Jump to content

కె.సి. ఇబ్రహీం

వికీపీడియా నుండి
కె.సి. ఇబ్రహీం
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఖన్‌మొహమ్మద్ కాసంభాయ్ ఇబ్రహీం
పుట్టిన తేదీ(1919-01-26)1919 జనవరి 26
బొంబాయి, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ2007 నవంబరు 12(2007-11-12) (వయసు 88)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 45)1948 నవంబరు 10 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1949 ఫిబ్రవరి 4 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 4 60
చేసిన పరుగులు 169 4716
బ్యాటింగు సగటు 21.12 61.24
100లు/50లు 0/1 14/22
అత్యధిక స్కోరు 85 250
వేసిన బంతులు 0 408
వికెట్లు - 4
బౌలింగు సగటు - 46.75
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - -
అత్యుత్తమ బౌలింగు - 1/2
క్యాచ్‌లు/స్టంపింగులు 0/- 15/-
మూలం: Cricinfo, 20 December 2020

ఖాన్‌మహమ్మద్ కాసుంబోయ్ ఇబ్రహీం (1919 జనవరి 2 6- 2007 నవంబరు 12) 1948-49 సీజన్‌లో నాలుగు టెస్టులు ఆడిన భారతీయ క్రికెటరు.

క్రికెట్ కెరీర్

[మార్చు]

ఇబ్రహీం బొంబాయిలో జన్మించాడు. సెయింట్ జేవియర్ కళాశాలలో చదివాడు. అతను బాంబే తరపున 1938-39 నుండి 1949-50 వరకు టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా దేశీయ క్రికెట్ ఆడాడు. అప్పుడప్పుడు బ్యాటింగు ఓపెనింగు కూడా చేసాడు. బాంబే పెంటాంగులర్‌లో ముస్లింల తరపున ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వరుసగా రెండు అవుట్‌ల మధ్య అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇబ్రహీంకు ఉంది: [1] 1947-48లో, అతను వరుస ఇన్నింగ్స్‌లలో 218, 36, 234, 77 - అన్నీ నాటౌట్లే చేసాడు. ఆ తర్వాతి ఇన్నింగ్సులో 144 వద్ద అవుటయ్యాడు. ఈ మొత్తం 709 పరుగులు చేశాడు.[1] వరుసగా రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో, మొత్తం ఇన్నింగ్సంతా ఆడి ఆ రెండు సార్లూ డబుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు ఇబ్రహీం. [2] ఆ సీజన్‌లో అతను 167.29 బ్యాటింగ్ సగటుతో 1,171 పరుగులు చేశాడు. 1948లో ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. 1948 రంజీ ట్రోఫీని గెలుచుకున్న బాంబే జట్టుకు ఇబ్రహీం కెప్టెన్‌. ఫైనల్‌లో 219 పరుగులు చేశాడు.

అతని ఫస్ట్ క్లాస్ కెరీర్ బ్యాటింగ్ సగటు 61.24. చరిత్రలో ఇది తొమ్మిదో అత్యధికం (కనీసం 50 సార్లు బ్యాటింగ్ చేసిన వారిలో).[3] అతను 1948-49లో వెస్టిండీస్‌పై నాలుగు టెస్టులు ఆడాడు. వినూ మన్కడ్‌తో కలిసి బ్యాటింగ్ ప్రారంభించి, మొదటి టెస్టులో 85. 44 పరుగులు చేశాడు.[4] అయితే తర్వాతి ఆరు టెస్టు ఇన్నింగ్స్‌లలో 40 పరుగులు మాత్రమే చేశాడు.

క్రికెట్ నుంచి రిటైర్మెంట్

[మార్చు]

వృద్ధాప్యంలో అతను అనారోగ్యంతో బాధపడ్డాడు. 88 సంవత్సరాల వయస్సులో పాకిస్తాన్‌లో కరాచీలోని తన స్వగృహంలో మరణించాడు. అతను మరణించే సమయానికి జీవించి ఉన్న భారతీయ టెస్టు క్రికెటర్లలో అత్యంత వృద్ధుడు.[5]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Frindall, Bill (2009). Ask Bearders. BBC Books. p. 86. ISBN 978-1-84607-880-4.
  2. Frindall, Bill (1998). The Wisden Book of Cricket Records (Fourth ed.). London: Headline Book Publishing. pp. 116. ISBN 0747222037.
  3. "Highest averages". Cricinfo. Retrieved 20 December 2020.
  4. "1st Test, Delhi, Nov 10 - Nov 14 1948, West Indies tour of India". Cricinfo. Retrieved 21 December 2020.
  5. Wisden 2008, p. 1561.