గుగ్గులు

వికీపీడియా నుండి
(గుగ్గిలము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

గుగ్గులు
Commiphora wightii resin (guggul)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
కొ. వైటై
Binomial name
కొమ్మిఫోరా వైటై
Synonyms

కొమ్మిఫోరా ముకుల్ (Stocks) Hook.

గుగ్గులు, ఒక రకమైన ఔషధ మొక్క.ఇది బర్సెరసి కుటుంబానికి చెందింది.దీని నుండి లభించే జిగురు వంటి ద్రవాన్ని గుగ్గిలంగా ఉపయోగిస్తారు.గుగ్గులు ఒక రకమైన పూలు పూసే ఔషధ మొక్క.దీని శాస్త్రీయనామం కొమ్మిఫోరా వైటై (Kommiphora wightii).బర్సెరేసియే కుటుంబంలో ఎన్నోజాతులు ఉన్నాయి.ఒక్క కొమ్మిఫొరా వైటై (గుగ్గిలం) తప్ప మిగతా జాతులు విషపదార్ధాలు కలిగిఉన్నందున బహు కొద్దిమాత్రమే వాడుకలో ఉన్నవి. సుమారు 3, 000 సంవత్సరాలనుండి ఆయుర్వేద మందులలో ఈ గుగ్గుల్ వాడబడుతూ ఉంది.ఇందులో మందుగా వాడబడేది " గుగుల్-స్టెరోన్‌ (గుగులిపిడ్ ) అనే రసాయన పదార్ధం. శరీరములో కొలెస్టిరాల్ ను తగ్గించే గుణం, కాలేయం కొలెస్టిరాల్ ను తయారీని ఆపుచేసే గుణం దీనికి ఉందని శాస్త్రీయంగా కనుగొనబడింది. ఇది శరీరంలో ఫర్నెసోయిడ్ X రెసెప్టార్లను మూసివేయడం వలన (the extract said to block the Farnesoid x receptor (FXR) కొలెస్టిరాల్ తగ్గుతుందని అంటారు. ఎఫ్.ఎక్ష్.ఆర్. కాలేయంలో బైల్ సాల్ట్స్ ను అదుపుచేయడం ద్వారా తన పనిచేస్తుందని శాస్త్రజ్ఞులు అంటారు . ఏదిఏమైనా టోటల్ కొలెస్టిరాల్ తగ్గుదల అంతగా ఉన్నట్లు తేలలేదు. ఎల్.డి.ఎల్. (చెడ్డ ) కొలెస్టెరాల్ ను ఎక్కువ చేసే గుణం ఉన్నట్లు ఆయుర్వేదంలో చెప్పబడి ఉంది .శరీర బరువును తగ్గిస్తుందనే నిదర్శనాలు లేవు . డేవిడ్ మూరే .. బేలర్ మెడికల్ కాలేజీలో పరిశోధనలు జరిపి కలెస్టిరాల్ ను తగ్గిస్తుందని క్లినికల్ రిపోర్ట్స్ ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. గుగ్గుల్ వ్యాపార రీత్యా పండిస్తారు. మంచి వాసనగల ఈ జిగురును ఎండిన తరువాత ధూపం గాను, అగరుబత్తీలు తయారీలోనూ వాడతారు.

లక్షణాలు[మార్చు]

 • గుగ్గులు మొక్క ఒక గుల్మం లేదా చిన్న చెట్టుగా సుమారు 3-4 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.
 • పత్రాలు ఏకాంతరంగా 1-3 చొప్పున ఉంటాయి.
 • ద్విరూప మొక్కలు.మగ, ఆడ వేరువేరుగా ఉంటాయి.
 • పుష్పాలు చిన్న సమూహాలుగా ఉంటాయి.
 • పండ్లు అండాకారంగా ఉంటాయి

వైద్య పరంగా ఉపయోగాలు[మార్చు]

తిప్పతీగను, త్రిఫలాలను సమాన భాగాలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచి నీళ్లకు కలిపి మరిగించి కషాయం తయారుచేసుకోవాలి. అర కప్పు కషాయానికి అర టీ స్పూన్ శుద్ధ గుగ్గులు కలిపి నెల రోజులపాటు తీసుకుంటే దీర్ఘకాలంనుంచీ బాధించే మెడనొప్పి తగ్గుతుంది. కీళ్ల నొప్పులకు వైద్యచికిత్సల్లో ఆయుర్వేద నిపుణులు యోగరాజ గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు, లాక్షాది గుగ్గులు, మహావాత విధ్వంసినీ రసం వంటి మందులు ఇస్తారు. వీటిని వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. యోగారాజా గుగ్గులు ఈ మందు పక్షవాతానికి పనిచేస్తుంది. కాంచనార గుగ్గులు ఈ మందులు చర్మవ్యాధులు, అంటు వ్యాధులకు, గడ్డలకు పనిచేస్తుంది. కీళ్ళ నొప్పులకు బెల్లము శుద్ధి చేసిన గుగ్గిలము, ఈ రెండు సమాన బాగాలుగా కలిపి దంచి రేగి పండంత మాత్రలు ఆరబెట్టి నిలువ చేసుకుని పూటకు ఒక మాత్ర చొప్పున 2 పూటల కొంచెం నెయ్యిలో కలిపి సేవిస్తూ వుంటే కీళ్ళ నొప్పులు చీల మండల నొప్పులు, మెడిమల నొప్పులు తగ్గిపోతాయి. గుగ్గుల్ ని అశ్వగందతో కలిపి వాడితే మధుమేహ వ్యాధికి మంచిదని ఆయుర్వేద వైద్యులు ఆంటారు . ఆయుర్వేదిక్ వైద్యులు గుగ్గిలము అనే పేరుతో ఈ కింద నుధహరించిన రీతిలో వాడుతున్నారు.

గుగ్గిలముల రకాలు[మార్చు]

 • రత్నపురి గుగ్గిలం,
 • తెల్ల గుగ్గిలం,
 • పుట్టగుగ్గిలమం
 • మహిసాక్షి గుగ్గిలం

ఇందులోనిని రత్నపురి గుగ్గిలం, తెల్లగుగ్గిలం, మహిసాక్షి గుగ్గిలం ఔషధోపయోగానికి వాడతారు.పుట్టగుగ్గిలం ధూపాలకు, రంగులకు ఉపయోగిస్తారు.

మహిసాక్షి గుగ్గిలం గుణములు[మార్చు]

మృదువు, జిగట, సువాసన, చేదు లక్షణాలు కలిగి ఉంటుంది. లోపలికిచ్చిన రక్తం శుభ్రపరచును. చెమట పుట్టించును. మూత్ర సంభందిత వ్యాధులకు మంచి జేయును. పొట్టకు బలం జేయును. మృదువు పరచును. శరీరానికి కాంతిదెచ్చును. రక్త పైత్యం, కఫం, మేధోరోగమం, శ్లేష్మం, క్రిమి, ఉన్మాదం, మూలవ్యాధి, దుష్టవ్రణాలు, గ్రంథులు, గండమాలలు, వాతం, దుష్ట రక్తం, ప్రాతనొప్పులు, విషం వీనిని హరించును. గడ్డలను, కంతులను కరగించును. నరాల రోగాలు, గొంతుకనొప్పి, గుండెలలోని దోషాలు, అమిత నడక వలన గలిగిన కాళ్ళవాపు వీనిని పోగొట్టును. బుద్ధికి బలమిచ్చును. కడుపులోను, గుండెలోను కూడియున్న చెడురక్తాన్ని శుభ్రపరచును, శీఘ్రప్రసవం గావించును. స్త్రీల ఋతుబద్ధంను విపును. నడుము నొప్పి, కాళ్ళనొప్పి, కీళ్ళనొప్పి వీనిని హరించును; స్త్రీలకు పాలు పడజేయును. మూత్రపు సంచిలో పుట్టు రాళ్ళను. నరాల మార్గాలలో పుట్టు గట్టి పదార్థాలను తీసి వేయును. విరేచనాలు కట్టును. వేడితగ్గటానికి చేసే ఔషధాలలో గలిపిన వాడినయెడల వేడిని తగ్గించును.

ఎర్రగుగ్గిలం తేనెలో గలిపి గొంతుక వాపుకు పట్టువేసిన నయమగును. ఆవుపాలలో గుగ్గిలం గలుపుకొని పుచ్చుకొనిన పుంసత్వంనకు బలము జేయును. ఇతర రుగ్మతలకు దీని చూర్ణం వేడినీళ్ళలో గలిపి పుచ్చుకొనవచ్చును. దీని సత్తువ 20 సంవత్సరావరకు దేహమందు నిలిచియుండును. ఉదయమున నోటవచ్చు ఉమ్మితో దీనిని అరగదీసి పైనపూసిన లేక పట్టువేసిన గడ్డలు హరించును.బుడ్డకు పూసిన అది కరిగిపోవును. దీనిని సురంజాను అను దుంప (its latin name is Hermodactylus) తో పుచ్చుకొనిన మూలవ్యాధి మెలుకలు ఊడిపడును. దీనిని మూలవ్యాధికి పట్టు వేసినను మేలు జేయును. దీని పొగ పుచ్చుకొనినను, దీని పొగ బట్టినను మూలవ్యాధి నయమగును. దీని పొగ దుర్గంధపుగాలికి, అంటు విషపు గాలియొక్క దోషమును పోగొట్టును . తేలు కుట్టిన చోట దీనిని పూసిన విషం హరించును. దెబ్బ తగిలిన చోట పూసిన వాపు హరించును. పట్టు వేసిన గాయంలో కూడియుండు దుష్టరక్తాన్ని శుభ్రపరచును. గండమాలలకు, కంఠంపైన నయ్యెడు గడ్డలు మానును. దీనిని నూనెవేసి నూరుచూ, నీళ్ళతో 4-5 పర్యాయములు కడుగుచుండిన జిగురు వచ్చును. దానిని దళసరిగుడ్డకు వేసి పట్టువేయ వలెను. దీనిని తినిన కడుపులోని వాపుల తీసివేయును. నల్లదబ్బ (spleen) కు జబ్బుచేయును. దీనికి విరుగుడు జాపత్రి, మోతాదు పూటకు 3 మొదలు 10 చిన్నంల యెత్తు వరకు.సుద్ద గుగ్గల గోళీలు హిమాలయా కంపెనీ వారు తయారుచేసి అమ్ముతున్నారు వీటిని కొలెస్టెరాల్, శరీర బరువును తగ్గడానికి వాడవచ్చును .

ప్రాంతీయ నామాలు[మార్చు]

 • ఆంగ్లం : ఇండియన్ బెడెలియా
 • హిందీ : గుగ్గుల్
 • బెంగాలీ : గుగ్గుల్
 • కన్నడ : గుగ్గుల్
 • మరాఠీ : గుగ్గుల
 • మలయాళం : గుగ్గులు, గుగ్గలు
 • తమిళం : మైషాక్షి, గుక్కల్

లక్షణాలు[మార్చు]

 • గుగ్గులు మొక్క ఒక గుల్మం లేదా చిన్న చెట్టుగా సుమారు 3-4 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.
 • పత్రాలు ఏకాంతరంగా 1-3 చొప్పున ఉంటాయి.
 • ద్విరూప మొక్కలు.
 • పుష్పాలు చిన్న సమూహాలుగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గుగ్గులు&oldid=4185236" నుండి వెలికితీశారు