Jump to content

కేకే శైలజ

వికీపీడియా నుండి
కేకే శైలజ
కేకే శైలజ


కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ , సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
25 మే 2016 – 19 మే 2021
ముందు వి.ఎస్.శివకుమార్
తరువాత వీణ జార్జ్
నియోజకవర్గం కుతుపరంబ

వ్యక్తిగత వివరాలు

జననం (1956-11-20) 1956 నవంబరు 20 (వయసు 68)
కూతుపరంబ, కన్నూరు జిల్లా, కేరళ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ సీపీఎం
తల్లిదండ్రులు
  • కె.కుందన్
  • కె.కె.శాంత
జీవిత భాగస్వామి కె. భాస్కరన్
సంతానం లసిత్, శోభిత
పూర్వ విద్యార్థి
  • బీఎస్సీ - ఫిజిక్స్ పజస్సి రాజా ఎన్.ఎస్.ఎస్ కళాశాల, మట్టన్నూర్
  • విశ్వేశ్వరయ్య కళాశాల నుండి బి.ఈ.డి

కేకే శైలజ కేరళ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమెను ప్రజలు ముద్దుగా శైలజ టీచర్‌గా పిలుస్తుంటారు.[1] పిన‌ర‌యి విజ‌య‌న్ కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసింది. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మట్టన్నూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది.[2]

కేకే శైలజ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వటకర లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయింది.[3]

జననం & విద్యాభాస్యం

[మార్చు]

కేకే శైలజ 1956, నవంబరు 20న కేరళ రాష్ట్రం, కన్నూర్ జిల్లాలోని మట్టన్నూర్ గ్రామంలో కె.కెకుందన్, శాంత దంపతులకు జన్మించింది. ఆమె శివపురంలో పదవ తరగతి వరకు చదువుకొని, మట్టన్నూర్ ఎన్‌.ఎస్‌.ఎస్‌ కళాశాలలో భౌతిక, రసాయన శాస్త్రంలో బిఎస్సీ పూర్తి చేసింది.[4]

వైవాహిక జీవితం & పిల్లలు

[మార్చు]

శైలజ కొంతకాలం టీచర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసింది. ఆమెకు 1981లో భాస్కరన్ (రిటైర్ హెడ్ మాస్టర్) తో వివాహం జరిగింది. వారికీ ఇద్దరు కుమారులు లసిత్, శోబిత్ ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

కేకే శైలజ కమ్యూనిస్ట్ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. ఆమె 1980లో డెమోక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ అఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) లో పనిచేసింది. 1980లో బీఎడ్‌ పూర్తి చేసింది. ఆ తర్వాత కన్నూరులోని శివపురం హైస్కూల్లో ఉపాధ్యాయురాలిగా చేరింది. ఉపాధ్యాయ సంఘంలోనూ తన వంతు పాత్ర పోషించింది. 17 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో వుండి ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసి పూర్తికాలం కార్యకర్తగా సిపిఎం పార్టీలో చేరింది. ఐద్వా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నో మహిళా పోరాటాలకు నాయకత్వం వహించింది. శైలజ ఐద్వా ఆధ్వర్యంలో వెలువడిన స్త్రీ శబ్దం ప్రెత్రికకు ఎడిటర్ గా పనిచేసింది.[5]

కేకే శైలజ 1996లో కూతుపరంబ శాసనసభ నియోజకవర్గం నుండి గెలిచి తొలిసారి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగు పెట్టింది. 2006లో పెరవూర్‌ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచింది. కేకే శైలజ 2016లో కూతుపరంబ శాసనసభ నియోజకవర్గం నుండి గెలిచి ఓట్ల మెజారిటీతో గెలిచి, పినరయి విజయన్ కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించింది. ఆమె 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మట్టనూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 61035 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది.

కేరళ ఆరోగ్య మంత్రిగా

[మార్చు]

కేకే శైలజ ఆరోగ్యమంత్రిగా కరోనా సమయంలో రాష్ట్రంలో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి అందరినీ అప్రమత్తం చేస్తూ పనిచేసింది. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవటంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజతో పాటు కేరళ ప్రభుత్వ కృషిని ఐక్యరాజ్య సమితి అభినందించింది.[6] ఆమె ప్రభుత్వాస్పత్రుల్లోనూ ఆక్సిజన్ ఉత్పాదక ప్లాంట్లను ఏర్పాటు చేసింది. రోజుకు 140 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించింది. కరోనాపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి.. అవగాహన పెంపొందించారు.[7]

మూలాలు

[మార్చు]
  1. The News Minute (18 March 2021). "The making of KK Shailaja: From school teacher to Kerala minister". Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
  2. ఆంధ్రజ్యోతి (2 May 2021). "60 వేల మెజారిటీతో కేకే శైలజ ఘన విజయం". www.andhrajyothy.com. Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Vatakara". Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
  4. "K. K. SHAILAJA TEACHER" (PDF). Kerala Niyamasabha. Retrieved 19 May 2020.
  5. Nava Telangana (4 July 2020). "ఆదర్శ కేరళ.. శైలజ టీచర్‌". Retrieved 5 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  6. NDTV. "Kerala Health Minister Joins UN Panel Talk On Covid On Public Service Day". Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
  7. Sakshi (24 June 2020). "కేరళ ఆరోగ్య మంత్రికి యూఎన్‌ ప్రశంసలు". Sakshi. Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=కేకే_శైలజ&oldid=4288094" నుండి వెలికితీశారు