గుళ్ళపల్లి సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుళ్ళపల్లి సుబ్బారావు
జననంగుళ్ళపల్లి సుబ్బారావు
ఫిబ్రవరి 15 1926
గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, ప్రస్తుత భట్టిప్రోలు మండలం, పెసర్లంక
మరణంమార్చి 13 2014
ఇతర పేర్లుగుళ్ళపల్లి సుబ్బారావు
ప్రసిద్ధికమ్యూనిస్టు నాయకులు, వర్లు విద్యా కేంద్రం నిర్వాహకులు, గొర్రెపాటి విద్యా ట్రస్ట్ కమిటీ అధ్యక్షులు
తల్లిదండ్రులులక్ష్మీనారాయణ, మాణిక్యమ్మ

గుళ్ళపల్లి సుబ్బారావు ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, వర్లు విద్యా కేంద్రం నిర్వాహకులు, గొర్రెపాటి విద్యా ట్రస్ట్ కమిటీ అధ్యక్షులు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన ఫిబ్రవరి 15 1926గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, ప్రస్తుత భట్టిప్రోలు మండలం, పెసర్లంక గ్రామంలో లక్ష్మీనారాయణ శ్రీమతి మాణిక్యమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి ధనిక భూస్వామ్య కుటుంబానికి చెందినవారు. సుబ్బారావు గారు 10 మాసముల బాలుడుగా ఉన్నప్పడు తల్లి మాణిక్యమ్మను, రెండు సంuల 6 మాసాల బాలుడుగా ఉన్నప్పడు తండ్రి లక్ష్మీనారాయణ గారిని కోల్పోయారు. సుబ్బారావుగారు తల్లి గర్భంలో ఉన్నప్పడే లక్ష్మీ నారాయణ గారు కుమారులకు ఆస్తి వాటాలు పంపిణీ చేసారు. కుమారులతో పాటు లక్ష్మీనారాయణ గారు కూడా ఒక వాటా తీసుకున్నారు. ఆయన ఆస్తే తండ్రి తదనంతరం సుబ్బారావు గారికి వచ్చినది కానీ, సోదరులతో ఉమ్మడి వాటా లేదు. సుబ్బారావు గారు తమ సోదరి రాఘవమ్మగారి వివాహం తమ ఖర్చులతోనే తనకు వచ్చిన ఆస్తిలో కొంత ఇచ్చి చేసారు. శ్రీ సుబ్బారావు గారి బాల్యమంతా సరైన సంరక్షణ, మార్గదర్శకత్వం లేకపోయినా, ఎటువంటి దుర్వ్యసనాలకు లోనుగాక స్వయం నియంత్రణతో వ్యక్తిత్వం అభివృద్ధి చేసికొన్నారు. 1940కి కమ్యూనిస్టు ఉద్యమం ఆముదాల్లంక ప్రాంతంలో సాగుతూ ఉండడంతో దాని ప్రభావం ఆయన మీద కూడా పడి యువజన కార్యక్రమాలలో వాలంటీరుగా పాల్గొంటూ ఉండేవారు. ఆముదాల్లంకలో 5వ తరగతి వరకు, పెసర్లంకలో 6వ తరగతి చదివారు. వీరి పెదతల్లి శ్రీమతి గొర్రెపాటి రత్తమ్మ, పినతల్లి శ్రీమతి శేషమ్మ, ఘంటసాల గ్రామంలో ఉండటంతో అప్పడప్పడు వచ్చి వెళ్ళడం అదే పరిచయాలతో 1944న జరిగిన యువజనోత్సవాలలో ఘంటసాల వచ్చి పాల్గొన్నారు.

పెసర్లంక గ్రామంలో తండ్రి నివాస స్థలంలో ఇల్లు వేసుకోగా పెద అన్న రాఘవయ్య గారి పిల్లలు సరిహద్దు తగాయిదా పడి సహకరించకపోవడంతో బాధపడి అక్కడ స్థిరపడడం విరమించుకున్నారు. మే 17 1946లో పెదతల్లి రత్తమ్మగారి మనుమరాలు జయలక్ష్మితో ఘంటశాలలో వివాహం జరిగింది. 1948 లో ఇల్లు కొనుక్కొని ఘంటసాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.

సాంఘిక కార్యక్రమాలలో[మార్చు]

1967లో కాంగ్రెస్, ఇరు కమ్యూనిస్టు పార్టీల మధ్య నిడుమోలు సీటుకు జరిగిన శాసనసభ ఎన్నికలలో ముఖ్యభూమిక వహించి, ఎన్నిక రోజు ముందు సి.పి.ఐ తమ అభ్యర్థి కాకుండా కాంస్ కు ఓటు వేయూలని తీసుకున్న తప్పడు రాజకీయ నిర్ణయంతో విభేదించటం నియోజక వర్గంలో సంచలనం కలిగించినది. అప్పటినుండి ప్రస్తుతం రాజకీయాలలో తాను ఇమడలేనని నిర్ణయించుకొని గ్రామ అభివృద్ధి, సాంఘిక కార్యక్రమాలకే పరిమితమవ్యాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆయన జీవితంలో ఏనాడూ తాను నమ్మిన కమ్యూనిజంపై నమ్మకం కోల్పోలేదు. సాంఘికంగా సామాజికంగా వచ్చిన మార్పులకు బాధపడుతూ, తన నిజాయితీని నిర్మొహమాటాన్ని కొనసాగిసూ తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించారు. గ్రామంలో వీరి నిర్మోహమాటనికి బాధపడినవారు వున్నరేమో కానీ వీరి నిజాయితీని ప్రశ్నించినవారు లేరు అనుట అతివోయోక్తికాదు. వీరి కుటుంబ సభ్యులుకూడా వీరి నిజాయతీ వలన ఇబ్బందిపడిన సందర్భాలు ఉన్నాయి.

ఘంటసాల గ్రామస్తులు గొర్రెపాటి వెంకటరాయులు గారి కుమారుడు రంగనాధ బాబుగారు తమ తల్లిదండ్రుల పేర ట్రసును ఏర్పాటు చేసి గ్రామ అభివృదికమిటీకి శ్రీ సుబ్బారావు గారిని అధ్యక్షులుగా చేసి గ్రామంలో స్కూలు భవనాలు నిర్మిచండం, మరుగుదొడ్లు నిర్మించడం, మంచినీటి సరాఫారా టాంక్ నిర్మాణం చుట్టు ప్రక్కల గ్రామాలలోని పేద విద్యారులకు ఉపకారవేతనాలు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు తీసుకున్నారు. రంగనాధబాబు ఈ ప్రాంతానికి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మిక్కిలి ఉపయోగకరంగా ఉంటున్నాయి. పై కార్యాక్రమాలై కాకుండా బాబూగారు గుండేరు పై డామ్ నిర్మించి వందలాది ఎకరాలకు నీటి సమస్య లేకుండా చేశారు. చల్లపల్లిలో పాఠశాలలు నడుపుతూ గ్రామణ ప్రాంత విద్యార్థులకు ఉపయోగపతూ అనేక కార్యక్రమాలు ద్వారా జన్మభూమి రుణం తీర్చుకున్నారు.

ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ నిపుణులు, గ్రామవాసి అయిన ఉప్పలపాటి వెంకటేశ్వర్లు (యు.వి.వర్లు) జన్మభూమిపై అభిమానంతో ఈ ప్రాంత పేద విద్యార్థులకు సహాయం చేయాలనే దృష్టితో ఐ.ఐ.టి స్థాపించుటకు నిర్ణయించి ఆ బాధ్యతను సుబ్బారావు గారికి ఇవ్వగా ఆయన ఆ సంస్థను కావలసిన వసతులు సమకూర్చి 2013 వరకు కార్యదర్శి, కరస్పాండెంట్ గా వ్యవహరించారు.

రాజకీయాలలో[మార్చు]

ఘంటసాల గ్రామానికి రాగానే గ్రామ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఎన్నుకొనబడి పార్టీ కార్యక్రమాలలో పూర్తిగా మమేకమయ్యారు. గ్రామ కూలి రేట్ల ఉద్యమాలలో ముఖ్య భూమిక వహించేవారు. తాలూకా, జిల్లా పార్టీ కార్యక్రమాలలోను, ఉద్యమాలలోను ముఖ్య భూమిక వహిస్తూ 1955 నుండి 1964 వరకు దివి తాలూకా ఉమ్మడి పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులుగాను, జిల్లా కౌన్సిల్ సభ్యులుగాను ఉన్నారు. 1964 పార్టీ చీలిన తరువాత కూడా సి.పి.ఐ. తాలూకా కార్యవర్గంలోనూ జిల్లా కౌన్సిల్లోను ముఖ్యభూమిక వహించారు. పార్టీ చీలికతో బాధపడి నాలుగు రోజులు చండ్ర రాజేశ్వరరావుగారు, సుబ్బారావు గారి ఇంటి వద్ద ఘంటశాలలో ఉండి విశ్రాంతి తీసుకున్నారు. 1950, 1960 దశకంలో ఘంటశాలలో జరిగిన జిల్లా కౌన్సిల్, రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు రెండుసార్లు నిర్వహణ ఏర్పాట్లలో ప్రధాన పాత్ర వహించి జయప్రదంగా నిర్వహించారు. పార్టీ యూనిట్ సమావేశాలలో శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య వంటి వారిని కూడా నిర్మొహమాటంగా (తాడేపల్లి సమావేశంలో) నిలదీస్తే సమాధానం చెప్పలేక, “సుబ్రావ్ కూర్చో" అన్నారు.

మరణం[మార్చు]

ఆయన మార్చి 13 2014 వ తేది రాత్రి 10. 30 నిమిషాలకి స్వర్గస్తులయ్యారు.

మూలాలు[మార్చు]

  1. "గుళ్ళపల్లి అస్తమయం". Archived from the original on 2014-05-21. Retrieved 2016-01-03.

ఇతర లింకులు[మార్చు]