గంజివానిపాలెం
"గంజివానిపాలెం" కృష్ణా జిల్లా మోపిదేవి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గంజివానిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం. — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | మోపిదేవి |
ప్రభుత్వం | |
- సర్పంచి | కొల్లి చక్రపాణి |
పిన్ కోడ్ | 521 125 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
సముద్రమట్టానికి 6 మీ.ఎత్తులో ఉంది.
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]మోపిదేవి, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 64 కి.మీ.దూరంలో ఉంది
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయినిగా పనిచేయుచున్న మండవ సుధారావు బి.యే., ఎం.యే., ఎం.యే., ఎం.ఇ.డి, 2016, సెప్టెంబరు-5వ తేదీనాడు, కృష్ణాజిల్లా ఉత్తమ ఉపాధ్యాయినిగా పురస్కారం అందుకున్నారు. [2]
గ్రామ పంచాయతీ
[మార్చు]గంజివాని పాలెం గ్రామం, మోపిదేవి గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ పోతరాజుస్వామి, గ్రామ దేవత శ్రీ అంకమ్మ తల్లి ఆలయం
[మార్చు]ఈ గ్రామ ఎస్.సి.వాడలో 2015, సెప్టెంబరు-27వ తేదీ ఆదివారం ప్రతిష్ఠించనున్న శ్రీ పోతురాజు, శ్రీ అంకమ్మ తల్లి విగ్రహాల గ్రామోత్సవం, శనివారం వైభవంగా నిర్వహించారు. విగ్రహప్రతిష్ఠా మహోత్సవం, ఆదివారం ఉదయం 11-32 గంటలకు అంగరంగవైభవంగా నిర్వహించారు. [1]
ఈ ఆలయంలోని గ్రామదేవతల వార్షిక సంబరాలు, 2017, ఫిబ్రవర్-4వతేదీ శనివారం, 5వతేదీ ఆదివారంనాడు, వైభవంగా నిర్వహించారు. రెండు రోజులపాటు గ్రామస్థుల, భక్తబృందాల సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలను కోలాహలంగా నిర్వహించారు. అమ్మవారలకు, పోతరాజుకు, రైతులు ఈ సంవత్సరం కొత్తగా పండించిన బియ్యంతో చద్ది నైవేద్యాలు, మొక్కుబడులు సమర్పించి కొలిచారు. [3]
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామములోని ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
మూలాలు
[మార్చు][1] ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-28; 40వపేజీ. [2] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, సెప్టెంబరు-16; 2వపేజీ. [3] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017, ఫిబ్రవరి-6; 1వపేజీ.