గొట్టె భూపతి
గొట్టె భూపతి | |||
| |||
మాజీ పార్లమెట్ సభ్యుడు
| |||
పదవీ కాలం 1983 – 1989 | |||
నియోజకవర్గం | పెద్దపల్లి | ||
---|---|---|---|
మాజీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు (నేరళ్ళ శాసనసభ నియోకవర్గం)
| |||
పదవీ కాలం 1967 నుండి 1978 వరకు (రెండుసార్లు) | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1937 ఆగస్టు 15 తంగళ్ళపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | స్వతంత్ర | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపి |
గొట్టె భూపతి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి, మాజీ ఎమ్మెల్యే. 1967 నుండి 1978 వరకు నేరెళ్ల శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా, 1983 నుండి 1989 వరకు పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా ప్రాతినిధ్యం వహించాడు.[1]
జననం, విద్య
[మార్చు]భూపతి 1937, ఆగస్టు 15న తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి గ్రామంలో జన్మించాడు. తండ్రిపేరు అశోలు. భూపతి మెట్రిక్యులేట్ వరకు చదువుకున్నాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]భూపతికి శాంతతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు జి. సుధీర్ బాబు,[2] జి. సృజన్ బాబు , జి. సుమన్ బాబు ఉన్నారు.[3]
రాజకీయ జీవితం
[మార్చు]1967, 1972లలో జరిగిన అంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందాడు. ఉమ్మడి కరీంనర్ జిల్లా చరిత్రలో రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఒకేఓక వ్వక్తి గొట్టె భూపతి.[4] 1983లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసి గెలుపొందిన భూపతి,[5] ఆ పార్టీ తరపున పార్లమెంటులో అడుగుపెట్టిన తొలి పార్లమెంట్ సభ్యుడిగా నిలిచాడు.[6] ఆ తరువాత 1984 ఎన్నికల్లో గెలుపొంది 1989 వరకు ఎంపీగా పనిచేశాడు.[7]
2006, జూన్ 9న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[8]
ఎమ్మెల్యేగా
[మార్చు]సంవత్సరం | క్రమసంఖ్య | అసెంబ్లీ నియోజకవర్గం పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|
1967 | 255 | నేరెళ్ల | ఎస్.సి. | గొట్టె భూపతి | ఇండిపెండెంట్ | 12243 | జె.ఎం.ఆర్ దేవి | ఇండిపెండెంట్ | 10400 |
1972 | 255 | నారెళ్ళ | ఎస్.సి. | గొట్టె భూపతి | స్వతంత్ర | 17014 | బుట్టి వేరపాల్ | భారత జాతీయ కాంగ్రెస్ | 16024 |
ఎంపీగా
[మార్చు]లోక్‌సభ | కాలము | గెలిచిన అభ్యర్థి | పార్టీ |
---|---|---|---|
ఏడవ (ఉపఎన్నిక) | 1983-84 | గొట్టె భూపతి | తెలుగుదేశం పార్టీ |
ఎనిమిదవ | 1984-89 | గొట్టె భూపతి | తెలుగుదేశం పార్టీ |
నిర్వర్తించిన పదవులు
[మార్చు]- 1969-78: సిరిసిల్ల కోఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ వైస్-చైర్మన్
- 1968-77: ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడు
- పర్యాటక, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ
మూలాలు
[మార్చు]- ↑ "Members Bioprofile (BHOOPATHY, SHRI GOTTE)". loksabhaph.nic.in. Archived from the original on 2022-03-22. Retrieved 2022-03-22.
- ↑ Sakshi (14 December 2023). "రాచకొండ కమిషనర్.. మన సుధీర్‌బాబు". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
- ↑ Eenadu (25 November 2024). "రాచకొండ కమిషనర్‌కు మాతృవియోగం". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
- ↑ "స్వతంత్ర వీరులు". Sakshi. 2018-11-08. Archived from the original on 2022-01-11. Retrieved 2022-03-22.
- ↑ "తెలంగాణలో లోక్‌సభకు 9సార్లు ఉప ఎన్నికలు". Sakshi. 2019-03-23. Archived from the original on 2022-03-22. Retrieved 2022-03-22.
- ↑ "ప్రజాస్వామ్యాన్ని నొక్కివేస్తున్న నోట్లస్వామ్యం". andhrajyothy. 2021-11-03. Archived from the original on 2021-11-06. Retrieved 2022-03-22.
- ↑ "పెద్దపల్లి టిక్కెట్ ఎవరికో!". m.andhrajyothy.com. 2019-03-16. Archived from the original on 2022-03-22. Retrieved 2022-03-22.
- ↑ V6 Velugu (18 May 2023). "దగా పడ్డ ఉద్యమకారులు దండు కట్టాలె". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)