క్రిస్టినా పిస్కోవా
అందాల పోటీల విజేత | |
జననము | ట్రినెక్, చెక్ రిపబ్లిక్ | 1999 జనవరి 19
---|---|
పూర్వవిద్యార్థి | చార్లెస్ విశ్వవిద్యాలయం ఎంసీఐ మేనేజ్‌మెంట్ సెంటర్ ఇన్స్‌బ్రక్ |
ఎత్తు | 1.81 m[1] |
జుత్తు రంగు | రాగి జుట్టు |
కళ్ళ రంగు | నీలం |
బిరుదు (లు) |
|
ప్రధానమైన పోటీ (లు) |
|
క్రిస్టినా పిస్జ్కోవా (ఆంగ్లం: Krystyna Pyszkova; జననం 1999 జనవరి 19) ఒక చెక్ రిపబ్లిక్ మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్.[2] ఆమె మిస్ వరల్డ్ 2023 కిరీటాన్ని పొందింది. ఆమె గతంలో మిస్ చెక్ రిపబ్లిక్ 2022 కిరీటాన్ని పొందింది. చెక్ రిపబ్లిక్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఆమె మిస్ వరల్డ్ గెలుచుకున్న రెండవ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు టటానా కుచరోవా మిస్ వరల్డ్ 2006 టైటిల్ అందుకుంది.
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో 2024 మార్చి 9న జరిగిన మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీల్లో క్రిస్టినా పిస్కోవా 71వ ప్రపంచ సుందరి టైటిల్‌ను గెలుచుకుంది.
ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా పాల్గొన్న మొత్తం 112 దేశాల సుందరీమణుల్లో ఆమె ప్రథమ స్థానంలో నిలిచింది. మిస్ వరల్డ్ 2021 విజేత పోలాండ్‌కు చెందిన కరోలినా బియాలావ్‌స్కా తన వారసురాలికి కిరీటాన్ని అందజేసింది. కాగా, లెబనాన్‌కు చెందిన యాస్మినా జైటౌన్ ఫస్ట్ రన్నరప్‌గా, భారతదేశానికి ప్రాతినిథ్యం వహించి సినీ శెట్టి టాప్-8 స్థానంలో నిలిచారు.[3] ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశసిన నీతా అంబానీకి మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు దక్కింది.
ప్రారంభ జీవితం
[మార్చు]క్రిస్టినా పిస్కోవా చెక్ రిపబ్లిక్(Czech Republic) దేశంలోని ట్రినెక్(Trinec) నగరంలో జన్మించింది. ఆ తరువాత, వారి కుటుంబం ఆ దేశ రాజధాని ప్రాగ్కు మకాం మార్చారు. మిస్ చెక్ రిపబ్లిక్ గెలవడానికి ముందు, ఆమె ప్రాగ్‌లోని చార్లెస్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో డిగ్రీ, ఇన్స్‌బ్రక్‌లోని ఎంసీఐ మేనేజ్‌మెంట్ సెంటర్ ఇన్స్‌బ్రక్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది.[4] మోడలింగ్‌పై ఆసక్తి ఉండడంతో ఆమె అటుగా అడుగులు వేసింది. 2022లో, ఆమె లండన్‌లోని ఎలైట్ మోడల్ మేనేజ్‌మెంట్‌లో చేరి, అందాల పోటీల మెళకువలు నేర్చుకుంది. అదే ఏడాదిలో నిర్వహించిన మిస్ చెక్ రిపబ్లిక్ పోటీల్లో పాల్గొని, తొలి ప్రయత్నంలోనే క్రిస్టినా పిస్కోవా కిరీటం దక్కించుకుంది.
చెక్ రిపబ్లిక్, స్లోవకియాలలో మాట్లాడే స్లోవక్‌తో పాటు ఇంగ్లిష్, జర్మన్, పోలిష్ తదితర భాషలలో ఆమె అనర్గళంగా మాట్లాడగలదు.
కెరీర్
[మార్చు]2022లో మిస్ చెక్ రిపబ్లిక్ 2022కి ఫైనలిస్ట్‌గా ఎంపికైన ఆమె మోడలింగ్ ని కెరీర్‌గా ఎంచుకుంది.[5] ఈ పోటీ మే 2022లో నిర్వహించగా అందులో ఆమె గెలుపొందింది. విజేతగా, ఆమె మిస్ వరల్డ్ 2023లో చెక్ రిపబ్లిక్‌కు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయింది.
2023లో ప్రపంచ సుందరి పోటీలు వాస్తవానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగాల్సి ఉండగా భారతదేశంలో నిర్వహించారు.[6] 2023 డిసెంబరు 16న ముంబైలో నిర్వహించతలబెట్టారు.[7] కానీ, భారతదేశంలో 2023 ఎన్నికల కారణంగా ఇది తర్వాత 2024 మార్చి 2కి వాయిదా పడింది, తర్వాత మరోసారి 2024 మార్చి 9కి వాయిదా పడింది.[8] మిస్ వరల్డ్ ఫిబ్రవరి 2024లో న్యూ ఢిల్లీలో దాని ప్రీ-పేజెంట్ ఛాలెంజ్‌లతో ప్రారంభమైంది, ఆమె ఒకటవ స్థానంలో కొనసాగుతోంది. టాప్ మోడల్ ఛాలెంజ్‌లో యూరప్‌లో టాప్ ఫోర్ ఫైనలిస్ట్, బ్యూటీ విత్ ఎ పర్పస్ ఛాలెంజ్‌లో టాప్ 10 ఫైనలిస్ట్‌గా ఉంది.[9] పోటీ చివరి ప్రదర్శన మార్చి 9న ముంబైలో జరిగింది, అక్కడ ఆమె టాప్ 40లోకి ప్రవేశించింది. ఆమె తర్వాత టాప్ 12లో యూరప్‌కు చెందిన ముగ్గురు ఫైనలిస్టులలో ఒకరిగా, టాప్ 8లో యూరప్‌కు ఇద్దరు ఫైనలిస్టులుగా ఎదిగింది. టాప్ 4లో మొత్తం యూరోపియన్ విజేతగా ఆమె నిలిచింది. టాప్ 4 ప్రకటన తర్వాత, ఆమె విజేతగా నిలిచింది.[10]
ఆమె విజయంతో, మిస్ వరల్డ్ 2006 కిరీటాన్ని పొందిన టటానా కుచరోవా తర్వాత, మిస్ వరల్డ్ గెలుచుకున్న చెక్ రిపబ్లిక్‌కు ప్రాతినిధ్యం వహించిన రెండవ మహిళగా క్రిస్టినా పిస్కోవా నిలిచింది.[11]
టటానా కుచరోవా డ్యాన్సర్, మోడల్ 2006 సెప్టెంబరు 30న పోలాండ్‌లోని వార్సాలో జరిగిన మిస్ వరల్డ్ 2006 పోటీ ఫైనల్ ఈవెంట్‌లో టైటిల్ గెలుచుకున్న చెక్ రిపబ్లిక్ నుండి మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది.[12] అలాగే, ఆమె 2013లో డ్యాన్సింగ్ విత్ ది స్టార్స్ చెక్ వెర్షన్ స్టార్‌డాన్స్‌లో రెండవ స్థానంలో నిలిచింది.[13]
సామాజిక సేవ
[మార్చు]క్రిస్టినా పిస్కో ఫౌండేషన్ స్థాపించి ఆమె పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రధానంగా ఆమె ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య దూరం కాకూడదని సంకల్పంతో టాంజానియాలో ఓ పాఠశాలను నెలకొల్పింది.
మూలాలు
[మార్చు]- ↑ "Krystyna Pyszková z Třince je Miss ČR!". gorolweb.cz (in చెక్). 9 May 2022.
- ↑ "Miss Czech Republic 2022 je třiadvacetiletá studentka Krystyna Pyszková". iDNES.cz (in చెక్). 7 May 2022.
- ↑ "Miss World 2024: మిస్ వరల్డ్ 2024 కిరీటం గెల్చుకున్న క్రిస్టినా పిస్కోవా | miss world 2024 title winner Czech Republic s Krystyna Pyszkova at mumbai sri". web.archive.org. 2024-03-10. Archived from the original on 2024-03-10. Retrieved 2024-03-10.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Tyto dívky zabojují o korunku krásy. Jak se vám líbí finalistky Miss?". iDNES.cz (in చెక్).
- ↑ "Tyto dívky zabojují o korunku krásy. Jak se vám líbí finalistky Miss?". iDNES.cz (in చెక్).
- ↑ Gillett, Katy (14 February 2023). "Miss World 2023 to be held in the UAE". The National. Archived from the original on 18 February 2023. Retrieved 18 February 2023.
- ↑ "India to Host 71st Miss World 2023". Miss World. 8 June 2023. Archived from the original on 25 February 2011. Retrieved 8 June 2023.
- ↑ "India to host Miss World pageant after 28 years". WION. 20 January 2024. Retrieved 28 January 2024.
- ↑ "Watch the 71st Miss World Beauty with a Purpose Gala Dinner live". 3 March 2024.
- ↑ మూస:Cite website
- ↑ "Czech Republic's Krystyna Pyszkova Wins Miss World 2024". praguemorning.cz. 9 March 2024.
- ↑ "New Miss World crowned". The Sydney Morning Herald. 1 October 2006. Retrieved 15 April 2009.
- ↑ Profile at Česká televize website