కుప్పా సూర్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కుప్పా సూర్యనారాయణ ప్రముఖ రంగస్థల నటులు.

జననం

[మార్చు]

సూర్యనారాయణ తెనాలి సమీపంలోని అనంతవరం గ్రామంలో 1910లో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

లతాంగి అనే నాటకంలో లతాంగి పాత్ర ద్వారా రంగస్థలంలోకి ప్రవేశించారు. గుంటూరు లోని బాలమిత్ర, త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి ఆధ్వర్యంలో తెనాలిలో నడచిన బాలరత్న సభలోనూ పాత్రలు ధరించారు.

చిన్న వయసులోనే శ్రీకృష్ణ పాత్రలు కూడా ధరించారు. 1934లో హెచ్.యం.వి. కంపెనీ వారు శాకుంతలం నాటకంలో సూర్యనారాయణ పోషించిన దుష్యంతుడు పాత్ర పద్యాలను రికార్డులగా విడుదలచేశారు. ప్రముఖ నటులైన ఏ.వి.సుబ్బారావుకు శ్రీకృష్ణ పాత్రలో మెళకువలు నేర్పారు.

నటించిన నాటకాలు - పాత్రలు

[మార్చు]
  1. లతాంగి - లతాంగి
  2. రాధాకృష్ణ - శ్రీకృష్ణడు
  3. తులాభారం - శ్రీకృష్ణడు
  4. చింతామణి - భవానీ
  5. పాదుక - దశరథుడు, రాముడు
  6. గయోపాఖ్యానం - శ్రీకృష్ణడు, అర్జునుడు
  7. శకుంతలం - దుష్యంతుడు
  8. రామదాసు - రామదాసు
  9. - ధర్మరాజు
  10. - కర్ణుడు
  11. - అశ్వత్ధామ

మరణం

[మార్చు]

దాదాపు అయిదు దశాబ్ధాలపాటు నాటకరంగంలో కృషిచేసిన సూర్యనారాయణ 1981, ఏప్రిల్ 16 న మరణించారు.

మూలాలు

[మార్చు]
  • కుప్పా సూర్యనారాయణ, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 303.