గాంధీ దేవాలయం, భతరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాంధీ దేవాలయం, భతరా
Gandhi-temple-Sambalpur.jpg
గాంధీ దేవాలయం, భతరా is located in Odisha
గాంధీ దేవాలయం, భతరా
గాంధీ దేవాలయం, భతరా
ఒడిశాలో దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు :21°27′57″N 83°58′59″E / 21.46583°N 83.98306°E / 21.46583; 83.98306Coordinates: 21°27′57″N 83°58′59″E / 21.46583°N 83.98306°E / 21.46583; 83.98306
పేరు
ప్రధాన పేరు :గాంధీ దేవాలయం
ప్రదేశము
దేశం:భారతదేశము
రాష్ట్రం:ఒడిశా
ప్రదేశం:భతరా
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:మహాత్మా గాంధీ
ముఖ్య_ఉత్సవాలు:స్వాతంత్ర్యదినోత్సవం, గణతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి
ఇతిహాసం
నిర్మాణ తేదీ:క్రీ.శ. 1974
సృష్టికర్త:భతరా గ్రామస్థులు

గాంధీ దేవాలయం భారతదేశంలోని తూర్పు తీరంలో గల ఒడిశా రాష్ట్రంలోని సంబల్‌పూర్ జిల్లాలోని భతరా వద్ద 1974లో నిర్మించబడిన దేవాలయం. [1] ఈ ఆలయం మహాత్మా గాంధీకి అంకితం చేయబడింది. [2] భారతదేశంలో గాంధీజీకి అంకితం చేసిన మొదటి ఆలయం ఇది.

చరిత్ర[మార్చు]

1960 దశాబ్దంలో సంబల్పూర్‌లో అంటరానితనం ఇంకా ఉండేది. ఈ అంటరాని తనాన్ని నిర్మూలించడానికి భతరా గ్రామస్తులు తమ గ్రామంలో గాంధీ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. [3] రైరాఖోల్ శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు అభిమన్యుకుమార్ గ్రామస్థుల ప్రతిపాదనకు మద్దతునిచ్చి నాయకత్వం వహించాడు. ఈ ఆలయానికి శంకుస్థాపన 1971 మార్చి 23న జరిగింది. ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత 1974 ఏప్రిల్ 11న అప్పతి ఒడిశా ముఖ్యమంత్రిణి నందిని సత్పతి అధికారికంగా ప్రారంభోత్సవం చేసింది. [4]

దైవం, ఆలయ ఆచారాలు[మార్చు]

ఈ దేవాలయంలో గాంధీజీ కాంస్య విగ్రహం ఎత్తు 3.5 అడుగులు ఉంటుంది. ఈ దేవాలయం ప్రవేశ ద్వారం ఎదురుగా భారతదేశ జాతీయ చిహ్నం అయిన అశోక స్తంబం ఏర్పాటు చేయబడింది. ఈ దేవాలయ శిఖరంపై భారతదేశ త్రివర్ణ జాతీయ పతాకాన్ని అమర్చారు. ఆలయం లోపల ఉన్న గాంధీజీ విగ్రహానికి రోజూ దళిత పూజారి పూజిస్తుంటాడు. గాంధీజీకి ఇష్టమైన గ్రంథాలు భగవద్గీత, రామ్ ధున్ ప్రతి ఉదయం, సాయంత్రం చదవబడతాయి. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతిని ఇక్కడ ప్రత్యేక సందర్భాలుగా జరుపుకుంటారు. [5]

ప్రదేశం[మార్చు]

ఈ ఆలయం జాతీయ రహదారి నంబర్ 53 నుండి 500 మీటర్ల దూరంలో ఉంది. జార్సుగూడ విమానాశ్రయం 61 కిమీ, క్షేతరాజ్‌పూర్ రైల్వే స్టేషన్ 10 ఆలయం కి.మీ. దూరంలోనూ ఉన్నాయి. ఈ ఆలయం సంబల్‌పూర్ జిల్లా ప్రధాన కార్యాలయానికి రహదారి ద్వారా అనుసంధానించబడి ఉంది.

మూలాలు[మార్చు]

  1. "7 new sites to get tourist spots recognition in S'pur". www.dailypioneer.com. The Pioneer. Archived from the original on 1 October 2020. Retrieved 1 October 2020.
  2. "Mahatma Gandhi, Chinese Kali, and a Sachin Tendulkar temple: 10 unusual temples in India for the unconventional Indian gods". www.news18.com. News18. Archived from the original on 1 October 2020. Retrieved 1 October 2020.
  3. "Dalits build Gandhi temple in Sambalpur". www.timesofindia.indiatimes.com. The Times of India. Archived from the original on 1 October 2020. Retrieved 1 October 2020.
  4. Subrat Mohanty. "Ramdhun to recall Bapu". www.telegraphindia.com. The Telegraph. Archived from the original on 1 October 2020. Retrieved 1 October 2020.
  5. "Mahatma Gandhi Temple in Bhatra, Sambalpur". www.mysambalpur.in. Archived from the original on 1 October 2020. Retrieved 1 October 2020.