Jump to content

జి.వినోద్

వికీపీడియా నుండి
(గడ్డం వినోద్ కుమార్ నుండి దారిమార్పు చెందింది)
గడ్డం వినోద్ కుమార్
జి.వినోద్


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2009
నియోజకవర్గం చెన్నూర్ నియోజకవర్గం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక, ఉపాది శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004 - 2009

వ్యక్తిగత వివరాలు

జననం 1955
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు గడ్డం వెంకటస్వామి, కళావతి
బంధువులు జి. వివేకానంద్ (తమ్ముడు)

గడ్డం వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో ఎమ్మెల్యేగా గెలిచి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో 2004 నుండి 2009 వరకు కార్మిక, ఉపాది శాఖ మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

జి.వినోద్ తన తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి 1999లో చెన్నూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన తిరిగి 2004లో తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికై, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో 2004 నుండి 2009 వరకు కార్మిక, ఉపాది శాఖ మంత్రిగా పని చేశాడు. జి.వినోద్ 2009, 2010లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.ఆయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 2 జూన్‌ 2013న కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014 మార్చి 31న తిరిగి కాంగ్రెస్‌లో చేరాడు. ఆయన 2014లో చెన్నూరు అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయాడు.[1] జి.వినోద్ తర్వాత 2016లో టీఆర్‌ఎస్‌ లో చేరి 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా మొండిచేయి చూపించడంతో బెల్లంపల్లి నియోజకవర్గం నుండి బిఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పోయాడు. జి.వినోద్ 2020లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2][3]

సంవత్సరం నియోజకవర్గం గెలిచిన అభ్యర్థి పార్టీ ప్రత్యర్థి పార్టీ
1999 చెన్నూర్ నియోజకవర్గం బోడ జనార్థన్ టీడీపీ జి.వినోద్ కాంగ్రెస్ పార్టీ
2004 చెన్నూర్ నియోజకవర్గం జి.వినోద్ కాంగ్రెస్ పార్టీ బోడ జనార్థన్ టీడీపీ
2009 చెన్నూర్ నియోజకవర్గం నల్లాల ఓదేలు టిఆర్ఎస్ జి.వినోద్ కాంగ్రెస్ పార్టీ
2010 'ఉప ఎన్నిక' చెన్నూర్ నియోజకవర్గం నల్లాల ఓదేలు టిఆర్ఎస్ జి.వినోద్ కాంగ్రెస్ పార్టీ
2014 చెన్నూర్ నియోజకవర్గం నల్లాల ఓదేలు టిఆర్ఎస్ జి.వినోద్ కాంగ్రెస్ పార్టీ
2018 బెల్లంపల్లి నియోజకవర్గం దుర్గం చిన్నయ్య టిఆర్ఎస్ జి.వినోద్ బహుజన్ సమాజ్ పార్టీ
2023 బెల్లంపల్లి నియోజకవర్గం జి.వినోద్ కాంగ్రెస్ పార్టీ దుర్గం చిన్నయ్య టిఆర్ఎస్
  1. "ఉత్కంఠగా ఫలితాల సరళి". 17 May 2014. Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
  2. Sakshi (11 January 2020). "కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాజీమంత్రి వినోద్‌". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
  3. "G Vinod back in Telangana Congress fold after leaving party in 2016" (in ఇంగ్లీష్). 12 January 2020. Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=జి.వినోద్&oldid=4169118" నుండి వెలికితీశారు