గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు తెలంగాణకు చెందిన కవి మరియు రచయిత.

జీవిత విశేషాలు[మార్చు]

గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు 20 నవంబరు 1951 న మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లో శకుంతలమ్మ, రామేశ్వర్ రావు దంపతులకు జన్మించారు. ఆలంపురం, పాలెం లలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి, హైదరాబాద్ లో ఎం ఏ...బి.ఓ.ఎల్. ఉత్తీర్ణులయ్యారు.జూనియర్ లెక్చరర్ గా 6 జనవరి 1978న ఉద్యోగంలో చేరి 16 సంవత్సరాల పాటు సత్తుపల్లి, ఖమ్మం, వర్ధన్నపేట, మహబూబాబాద్, హుజురాబాద్, హనుంకొండ పట్టణాల్లో పనిచేసి 31 ఆగస్టు 2009న పదవీ విరమణ పొందారు. వీరి సతీమణి కె, గీత హనుమకొండ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.

సాహితీ సేవలు[మార్చు]

ప్రస్తుతం హనుమకొండ లోని సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ కార్యదర్శిగా, ప్రస్తుత ఉపాధ్యక్షునిగా గత పదహారేళ్ళుగా విస్తృతమైన సేవలనందిస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పండితులను ఆహ్వానించి మహాభారత దర్శనం పేరిట పద్ధెనమిది పర్వాల పై ప్రసంగాలు, భాగవత సుధా స్రవంతి పేర ద్వాదశ స్కంధాలపై ప్రసంగాలు, రామ కథా పరిమళం పేర కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విరచిత రామాయణ కల్పవృక్షం పై పది రోజుల ప్రసంగాలు రామాయణం -మానవ ధర్మము అనే అంశం పై చాగంటి కోటేశ్వర రావు ప్రవచనాలు ముఖ్యమైనవి. శతాధిక సంఖ్యలో గ్రంథావిష్కరణ సభలు, సాహిత్య సమావేశాలు నిర్వహించడమే గాక జాతీయ స్థాయిలో జరిగిన అనేక సదస్సులలో పత్ర సమర్పణ చేశారు. వీటిలో కొడాలి సుబ్బారావు-హంపీ క్షేత్రము, కళా పూర్ణోదయము-ఆధునిక రచనా దృక్పథము, తిలక్ రచనలు, దాశరథి పద్యం, ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి కావ్యాలు, గోపీనాథ రామాయణం, కాళోజీ ఆత్మకథ ముఖ్యమైనవి.

శతక కవుల సంగోష్ఠి, ప్రతాప రుద్ర సభ, కృష్ణా పత్రిక దర్బారు, వందే మాతరమ్, భువన విజయం, ఇంద్ర సభ, పుష్కర సభ, బ్రహ్మ సభ, గణపతి విజయం, గోలకొండ విజయం వంటి సాహిత్య రూపకాల్లో చారిత్రక కవుల పాత్రధారణ చేశారు.

ఆకాశవాణి, దూరదర్శన్ లోనే కాకుండా ఇతర చానళ్ళలో కూడా వివిధ ధార్మిక అంశాలతో పాటుగా, సాహిత్యోపన్యాసాలు కూడా చేస్తున్నారు.తిరుమల బ్రహ్మొత్సవాలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలలో ఎన్నో పర్యాయాలు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

వీరు పొందిన సత్కారాల్లో సాహితీ విరించి బిరుదు, తెలుగు భాషా దినోత్సవ పురస్కారం, జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారం, స్వరసుధ వారి సత్కారం, కళావాహిని వారి సత్కారం, స్వర రవళి వారి సత్కారం, శాంతిదూత పురస్కారం, శాతవాహన విశ్వ విద్యాలయం వారి పురస్కారం ప్రముఖమైనవి.

మూలాలు[మార్చు]