గూటాల కృష్ణమూర్తి
గూటాల కృష్ణమూర్తి | |
---|---|
జననం | గూటాల కృష్ణమూర్తి 1928 జూలై 10 1928 జూలై 10 పర్లాకిమిడి |
మరణం | 2016 జూలై 13 | (వయసు 88)
నివాస ప్రాంతం | లండన్, యునైటెడ్ కింగ్‌డమ్ |
ఇతర పేర్లు | గూటాల (భారతదేశము) జి.కె. (ఇంగ్లాండు) |
వృత్తి | ఆంగ్లోపాధ్యాయు |
ప్రసిద్ధి | రచయిత , సాహితీకారుడు |
గూటాల కృష్ణమూర్తి (జూలై 10, 1928 - జూలై 13, 2016) తెలుగు సాహితీకారుడు, రచయిత.
నేపథ్యం
[మార్చు]భారతదేశములో గూటాలగా, ఇంగ్లాండులో జి.కె.గా ప్రసిద్ధుడైన గూటాల కృష్ణ మూర్తి 1928 జూలై 10 వ తేదీన పర్లాకిమిడిలో జన్మించారు. విజయనగరము లోనూ, విశాఖపట్నం ఎ.వి.ఎం.కళాశాలలోనూ, ఆంధ్ర విశ్వవిద్యాలయములోనూ విద్యనభ్యసించి ఆంగ్ల సాహిత్యములో ఆనర్స్ పూర్తిచేసి మూడేళ్ళు అమలాపురం ఎస్.కె.బి.ఆర్. కళాశాలలోను, మరో మూడేళ్ళు ప్రస్తుత ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ కాలేజీలలోనూ ఆంగ్లోపాధ్యాయునిగా పనిచేశారు. అక్కడ పనిచేస్తూనే సాగర్ విశ్వవిద్యాలయములో పార్ట్ టైం పరిశోధకునిగా " ఫ్రాన్సిస్ ధామస్ - ఎ క్రిటికల్ బయోగ్రఫీ " అన్న అంశముపై పరిశోధన చేపట్టారు. 1962 లో లండన్ టైమ్‌స్ పత్రికా కార్యాలయములో గుమస్తా ఉద్యోగము కోసం లండన్ వచ్చిన గూటాల అక్కడే తన పి.హెచ్.డి కొనసాగించి 1967 లో డాక్టరేట్ సంపాధించారు. ఆ తర్వాత ఇన్నర్ లండన్ ఎడ్యుకేషన్ అథారిటీ సర్వీసులో ప్రవేశించి లండన్ లోని వివిధ విద్యాలయాలలో అధ్యాపకునిగా పనిచేసారు.
సాహితీ సేవ
[మార్చు]గూటాల కృష్ణమూర్తి ఇంగ్లండులో పనిచేసే ఇంగ్లీషు ప్రొఫెసరైనా వారికి ఆధునిక తెలుగు సాహిత్యంపై చాలా మక్కువ. రాచకొండ విశ్వనాథశాస్త్రి పట్ల అభిమానం. ఈయన 'జుబ్బా లేని అబ్బాయి' అని ఒక చాలా పెద్ద నవల తెలుగులో సంకల్పించి మొదటి ప్రకరణాలేవో రాసినట్లూ, మనదేశం లోని సామాజిక జీవన అస్తవ్యస్తతలు, అన్యాయాలు, దోపిడీ వ్యవస్థ, అణగారిన వర్గాల పేదరికం, దుర్భరయాతన ప్రతీకాత్మకంగా పెద్ద నవలగా రాయాలని ఆయన అనుకుంటున్నట్లు ఆయన మాటలను బట్టి తెలిసింది.
గూటాల కృష్ణమూర్తి సూర్యకుమారిపై ఒక ప్రత్యేక గ్రంథం ప్రచురించారు. ఆయన శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకం, శ్రీశ్రీ స్వయంగా చదివిన గేయాల టేపు ప్రజలకు అందించారు. ఈ పుస్తకం ఇండియాలో నవంబరు 2007 లోనూ, ఇంగ్లండులో ఫిబ్రవరి 2008 లోనూ విడుదల అయింది.
గూటాల వారి సాహితీసేవలకు గాను లండన్ తెలుగు సంస్థ జీవితసాఫల్య అవార్డును ఇచ్చి గౌరవించింది.[1]
వ్యక్తిగత జీవితము
[మార్చు]కృష్ణమూర్తి గారి భార్య శ్రీమతి వెంకటరమణ ఆ రోజులలోనే బెనారస్ విశ్వవిద్యాలయం నుండి కర్బన రసాయనశాస్త్రంలో ఎమ్మెస్సీ పట్టభదృరాలు. వివిధ కళాశాలల్లో అధ్యాపకురాలిగా పనిచేసారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి.
గూటాల కృష్ణ మూర్తి వ్రాసిన కొన్ని పుస్తకాలు / కవితలు.
[మార్చు]- జుబ్బాలేని అబ్బాయి,
- భజగోవిందం,
- కుకునం (వంట ),
- క్లిననం (వంటపాత్రలు, ఇల్లు శుభ్రము చేయడం ),
- స్లిపనం (సంసారము చేయడం ),
- కననం (పిల్లల్ని కనడం), మున్నగునవి
మరణం
[మార్చు]వీరు అస్వస్థతతో బాధపడుతూ విశాఖపట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ 2016, జూలై 13 వ తేదీ బుధవారం వేకువజామున మరణించారు[2].
మూలాలు
[మార్చు]- ↑ TAL Awards 2006
- ↑ సాక్షి. "సాహితీవేత్త 'గూటాల' కన్నుమూత". Archived from the original on 14 జూలై 2016. Retrieved 14 July 2016.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link)
- పద్మడా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వ్రాసిన వ్యాసం.
- సాహితీవేత్త 'గూటల' కన్నుమూత.