కె. నారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె. నారాయణ

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం (1949-12-07) 1949 డిసెంబరు 7 (వయసు 74)
ఆయనంబాకం గ్రామం, నగరి మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ సీపీఐ
తల్లిదండ్రులు సుబ్బనాయుడు, ఆదిలక్ష్మి
జీవిత భాగస్వామి వసుమతి[1]
నివాసం హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు

కంకణాల నారాయణస్వామి నాయుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.[2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

కె. నారాయణ, 1949 డిసెంబరు 7 న ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా, నగరి మండలం, ఆయనంబాకం గ్రామంలో సుబ్బనాయుడు, ఆదిలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఆయన నగరి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ, మదనపల్లె బీటీ కాలేజీలో పీయూసీ పూర్తి చేసి గుంటూరులో ఆయుర్వేదం (అల్లోపతి) పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

కె. నారాయణ 1970 దశకంలో రాజకీయాల్లోకి వచ్చి గుంటూరు జిల్లా ఏఐఎస్‌ఎఫ్ భాద్యతలు స్వీకరించాడు. ఆయన 1973లో ఏఐఎస్‌ఎఫ్‌కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా మూడేళ్ల పాటు పని చేశాడు. నారాయణ 1976లో రాయలసీమ విద్యార్థి, యువజన సంఘం భాద్యుడిగా ఎనిమిదేళ్ల పాటు భాద్యతలు నిర్వహించాడు. నారాయణ 1986లో చిత్తూరు జిల్లాపార్టీ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1995లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా, జాతీయ సమితి సభ్యుడిగా, 1999లో సీపీఐ పార్టీ సహాయ కార్యదర్శిగా నియమితుడయ్యాడు.

ఆయన 2002 లో సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, 2007 డిసెంబరులో తిరుపతిలో జరిగిన మహాసభల్లో రెండో సారి, 2012 ఫిబ్రవరిలో కరీంనగర్‌లో జరిగిన మహాసభల్లో మూడోసారి వరుసగా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నాడు. కె. నారాయణ 2014 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (14 April 2022). "సీపీఐ నారాయణకు సతీవియోగం". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  2. Sakshi (6 April 2014). "మాట మసాలా". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
  3. Electiontak (2019). "KANKANALA NARAYANA - Khammam - Lok Sabha Election Results 2014". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.