గనిశెట్టి రాములు
Ganishetti Ramulu గనిశెట్టి రాములు | |
---|---|
గనిశెట్టి రాములు | |
జననం | |
విద్య |
|
వృత్తి | (కమీషనర్) ఉప వాణిజ్య పన్నుల అదికారి, సిద్దిపేట (1989-2015). |
పిల్లలు | ఒక అబ్బాయి ,ఇద్దరు అమ్మాయిలు |
తల్లిదండ్రులు | రాజన్న, అక్కమ్మ |
పురస్కారాలు | పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం - కీర్తి పురస్కారాలు (2017) దళిత రత్న పురస్కారం 2007. |
గనిశెట్టి రాములు తెలుగు రచయిత[1] [2] అతను పరిశోధనా రంగంలో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని 2017లో అందుకున్నాడు[3]
జీవిత విశేషాలు
[మార్చు]గనిశెట్టి రాములు నిజామాబాదు జిల్లాలోని జరాల్‌పుర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన రాజన్న, అమ్మాయమ్మ దంపతులకు తృతీయ సంతానంగా జన్మించాడు. అతనికి ఇద్దరు అన్నయ్యలు, ఒక అక్క ఉన్నారు. జలాల్ పూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభమైన చదువు ఎస్.ఎస్.సి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గుండారం లో జరిగింది. తరువాత ఇంటర్మీడియట్, డిగ్రీ లను నిజామాబాదులో చదివాడు. బి.కాం డిగ్రీని గిరిరాజ్ కళాశాలలో పూర్తి చేసి, శాతవాహన పి.జి. కళాశాల, కరీం నగర్ లో ఎం.కాం వరకు చదివాడు. వృత్తి ఉప వాణీజ్య పన్నుల అధికారిగా సిద్దిపేట జిల్లాలో పదవీవిరమణ చేసాడు.
ఉద్యోగ జీవితం
[మార్చు]అతను జూనియర్ అసిస్టెంటు స్థాయి నుండి ప్రమోషన్ ద్వారా జూనియర్ అసిస్టేంటుగా భాద్యతలు చేస్తూ, ఎ.సి.టి.ఓ ఉపవాణిజ్య పన్నుల అధికారిగా 2015 సం.లో పదవీ విరమణ పొందాడు.
రచనా ప్రస్థానం
[మార్చు]గనిశెట్టి రాములు అభ్యుదయ రచయిత. కులాల వారసత్వాలను కూలంకషంగా చూడటం, వారికి జరుగుతున్న అన్యాయాలను గమనించడం వలన అసమానతల మధ్య నలిగిన కులాల చరిత్రను పరిశీలించి ప్రయోగాత్మక సిద్ధాంతంగా పంచే క్రమంలో "గోసంగిలు ఎవరు", "చీకటి బతుకుల్లో గోసంగిలు" (2004)[4] అనే పుస్తకాలను రాసాడు. ఊరికి చివర నివాసం, అంటరానితనం, చెట్లకింద జీవితం, చౌరస్తాలలో కథలు చెప్పడం గోసంగీల నిత్య కృత్యం. ఇలాంటి అణిచివేయబడ్డ, అసమానతలకు, వివక్షకు గురి అవుతున్న గోసంగిల జీవనశైలి మార్చడంలో అతను అనేక ఉదాహరణలతో కూడిన విశ్లేషణను ఈ పుస్తకాలలో పొందుపరచాడు.[5]
రచనలు
[మార్చు]- చీకటి బ్రతుకుల్లో గోసంగీలు (చరిత్ర ) -2004
- గోసంగీలు ఎవరు ( వ్యాసాలు) -2015
- ఎవరీ మహనీయులు( వ్యాసాలు) -2018
వ్యాసాలు
[మార్చు]- మ ఊరులో చిందుల ఎల్లమ్మ
- అంభేద్కర్ మార్గము - దళీతులకు మార్గము
- గోసంగీ కళాకారుల పోరుకేక
- జానపద భిక్షక గాయకులే గోసంగీలు
పురస్కారాలు
[మార్చు]- 14.04.2007 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే "దళిత రత్న" పురస్కారాన్ని ప్రిన్సిపాల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంటు వారు అందజేసి సత్కరించారు.
- ఇందూర్ శతాబ్ది ఉత్సవాలలో నిజామాబాదు జిల్లా కలెక్టరు రామాంజనేయుల గారిచే 28.12.2007 లో విశిష్ట పురస్కారం.
- 06.09.2018 భారతీయ ఇతిహాస సంకలన సమితి ఇందూరు శాఖ ఉత్తమ చరిత్ర అధ్యాపకులుగా గుర్తిస్తూ కందకూర్తి ఆనంద గారిచే సన్మానం.
- 26.10.2018 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైద్రాబాదు చే కీర్తి పురస్కారంను 2019లో వైస్ ఛాన్సలర్ చే ప్రదానం.
- 9.12.2018 తెలంగాణ సాహితీ అకాడమీ అధ్యక్షులు నందిని సిద్దారెడ్డి గారిచే సన్మానం.
- 05.03.2019 వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసబ్యుడు, కె.ఆర్ సురేష్ రెడ్డి మాజీస్పీకరు గారిచే "గోసంగిల సభ" మోరాడ్ మండలంలో సన్మానం.
- 22.1.2020 గిడుగు రామ్మూర్తి పంతులు పౌండేషన్ హైద్రాబాద్ వారిచే "గిడుగు సాహిత్య పురస్కారం" తో సన్మానం.
మూలాలు
[మార్చు]- ↑ "గోసంగిల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం".[permanent dead link]
- ↑ "సంఘటితంగా ఉంటేనే హక్కులు సాధించుకోవచ్చు". Archived from the original on 2018-10-29. Retrieved 2018-10-16.
- ↑ ఈనాడు (డైలీహంట్) (13 October 2015). "43 మందికి తెలుగువర్సిటీ కీర్తి పురస్కారాలు". Archived from the original on 15 October 2018. Retrieved 15 October 2018.
- ↑ "జానపద కళా రక్షకులు గోసంగివారు". Archived from the original on 2016-04-22. Retrieved 2018-10-16.
- ↑ "గనిశెట్టి కలంలోంచి ఉబికిన.. గోసంగిల ఘోష".
- All articles with dead external links
- Date of birth not in Wikidata
- జీవిస్తున్న ప్రజలు
- దళిత రచయితలు
- తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల విజేతలు-2017
- నిజామాబాదు జిల్లా వ్యక్తులు
- నిజామాబాదు జిల్లా కవులు
- తెలంగాణ కవులు
- నిజామాబాదు జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు
- తెలంగాణకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు
- ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసినవారు
- నిజామాబాదు జిల్లా రచయితలు
- నిజామాబాదు జిల్లా సామాజిక కార్యకర్తలు