Jump to content

గన్నమనేని రామకృష్ణ ప్రసాద్

వికీపీడియా నుండి
గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌

పదవీ కాలం
2022 ఫిబ్రవరి 14 – ప్రస్తుతం
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 28 మే 1964
గుంటూరు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
తల్లిదండ్రులు గన్నమనేని గాంధీ చౌదరి
పూర్వ విద్యార్థి నాగార్జున యూనివర్సిటీ

గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 31 జనవరి 2022న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా[1],2022 ఫిబ్రవరి 14న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ 1964 మే 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, గుంటూరు పట్టణంలో జనించాడు. ఆయన గుంటూరు లయోలా పబ్లిక్‌ స్కూల్‌లో పదవ తరగతి పూర్తి చేసి హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 12వ తరగతి వరకు, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ఆంధ్ర విద్యాలయ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌లో బీకాం పూర్తి చేసి గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్‌ లా కాలేజీలో 1990లో ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకొని 1991లో నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసి 1991 ఆగస్టు 27న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.

వృత్తి జీవితం

[మార్చు]

గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో న్యాయవాదిగా పని చేసి 2000 నవంబరు 10న సుప్రీం కోర్టులో ప్రాక్టీస్‌ మొదలు పెట్టాడు. ఆయన సుప్రీం కోర్టు, ఢిల్లీ హైకోర్టులో రాజ్యసభ సెక్రటేరియట్, రాజ్యసభ టెలివిజన్‌కు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, నాగాలాండ్‌ ప్రభుత్వం తరఫున పలు కేసులు వాదించాడు. ఆయనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ ఉమేశ్‌ ఉదయ్‌ లలిత్, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌లతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కు న్యాయమూర్తిగా 31 జనవరి 2022న కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (31 January 2022). "ఏపీ హైకోర్టు జడ్జిలుగా ఏడుగురు న్యాయవాదులు". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.
  2. Andhra Jyothy (14 February 2022). "ఏడుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  3. Sakshi (1 February 2022). "హైకోర్టుకు ఏడుగురు జడ్జీలు!". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.
  4. Andhra Jyothy (1 February 2022). "హైకోర్టుకు మరో ఏడుగురు జడ్జీలు". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.