కోసూరివారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"కోసూరివారిపాలెం" కృష్ణా జిల్లా మోపిదేవి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కోసూరివారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం మోపిదేవి
ప్రభుత్వం
 - సర్పంచి కొల్లి చక్రపాణి
పిన్ కోడ్ 521 125
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామంలో చాలా మందికి ఇంటిపేరు "కోసూరు" అవ్వడం వలన ఆ పేరు వచ్చింది.

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 6 మీ.ఎత్తులో ఉంది.. కృష్ణా నది ఒడ్డునే ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

రేపల్లె, మోపిదేవి, చల్లపల్లి, పెద్ద కళ్లేపల్లి, రావి వారిపాలెం, చిరువోల్లంక నార్త్, నాగాయతిప్ప, అవనిగడ్డ, పులిగడ్డ

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మోపిదేవి, అవనిగడ్డ నుండి రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 64 కి.మీ.దూరంలో ఉంది

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

మాతృభాష, రాజభాష బోధకులు లేకున్నా, ఈ పాఠశాలలో, 2014-15 విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులు మొత్తం 14 మందీ ఉత్తీర్ణులై, పాఠశాలకు 100% ఉత్తీర్ణత సాధించారు. సనకా సౌభాగ్యలక్ష్మి, అను విద్యార్థిని, 9.7 గ్రేడ్ మార్కులతో ఉత్తీర్ణురాలై, పాఠశాలకూ, ఉపాధ్యాయులకూ, గ్రామానికీ పేరు తెచ్చిపెట్టినది. ఈమె ఐ.ఐ.ఐ.టి.లో గూడా సీటు సాధించడం విశేషం. ఈమెకు ఇంటరు నుండి బి.టెక్., వరకు ఉచితంగా విద్యనభ్యసించగల అవకాశం లభించింది. [4]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

  • నాబార్డ్ వారి సహాయంతో నిర్మించిన గ్రామ ముఖ్య రహదారి ఉంది.
  • పంచాయతీ రాజ్ శాఖ నిర్మించిన రూరల్ వాటర్ సప్లయ్ స్కీమ్ ఉంది.
  • ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పి.ఏ.సి.ఎస్), రైతుల ఆర్థిక అవసరాలను తీరుస్తున్నది.
  • పాల ఉత్పత్తి దారుల సహాయ కేంద్రం ద్వారా గ్రామ ప్రజలు పాలు ఉత్పత్తిలో జిల్లాలోనే ముఖ్య భూమిక వహించారు.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

. తక్కువ లోతులోనే మంచినీరు లభిస్తుంది.అందువలన, రైతులు మూడు పంటలు పండించి ఆర్థికాభిృద్ధికి సహాయపడుతూ ఉన్నారు.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం. వ్యవసాయాధారిత వృత్తులు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీరాములవారి దేవస్థానం[మార్చు]

ఈ ఆలయానికి గ్రామంలో 1.47 ఎకరాల మాన్యం భూమి ఉంది. [2]

క్రీస్తు దేవాలయం[మార్చు]

కులమత రహిత క్రీస్తు దేవాలయం గత 60 సంవత్సరాలుగా గ్రామంలో అందరి ప్రజల అభిమానాన్ని పొందినది. ప్రతి సంవత్సరం ఇక్కడ జనవరి-2న, గ్రామ, సమీప గ్రామాల ప్రజలు హాజరై తమ మొక్కులు చెల్లించుకుంటారు.

గ్రామ విశేషాలు[మార్చు]

మాగాణి భూములలో కొత్త పంటల ప్రయోగాలకు నెలవుగా ఈ గ్రామ రైతులు ఆదర్శంగా నిలుచుచున్నారు. దొండ పందిరి క్రింద అంతర పంటగా క్యారట్, ఉల్లి, తమలపాకు పంటలు సాగు చేస్తున్నారు. [3]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

  1. ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, సెప్టెంబరు-17; 1వపేజీ.
  2. ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, డిసెంబరు-1; 2వపేజీ.
  3. ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మార్చి-24; 1వపేజీ.
  4. ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, జూన్-9 & జూలై-5; 1వపేజీ.