కొడాలి వీరయ్య
డాక్టర్ కొడాలి వీరయ్య | |
---|---|
దస్త్రం:Dr Kodali Veeraiah chowdary.jpg | |
జననం | 1928 ఆగస్టు 20 గుంటూరు జిల్లా అమృతలూరు మండలం మోపర్రు గ్రామం |
మరణం | 2000 డిసెంబర్ 12 |
విశ్వవిద్యాలయాలు | ఆంధ్రా మెడికల్ కాలేజి, విశాఖ పట్నం |
వృత్తి | సుప్రసిద్ధ వైద్యులు, తెనాలి |
పదవి పేరు | ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు |
పదవీ కాలం | 1985 -1989 |
రాజకీయ పార్టీ | తెలుగు దేశం |
మతం | హిందువు |
భార్య / భర్త | శ్రీమతి అన్నపూర్ణ |
డాక్టర్ కొడాలి వీరయ్య (1928 - 2000) సుప్రసిద్ధ వైద్యులు, ప్రజా సేవకులు. ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులుగా (1985 - 1989) పనిచేసారు.
జననం. విద్య
[మార్చు]కొడాలి వీరయ్య గారు గుంటూరు జిల్లా అమృతలూరు మండలం మోపర్రు గ్రామంలో ఒక రైతు కుటుంభంలో 1928 ఆగస్టు 20న జన్మించారు. 1950 లో విశాఖ పట్నం ఆంధ్రా మెడికల్ కాలేజి నుండి పట్టబద్రుడైనాడు. వైద్య విద్యలో రెండవ ర్యాంకు తో బంగారు పతకం సాధించారు. 1952 లో తన మిత్రుడు డాక్టర్ కుర్రా వీరరాఘవయ్య గారితో కలసి తెనాలిలో వైద్యశాలను స్థాపించి పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించారు. వీరి దర్మపత్ని శ్రీమతి అన్నపూర్ణ గారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం సెనెట్ సభ్యునిగా పనిచేసారు.[1] వీరు తుదివరకు తమ ఆసుపత్రిలో పేదవారికి ఉచిత వైద్యం అందిస్తూ అతి తక్కువ కర్చుతో వైద్యం అందించి ప్రజావైద్యునిగా పేరు పొందారు.
రాజకీయ జీవితం
[మార్చు]గ్రామీణ ప్రజలపై ఆపేక్షతో, రైతాంగ హక్కుల కొరకై వీరయ్య గారు రాజకీయ రంగప్రవేశం చేసారు.1978లో జనతా పార్టీ అభ్యర్దిగా వేమూరు నుండి పోటి చేసి యడ్లపాటి వెంకట్రావు గారిపై ఓడిపోయారు.
నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపింవిన తరువాత కొంతకాలానికి ఆ పార్టీలో చేరిన వీరయ్య చౌదరి 1985లో వేమూరు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. రాజకీయాల్లోనూ ఆయన తాను నమ్మిన విలువలకు కట్టుబడే ఉన్నాడు.
మరణం
[మార్చు]ఉత్తమ ప్రజావైద్యునిగా,నిడారంబ రాజకీయ వేత్తగా తుదివరకు ప్రజాసేవలో జీవించిన కొడాలి వీరయ్య చౌదరి 2000 డిసెంబర్ 12న తుది శ్వాస వదిలారు.
- తెనాలిలో వీరి గౌరవార్డం డాక్టర్ కొడాలి వీరయ్య మునిసిపల్ పార్క్ ను 2017 డిసెంబర్ 4న అమృత (2015 - 2016) పధకం ద్వారా నిర్మించారు.[2]
- డాక్టర్ కొడాలి వీరయ్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్, తెనాలి ఆధ్వర్యంలో, వారి మనుమరాలు ప్రియబాంధవి, అనేక సమాజక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వామనగుంట పాలెం లో వీరయ్య గారి శిలా విగ్రహం నిర్మించారు.
మూలాలు
[మార్చు]- ↑ లక్ష్మీ నారాయణ, కొడాలి (1972). డా.కొడాలి వీరయ్య పరిచయం - మొదటి సంపుటి.కాశీ చరిత్ర. తెనాలి: భారత ఇతిహాస పరిశోధక మాల. p. 208.
- ↑ E- News Letter. Inauguration of Kodali Veeraiah (AMRUT 2015-16) Park (PDF). Tenali Municipality. pp. 3–4.