కోనేరు నాగేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోనేరు నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన కృష్ణా జిల్లా మారేడుమాక గ్రామంలో అత్యుతరామయ్య, సీతమ్మ దంపతులకు రెండవ సంతానంగా 1937 ఆగష్టు 30 న జన్మించాడు. 1954లో ఫారెస్టు కాంట్రాక్టర్‌గా కొత్తగూడెం వచ్చి ఆయన ఇక్కడే స్థిరపడ్డాడు. 1959లో ధనలక్ష్మిని వివాహం చేసుకున్న ఆయనకు కూతురు ఉషారాణి, కొడుకులు పూర్ణచందర్‌రావు, సత్యనారాయణ ఉన్నారు.

రాజకీయ జీవితం[మార్చు]

1982 లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆయన 1983లో తొలిసారిగా కొత్తగూడెం శాసనసభ నియోకవర్గం నుంచి శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు.[2] తర్వాత 1985, 1994లో ఇదే నియోజకవర్గం నుంచి శాసన సభ్యుడిగా గెలిచాడు.[3][4] 1988లో ఎన్టీఆర్‌ కేబినెట్‌లో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు. 1991 నుంచి 1994 వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా సేవలందించాడు. 1985లో భద్రాచలం ట్రస్టుబోర్డు చైర్మన్‌గా, పాల్వంచ ఏపీ స్టీల్స్‌ చైర్మన్‌గా పనిచేశాడు.

లయన్స్‌ క్లబ్‌ గవర్నర్‌గా[మార్చు]

సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆయన లయన్స్‌ క్లబ్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేశాడు. 13 ఏళ్లుగా లయన్స్‌ క్లబ్‌ మల్టిపుల్‌ కౌన్సిల్‌ కన్వీనర్‌గా సేవలందిస్తున్న ఆయన ప్రస్తుతం లయన్స్‌ క్లబ్‌ 324 జిల్లాల గవర్నర్‌గా ఉన్నారు. 1981 నుంచి క్లబ్‌ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.[5]

మరణం[మార్చు]

ఆయన కొత్తగూడెంలోని శ్రీనగర్‌ కాలనీలో గల తన స్వగృహంలో 2016, ఆగస్టు 5, శుక్రవారం ఉదయం కన్నుమూశారు.[6]

మూలాలు[మార్చు]

  1. Eenadu (4 November 2023). "చట్టసభల్లో మన నాగేశ్వరరావులు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  2. "Andhra Pradesh Assembly Election Results in 1983". Archived from the original on 2016-03-03. Retrieved 2016-08-13.
  3. Andhra Pradesh Assembly Election Results in 1985
  4. "Andhra Pradesh Assembly Election Results in 1994". Archived from the original on 2016-09-05. Retrieved 2016-08-13.
  5. "కోనేరు ఇకలేరు". Archived from the original on 2016-08-12. Retrieved 2016-08-13.
  6. Sakshi (5 August 2016). "మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు కన్నుమూత". Archived from the original on 21 జూలై 2021. Retrieved 21 July 2021.

ఇతర లింకులు[మార్చు]