సుధీర్ వర్మ (నటుడు)
స్వరూపం
సుధీర్ వర్మ | |
---|---|
మరణం | 2023 జనవరి 23 |
మరణ కారణం | ఆత్మహత్య |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2013 - 2023 |
సుధీర్ వర్మ భారతీయ యువ నటుడు. ఆయన ప్రధానంగా తెలుగు సినిమాల్లో నటించాడు. అలాగే కొణిదెల సుస్మిత నిర్మించిన షూటౌట్ ఎట్ ఆలేర్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు.
జీవిత గమనం
[మార్చు]2013లో కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన సెకండ్ హ్యాండ్ సినిమాతో ఆయన అరంగేట్రం చేసాడు. 2016లో వచ్చిన కుందనపు బొమ్మ చిత్రంలో ఆయన నటించాడు. ఈ చిత్రానికి ముళ్ళపూడి వెంకటరమణ కుమారుడు వర ముళ్ళపూడి దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత సుధీర్ వర్మ మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లలో కూడా కీలక పాత్రలను పోషించాడు.
మరణం
[మార్చు]సుధీర్ వర్మ విశాఖపట్టణం లోని అతని నివాసంలో 2023 జనవరి 23న ఆత్మహత్య చేసుకున్నాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Sudheer Varma: టాలీవుడ్‌లో విషాదం.. నటుడు సుధీర్‌వర్మ ఆత్మహత్య". web.archive.org. 2023-01-23. Archived from the original on 2023-01-23. Retrieved 2023-01-23.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)