గుర్మీత్ సింగ్ కూనర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుర్మీత్‌ సింగ్ కూనర్
రాజస్థాన్ శాసనసభ
నియోజకవర్గంకరణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1948 జూన్ 6
అజ్మీర్
మరణం2023 నవంబరు 15(2023-11-15) (వయసు 75)
ఢిల్లీ
జాతీయతభారతీయుడు
సంతానంరూపిందర్ సింగ్ కూనర్
తల్లిదండ్రులుఛాజాసింగ్ (తండ్రి)
వృత్తివ్యవసాయం, రాజకీయ నాయకుడు

గుర్మీత్ సింగ్ కూనర్ (1948 జూన్ 6 - 2023 నవంబరు 15) భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన రాజస్థాన్ నుండి భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు. 2018 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో గెలిచిన ఆయన కరణ్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1][2] ఆయన మంత్రిగానూ కొనసాగుతున్నాడు. ఆయన గతంలో 1998 (కాంగ్రెస్), 2008 (స్వతంత్ర)[3] అసెంబ్లీ ఎన్నికలలోనూ గెలుపొంది ఈ నియోజకవర్గానికి శాసన సభ్యుడిగా ఉన్నాడు.

2023 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో ఆయన తిరిగి కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. నవంబరు 25న ఎన్నికలు జరిగి, ఐదు రాష్ట్రాలతోపాటు డిసెంబరు 3న రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో ఆయన అకాల మరణం చెందాడు.[4]

మరణం

[మార్చు]

75 ఏళ్ల గుర్మీత్ సింగ్ కూనర్ అనారోగ్యంతో నవంబరు 12న ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయన 2023 నవంబరు 15న తుది శ్వాస విడిచాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. NDTV (2018). "Constituencies Wise Election Results of Rajasthan 2018" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
  2. India (11 December 2018). "Rajasthan Election Results 2018 Complete Winners List, Party and Constituency Wise Results" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
  3. infoelections (8 June 2015). "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
  4. 4.0 4.1 "Rajasthan Assembly Polls: పట్టుమని పదిరోజులు లేవు.. ఎన్నికలకు ముందే మరణించిన కాంగ్రెస్ అభ్యర్థి - NTV Telugu". web.archive.org. 2023-11-15. Archived from the original on 2023-11-15. Retrieved 2023-11-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Congress candidate Gurmeet Singh Kooner from Karanpur seat dies during treatment at AIIMS-Delhi - The Hindu". web.archive.org. 2023-11-15. Archived from the original on 2023-11-15. Retrieved 2023-11-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)