గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగు కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Gayatri Vidya Parishad College of Engineering [1]
గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగు కళాశాల
రకంస్వయంప్రతిపత్తి
స్థాపితం1996
అధ్యక్షుడుడి. వి సుబ్బారావు
ప్రధానాధ్యాపకుడుఎన్.వి.ఎస్.ఎస్.జె గాంధీ
విద్యాసంబంధ సిబ్బంది
185
నిర్వహణా సిబ్బంది
111
విద్యార్థులు2,880
అండర్ గ్రాడ్యుయేట్లు2,540
పోస్టు గ్రాడ్యుయేట్లు340
స్థానంవిశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
కాంపస్మధురవాడ
అథ్లెటిక్ మారుపేరుగాయత్రీ
అనుబంధాలుజె.ఎన్.టీ.యూ కాకినాడ
జాలగూడుhttp://gvpce.ac.in http://www.gvpcoeedu.org

ఈ కళాశాల, 1996 సంవత్సరంలో, విశాఖపట్నంలో స్థాపించబడింది. దీని స్థాపనలోనూ, నిర్వహణలోనూ విశాఖపట్నంలో ఎందరో విద్యావేత్తలు, దాతలు, వృత్తివిద్యా నిపుణులు పాలుపంచుకొంటున్నారు. "సంపూర్ణ విధానం ద్వారా, టెక్నలాజికల్ విద్య, పరిశోధనల్లో, శ్రేష్ఠ విద్యాకేంద్రం ఎదగడం, కొనసాగడం" అనే ఆశయం కలిగి ఉంది.

విభాగాలు, కోర్సులు[మార్చు]

కళాశాలలోని వివిధ కోర్సులు

సౌకర్యాలు[మార్చు]

బి. సర్వేశ్వరరావు గ్రంథాలయం[మార్చు]

ఇది గాయత్రీ విద్యా పరిషత్ మాజీ అధ్యక్షులు, నాగార్జున విశ్వవిద్యాలయపు మాజీ ఉపకులపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయపు అర్థశాస్త్ర గౌరవ ఆచార్యులు, నైజీరియా దేశప్రభుత్వపు మాజీ సలహాదారు, ప్రముఖ ఆర్థికవేత్త అయిన బి సర్వేశ్వరరావు పేర ఏర్పరచబడింది. ఇందులో:

 • మొత్తం పుస్తకాలు - 43,544
 • మొత్తం పేర్లు - 9930
 • జర్నళ్ళు - 1846
 • అంతర్జాతీయ స్థాయివి - 63
 • జాతీయ స్థాయివి - 141
 • మొత్తం ఆన్-లైన జర్నళ్ళు - 1846

విద్యార్థుల సౌకర్యార్థం డిజిటల్ గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయబడింది.

వసతి గృహాలు[మార్చు]

విద్యార్థినీ విద్యార్థులకు విడివిడిగా వసతి గృహాలు ఉన్నాయి

ఆటలు[మార్చు]

సుమారు 6.5 ఎకరాల మేర ఏర్పాటు చేయబడిన ఆట వసతుల్లో ఈ క్రిందివి కూడా ఉన్నాయి.

 • బాస్కెట్ బాల్
 • బాల్ బాడ్మింటన్
 • క్రికెట్
 • ఫుట్ బాల్
 • టేబుల్ టెన్నిస్
 • టెన్నీ-కోయిట్
 • టెన్నిస్
 • థ్రో - బాల్
 • వాలీబాల్
 • షటిల్ బాడ్మింటన్
 • 200 మీ పరుగుల ట్రాక్

వీటి సమయం ప్రతీరోజు, ఉదయం 6 -8 గంటల వరకూ, సాయంత్రం 3-30-7 గంటల వరకు.

రవాణా[మార్చు]

విశాఖపట్నం నగరశివారులలో గల మధురవాడలో ఇది నెలకొని ఉంది. నగరం నడిబొడ్డు నుండి మధురవాడ 30 నిమిషాల ప్రయాణం. కాంప్లెక్సు నుండి, తగరపువలస పోయే 222 నంబరు బస్సులు, భీమిలి పోయే 999 బస్సులు మధురవాడ వద్ద ఆగుతాయి. పాతపోస్టాఫీసు నుండి, 25 P బస్సులు పి.ఎం పాలెం (పోతిన మల్లయ్య పాలెం) వరకూ వచ్చే బస్సు ప్రతీ 10 నిమిషాలకు ఒకటి ఉంటుంది. మధురవాడ, పీ.ఎం పాలెం లనుండి కళాశాల షేర్ ఆటో ఉంటాయి. కళాశాల పక్కనే ఉన్న బక్కన్నపాలెం గ్రామానికి కూడా 25 K బస్సు వస్తుంది. ఇది ఒకే ఒక్క బస్సు కావడంవలన ఎక్కువ సౌకర్యం ఉండదు. ఇంక, కళాశాల ఏర్పాటు చేసిన బస్సులు ఈ విధంగా ఉంటాయి.

 • నగరం నలుమూలల నుండి విద్యార్థులను చేరవేసేందుకు 14 బస్సులు ఉన్నాయి.
 • అచార్యుల కోసమై ఒక ప్రత్యేక బస్సూ, మినీబస్సూ ఉన్నాయి.
 • మరో రెండు బస్సులు సిబ్బందికోసం ఏర్పాటు చేయబడ్డాయి.
 • ఆటలలో పొల్గొనే విద్యార్థులకోసమై ఆయా సమయాలకి తగిన బస్సులు ఉన్నాయి.
 • గ్రంథాలయం మూసివేత సమయం (సాయంత్రం 7 గం) నికి ఒక బస్సు ఉంటుంది.
 • శని, ఆదివారాలలో గ్రంథాలయానికి వచ్చే విద్యార్థుల కోసం బస్సు ఏర్పాటు చేయబడింది.

కేంటీన్, ఇతరములు[మార్చు]

కళాశాల ప్రాంగణంలో కేంటీన్, పోస్టాఫీసు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఎక్స్ టెన్షన్ కౌంటరులు కూడా ఉన్నాయి.

సలహా పనులు[మార్చు]

2001లో కళాశాల-పరిశ్రమ అనుబంధాన్ని అభివృద్ధిచేసే ఉద్దేశంతో పారిశ్రామిక సలహాపనుల, పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పరచబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గాయత్రీ విద్యా పరిషత్, జర్మనీ దేశ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పరచిన ఇండో-జర్మన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, విశాఖపట్నంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

విద్యార్థులు, ప్రగతి[మార్చు]

ఇక్కడ, విద్యార్థులకి, చదువు సాగుతూ ఉండగానే ప్రాంగణనియామకాలు వస్తూ ఉంటాయి.

మూలాలు[మార్చు]

 1. "GVPCOE". Retrieved 10 Jan 2013. CS1 maint: discouraged parameter (link)