజయనగరం దగ్గర ఓ పల్లెటూళ్లో ఉండే మహదేవరాజు (నాగినీడు) ది మాటంటే మాటే. ఆ ముద్దుల కుమార్తే సుచి (చాందిని చౌదరి) . ప్రాణానికి ప్రాణంలా చూసుకునే ఆమెను పుట్టినప్పుడే తన మేనల్లుడు గోపి (సుధాకర్) కి ఇచ్చి చేయాలని ఫిక్స్ చేసి ప్రకటించేస్తాడు. అయితే తండ్రి చాటు పిల్లలా బిల్డప్ ఇచ్చే సుచి బయిటకు వస్తే బస్తేమే సవాల్ అనే అల్లరి పిల్ల. అల్లరిలో భాగంగా ఓ దొంగతనం చేస్తూండగా వాసు (సుధీర్ వర్మ) చూస్తాడు.[2] ఆమె ప్రేమలో పడి ఆమెను ప్రేమించే ప్రయత్నాలు చేస్తాడు. వీళ్ల ప్రేమ వ్యవహారం గమనించిన ఆమె బావ గోపి కూడా సపోర్ట్ చేస్తాడు. అంతవరకూ బాగానే ఉన్నా హఠాత్తుగా ఓ ట్విస్ట్ వచ్చి ఈ ప్రేమ కథలో పడుతుంది. గోపీ ఎట్టిపరిస్దితుల్లో సుచినే చేసుకుంటాను అని ఇంట్లో ప్రకటిస్తాడు.
విశ్లేషణ
[మార్చు]కుందనపు బొమ్మ” అనే స్వచ్ఛమైన తెలుగు పేరును, ఆకర్షణీయంగా అగుపిస్తున్న పోస్టర్లు చూసి, “ఇదేదో పల్లెటూరి స్వచ్చమైన ప్రేమకథ” అని భావించి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను ఈ సినిమా దారుణంగా నిరాశపరుస్తుంది. కథనంలో క్లారిటీ లేకపోవడంతో అప్పటికే థియేటర్ లో కూర్చోవడానికి చాలా ఇబ్బందిపడుతున్న ప్రేక్షకుడిని, నటీనటుల దారుణమైన నట ప్రదర్శన ఎక్కడలేని తలపోటును తెచ్చిపెడుతుంది. ఇక కొత్తగా ట్రై చేద్దామని ప్రయత్నించి.. అత్యంత హేయంగా చిత్రీకరించిన పాటలు “థియేటర్ నుంచి పారిపోదామా” అని ప్రేక్షకుడు అనుకునే స్థాయిలో ఉన్నాయి.[3]