గేలక్సీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎన్.జి.సి. 4414, సర్పిలాకార గేలక్సీ, హబుల్ టెలీస్కోపు తీసిన చిత్రం.
హబుల్ టెలీస్కోపు చిత్రం. సోంబ్రెరో సర్పిలాకార గేలక్సీ.
నక్షత్ర విస్ఫోట (Messier 82) గేలక్సీ. హబుల్ టెలీస్కోపు చిత్రం.[1] నక్ష్రత్రం పుట్టుక.

గేలక్సీ (ఆంగ్లం : Galaxy) ఓ ఘనమైన గురుత్వాకర్షక వర్తుల విధానం, ఇందులో కోటానుకోట్ల నక్షత్రాలు, అంతర్ నక్షత్ర యానకం ఐన వాయువు, అంతరిక్ష ధూళి, చీకటి పదార్థం గలవు.[2][3] గేలక్సీ అనే పేరుకు మూలం గ్రీకు భాష పదం 'గేలక్సియాస్' [γαλαξίας], అర్థం "పాలతోకూడిన" గేలక్సీ, (పాలపుంతలో లాగ). ఈ గేలక్సీల పరిధి మరుగుజ్జు వీటిలో కనీసం ఓ కోటి నక్షత్రాల [4] (107) నుండి రాకాసులు వెయ్యికోట్ల నక్షత్రాలను కలిగి వుంటాయి.[5] (1012) ఈ నక్షత్రాలన్నీ ఓ అత్యధిక గరిమ గల కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తూ వుంటాయి. ఈ గేలక్సీలలో నక్షత్ర కుటుంబాలూ వుంటాయి, నక్షత్ర కూటమి, అనేక అంతర్ నక్షత్ర మేఘాలు వుంటాయి. మన సూర్యుడు, పాలపుంత గేలక్సీ లోని ఒక నక్షత్రం; మన సౌరమండలములో భూమి, ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ పరి భ్రమిస్తూ ఉంటాయి.

చారిత్రకంగా గేలక్సీలు తమ ఆకారాన్ని బట్టి గుర్తింపబడ్డాయి, వాటి ఆకారాలు శాస్త్రీయంగా, క్రింది విధంగా గుర్తింప బడ్డాయి :

నామ రూపాలు

[మార్చు]
హబుల్ వర్గీకరణ్ ప్రకారం E వర్తులాకార; S సర్పిలాకార; SB అసర్పిలాకార గేలక్సీ.[a]

గేలక్సీ, గ్రీకు పదంనుండి పుట్టినది. అంతరిక్ష సాహిత్యంలో 'గేలక్సీ' అనే పదము, మనముంటున్న పాలపుంత గేలక్సీ కొరకు ఉపయోగిస్తారు.[10]

వీక్షణ చరిత

[మార్చు]

మనముంటున్న గేలక్సీ, లేదా పాలపుంత గేలక్సీని శాస్త్రవేత్తలు, వీక్షకులూ, క్షుణ్ణంగా అనేక యుగాలుగా వీక్షిస్తూ నిర్దిష్టమైన సమాచారాన్ని క్రోడీకరించారు. వీటికి శాస్త్రీయ నామాలు పెట్టారు.

చూడండి: పాలపుంత.

1785 లో విలియమ్ హెర్షెల్ సూచించిన పాలపుంత. ఇందులో నక్షత్రాల సాంఖ్యక ఆధారం అతిముఖ్యం. సౌరమండలం మధ్యలో వున్నట్లు భావింపబడింది.

విలియం హెర్షెల్, మొదటి సారిగా పాలపుంత గురించి విపులంగా వర్ణించాడు. మనం నివసిస్తున్న సౌరకుటుంబం లేదా సౌరమండలము, దీని మధ్యలో వున్నట్టుగా అభివర్ణించాడు.[11][12]

సుడిగుండ గేలక్సీ చిత్రం, 1845 లో విలియం పార్సన్స్, లార్డ్ రోసెలు గీచారు.

18వ శతాబ్దపు ఆఖరులో, చార్లెస్ మెస్సియర్, 109 కాంతివంతమైన నెబ్యూలాల జాబితా తయారు చేశాడు. తరువాత విలియమ్ హెర్షెల్ చే 5,000 నెబ్యూలాల జాబితా తయారు చేశాడు.[13] 1845 లో, లార్డ్ రాస్సె, ఓ కొత్త దూరదర్శిని (టెలీస్కోపు) ను తయారుచేసి, వర్తులాకార, సర్పిలాకార నెబ్యూలాల మధ్య తేడాలు తెలుపగలిగాడు.[14]

1917 లో, హెర్బర్ కుర్టిస్, ఎస్.ఆండ్రోమిడే నెబ్యూలాను మహా ఆండ్రోమిడాలో కనుగొన్నాడు.[15]

మహా ఆండ్రోమిడా నెబ్యూలా చిత్రం 1899 లో తీసినది. తరువాత దీనికి ఆండ్రోమిడా గేలక్సీ అని పేరు పెట్టారు.

నవీన శోధనలు

[మార్చు]

1944 లో హెండ్రిక్ సీ.వాన్ డె, మైక్రోవేవ్ రేడియేషన్ గురించి చెప్పాడు.[16] ఈ రేడియేషన్ 1951 లో గమనించబడింది. ఈ రేడియేషన్ వలన గేలక్సీల అధ్యయనం చాలా సుళువైంది. డాప్లర్ షిఫ్ట్, ధూళి సంగ్రహణ వలన దీనిపై ప్రభావం తక్కువ.[17] అభివృద్ధి చెందిన రేడియో టెలీస్కోపుల ద్వారా, ఇతర గేలక్సీలలో గల హైడ్రోజన్ను సైతం, కనుగొనవచ్చును.

పలు రకాలు, ఆకారాలు

[మార్చు]

గేలక్సీలు ప్రధానంగా మూడు రకాలు: వర్తులాకార, సర్పిలాకార, అనాకార గేలక్సీలు. వీటి ఆకారాలను నిర్ణయించే వర్గీకరణలను 'హబుల్ సీక్వెన్స్' అని అంటారు. ఇవి వీక్షణాలపై మాత్రమే ఆధారపడి వుంటుంది. ఇంకా పలువిషయాలు లెక్కలోకి తీసుకుంటారు, అవి, 'నక్షత్రాల పుట్టుక' రేటు (నక్షత్రాల విస్ఫోటక గేలక్సీలు), 'కేంద్రకాలలో క్రియాశీలత' (క్రియాశీలక గేలక్సీలలో).[18]

వర్తులాకార

[మార్చు]

వర్తులాకార గేలక్సీలు రాక్షసాకారాలలో వుంటాయి. ఇవి అతి పెద్ద గేలక్సీలు. ఈ రకం గేలక్సీలు ఏర్పడుటకు కారణం 'గేలక్సీల ఆకర్షణ' వల ఏకమై పెద్ద గేలక్సీలేర్పడుట అని భావిస్తున్నారు. ఈ ఏకీకరణ వలన రెండు లేదా అంతకన్నా ఎక్కువ గేలక్సీలు మమేకమైనపుడు, ఢీకొనడాలు, మమేకాలు, ప్రళయపాతాలుగా వుంటాయని భావిస్తారు.[19] నక్షత్రవిస్ఫోట గేలక్సీలు వీటికి ఉదాహరణ అని, గేలక్సీల ఢీకొనడాల వలన వర్తులాకార గేలక్సీలు ఏర్పడుటకు సహాయ పడుతాయి[20]

సర్పిలాకార

[మార్చు]

సర్పిలాకార గేలక్సీలలో పరిభ్రమిస్తున్న నక్షత్రాల పళ్ళెం, అంతర్-నక్షత్ర మాధ్యమం, వీటితో పాటు ప్రాచీన నక్షత్రాల సమూహం వుంటాయి. ఇవి బయటివైపు విస్తరిస్తూ వుంటుంది. హబుల్ వర్గీకరణ అనుసారం వీటిని S, (a, b, లేదా c) తో సూచిస్తారు.[21]

ఎన్.జీ.సీ. 1300, బార్‌డ్ గేలక్సీకు ఉదాహరణ. సౌజన్యం:హబుల్ టెలీస్కోపు నాసా.

ఇతర రూపాలు

[మార్చు]
హోగ్స్ వస్తువు, రింగ్ గేలక్సీకు ఉదాహరణ. నాసా వారిచే హబుల్ టెలీస్కోపు చే తీయబడిన చిత్రం.

ప్రత్యేక గేలక్సీలు, గేలక్సీల రూపాంతరాలు. వీటికి చక్కటి ఉదాహరణ రింగ్ గేలక్సీలు లేదా గుండ్రటి గేలక్సీలు. ఇవి ఇతర గేలక్సీలతో పోటుపాటుల సంబంధాలు కలిగివుంటాయి. వీటిలో రింగులలాంటి నక్షత్రాలుంటాయి. సర్పిలాకార గేలక్సీల గుండా చిన్న చిన్న గేలక్సీలు చొచ్చుకొని పోయినపుడు ఈ రింగ్ గేలక్సీలు ఏర్పడుతాయి.[22]

మరుగుజ్జులు

[మార్చు]

పెద్ద పద్ద వర్తులాకార గేలక్సీలు విశ్వంలో ప్రాముఖ్యతలను సంతరించుకొన్ననూ, చాలా గేలక్సీలు మరుగుజ్జులే. ఈ గేలక్సీలు పాలపుంతలో నూరవ వంతు మాత్రమే వుంటాయి. ఈ చిన్న గేలక్సీలు కొన్ని బిలియన్ల నక్షత్రాలను మాత్రమే కలిగివుంటాయి.[23]

The Antennae Galaxies are undergoing a collision that will result in their eventual merger. Credit:Hubble Space TelescopeNASA/ESA.
A jet of particles is being emitted from the core of the elliptical radio galaxy M87. Credit:Hubble Space TelescopeNASA/ESA.

ఇవీ చూడండి

[మార్చు]

నోట్స్

[మార్చు]
 1. ^ Galaxies to the left side of the Hubble classification scheme are sometimes referred to as "early-type", while those to the right are "late-type".
 2. ^ The term "field galaxy" is sometimes used to mean an isolated galaxy, although the same term is also used to describe galaxies that do not belong to a cluster but may be a member of a group of galaxies.

మూలాలు

[మార్చు]
 1. "Happy Sweet Sixteen, Hubble Telescope!". NASA. April 24, 2006. Retrieved 2006-08-10.
 2. L. S. Sparke; J. S. Gallagher III (2000). Galaxies in the Universe: An Introduction. Cambridge: Cambridge University Press. ISBN 0-521-59704-4.
 3. Hupp, E.; Roy, S.; Watzke, M. (August 21, 2006). "NASA Finds Direct Proof of Dark Matter". NASA. Archived from the original on 2020-03-28. Retrieved 2007-04-17.
 4. "Unveiling the Secret of a Virgo Dwarf Galaxy". ESO. May 3, 2000. Archived from the original on 2012-07-29. Retrieved 2007-01-03.
 5. 5.0 5.1 "Hubble's Largest Galaxy Portrait Offers a New High-Definition View". NASA. February 28, 2006. Retrieved 2007-01-03.
 6. Hoover, Aaron (June 16, 2003). "UF Astronomers: Universe Slightly Simpler Than Expected". Hubble News Desk. Archived from the original on 2007-02-25. Retrieved 2007-02-05.
 7. D. Gilman. "The Galaxies: Islands of Stars". NASA WMAP. Archived from the original on 2012-08-02. Retrieved 2006-08-10.
 8. "Galaxy Clusters and Large-Scale Structure". University of Cambridge. Retrieved 2007-01-15.
 9. D. Finley; D. Aguilar (November 2, 2005). "Astronomers Get Closest Look Yet At Milky Way's Mysterious Core". National Radio Astronomy Observatory. Retrieved 2006-08-10.
 10. Koneãn˘, Lubomír. "Emblematics, Agriculture, and Mythography in The Origin of the Milky Way" (PDF). Academy of Sciences of the Czech Republic. Archived from the original (PDF) on 2006-07-20. Retrieved 2008-05-15.
 11. Marschall, Laurence A. (October 21, 1999). "How did scientists determine our location within the Milky Way galaxy--in other words, how do we know that our solar system is in the arm of a spiral galaxy, far from the galaxy's center?". Scientific American. Archived from the original on 2008-10-01. Retrieved 2007-12-13.
 12. Kuhn, Karl F.; Koupelis, Theo (2004). In Quest of the Universe. Jones and Bartlett Publishers. ISBN 0-7637-0810-0.
 13. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; our_galaxy అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 14. Abbey, Lenny. "The Earl of Rosse and the Leviathan of Parsontown". The Compleat Amateur Astronomer. Archived from the original on 2012-06-04. Retrieved 2007-01-04.
 15. Heber D. Curtis (1988). "Novae in Spiral Nebulae and the Island Universe Theory". Publications of the Astronomical Society of the Pacific. 100: 6.
 16. Tenn, Joe. "Hendrik Christoffel van de Hulst". Sonoma State University. Archived from the original on 2012-05-29. Retrieved 2007-01-05.
 17. M. López-Corredoira; P. L. Hammersley; F. Garzón; N. Castro-Rodríguez; M. Schultheis; T. J. Mahoney (2001). "Searching for the in-plane Galactic bar and ring in DENIS". Astronomy and Astrophysics. 373: 139–152. Retrieved 2007-01-08.
 18. Jarrett, T.H. "Near-Infrared Galaxy Morphology Atlas". California Institute of Technology. Retrieved 2007-01-09.</re విశ్వంలో దాదాపు 100 బిలియన్ల గేలక్సీలు గలవు. మనం వీక్షించగలిగే విశ్వంలో (1011) గేలక్సీలు గలవు.<ref>Mackie, Glen (February 1, 2002). "To see the Universe in a Grain of Taranaki Sand". Swinburne University. Retrieved 2006-12-20.
 19. "Galaxies". Cornell University. October 20, 2005. Retrieved 2006-08-10.
 20. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; elliptical అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 21. Smith, Gene (March 6, 2000). "Galaxies — The Spiral Nebulae". University of California, San Diego Center for Astrophysics & Space Sciences. Archived from the original on 2012-07-10. Retrieved 2006-11-30.
 22. R. A. Gerber; S. A. Lamb; D. S. Balsara (1994). "Ring Galaxy Evolution as a Function of "Intruder" Mass". Bulletin of the American Astronomical Society. 26: 911.
 23. S. Phillipps; M. J. Drinkwater; M. D. Gregg; J. B. Jones (2001). "Ultracompact Dwarf Galaxies in the Fornax Cluster". The Astrophysical Journal. 560 (1): 201–206.[permanent dead link]

General references:

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గేలక్సీ&oldid=3997661" నుండి వెలికితీశారు