గుంటుపల్లి వెంకటలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాపట్ల వాస్తవ్యురాలు.మహిళా శాస్త్రవేత్త .సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి పట్టుదలతో ఉన్నత చదువులు చదివిన గుంటుపల్లి వెంకటలక్ష్మి శాస్త్రవేత్తగా ఎదిగి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించింది. అఖిలభారత మృత్తిక విజ్ఞాన శాస్త్ర సంఘమునకు దక్షిణ భారతదేశం నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికైన తొలి మహిళా శాస్త్రవేత్తగా కీర్తి నార్జించింది. జాతీయ బాలల వైజ్ఞానిక కాంగ్రెస్‌ మేధోమధన బృందం సభ్యురాలిగా రాష్ట్రం నుంచి ఎన్నికైన ఏకైక శాస్త్రవేత్త .

బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ(అగ్రి), ఎమ్మెస్సీ(అగ్రి) కోర్సులను పూర్తి చేసిన లక్ష్మి ఢిల్లీలో భారత వ్యవసాయపరిశోధనా సంస్థలో లో మృత్తిక శాస్త్రములో పి.హెచ్‌.డి. పట్టా సాధించింది. 1987లో తను చదువుకున్న వ్యవసాయ కళాశాలలో అధ్యాపకురాలిగా ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇండో-డచ్‌ ప్రాజెక్టులో 2000లో శాస్త్రవేత్తగా చేరి కృష్ణా పశ్చిమ డెల్టా, నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టు పరిధిలో రిమోట్‌ సెన్సింగ్‌ సహాయంతో భూగర్భ జలాలు, ఉప్పు, చౌడు భూములపై పరిశోధనలు చేశారు. 2004లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 2006 జనవరిలో ఉప్పు నీటి పరిశోధనా కేంద్రంలో సీనియర్‌ శాస్త్రవేత్తగా చేరారు. 2008లో ప్రిన్సిపల్‌ శాస్త్రవేత్తగా ఎదిగి శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, పశ్చిమగోదావరి, నిజామాబాద్‌, కరీంనగర్‌జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులపై పరిశోధనలు చేసి మ్యాప్‌ను తయారు చేశారు. అధిక నత్రజని ఎరువుల వాడకం వల్ల భూగర్భ జలాల్లో నైట్రేట్‌ల కాలుష్యంపై భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో రూ. 10లక్షల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టును 2006లో ప్రారంభించి 2009లో పూర్తి చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో నైట్రేట్‌ల కాలుష్యం వల్ల భూగర్భజలాలు ఎక్కువగా కలుషితం అయ్యాయని ఆమె పరిశోధనలో తేలింది. ప్రస్తుతం భూగర్భ జలాల్లోకి సముద్ర జలాలు చొచ్చుకురావటం క్షార జలంతో పంటల సాగుపై పరిశోధనలు చేస్తున్నారు. ధార్వాడ్‌, బెంగళూరు, త్రిచూర్‌, కోయంబత్తూరు వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు బీఎస్సీ(అగ్రి) పరీక్ష పత్రాలను లక్ష్మి రూపొందిస్తున్నారు.