గొల్ల బాబురావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొల్ల బాబురావు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 నుండి ప్రస్తుతం
ముందు వంగ‌ల‌పూడి అనిత
నియోజకవర్గం పాయకరావుపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 10 సెప్టెంబర్ 1954
కొవ్వలి గ్రామం, మారేడుమిల్లి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు గొల్ల సత్యం, సాయమ్మ
జీవిత భాగస్వామి వసంతకుమారి
సంతానం సాయికార్తీక్, నాగసౌమ్య
నివాసం అడ్డరోడ్డు, యస్. రాయవరం మండలం పాయకరావుపేట
వృత్తి రాజకీయ నాయకుడు

గొల్ల బాబురావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

గొల్ల బాబూరావు 10 సెప్టెంబర్ 1954లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, మారేడుమిల్లి మండలం, కొవ్వలి గ్రామంలో గొల్ల సత్యం, సాయమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో డిగ్రీ, జబల్‌పూర్‌లో ఎంఏ, ఉస్మానియ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.[2][3]

ఉద్యోగ జీవితం[మార్చు]

గొల్ల బాబురావు 1986లో గ్రూప్ -I అధికారిగా నియమితుడై ఖమ్మం జిల్లా పంచాయత్ ఆఫీసర్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి 1991 వరకు అక్కడ విధులు నిర్వహించాడు. ఆయన 1991 నుండి 1993 వరకు విశాఖపట్నం జిల్లా సెట్విన్ సీఈఓ గా పని చేసి విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పదోన్నతి అందుకుని 1993 నుండి 1994 వరకు పని చేశాడు. గొల్ల బాబురావు పదోన్నతి అందుకుని కడప జిల్లా పరిషత్ సీఈఓ గా 1994 నుండి 1995 వరకు, 1995 నుండి 1997వరకు విశాఖపట్నం జిల్లా పరిషత్ సీఈఓ గా, 1997 నుండి 2002 వరకు తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సీఈఓ గా, 2002 నుండి 2004 వరకు తిరిగి విశాఖపట్నం జిల్లా పరిషత్ సీఈఓ గా పని చేసి పంచాయతీరాజ్‌ అడిషనల్‌ కమిషనర్‌గా పని చేసి స్వచ్చంద పదవి విరమణ చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

గొల్ల బాబురావు 2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి 2012లో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

గొల్ల బాబురావు తరువాత వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేసి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు అమలాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2015లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి జరిగిన ఎన్నికల్లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల ఉపాధ్యాయ కోటా ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాడు.[4] గొల్ల బాబూరావు 2019లో పాయకరావుపేట నియోజకవర్గం నుండి తిరిగి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5] ఆయన 15 సెప్టెంబర్ 2021న తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యునిగా నియమితుడయ్యాడు.[6][7]

2024లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా బాబూరావుకు టికెట్‌ లభించలేదు. దింతో ఆయనను 2024 ఫిబ్రవరి 08న రాజ్యసభకు వైసీపీ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది.[8]

మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 April 2014). "బరిలో విద్యాధికులు". Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.
  3. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ దళపతులు". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
  4. Sakshi (8 January 2015). "ఎమ్మెల్సీగా గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తా". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.
  5. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  6. TV9 Telugu (15 September 2021). "25 మందితో టీటీడీ పాలక మండలి.. తుది జాబితా ఖరారు చేసిన ఏపీ సర్కార్". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. 10TV (16 September 2021). "తిరుమల నూతన పాలకమండలి.. సభ్యుల జాబితా ఇదే | List of members of the new governing body of Tirumala" (in telugu). Archived from the original on 16 September 2021. Retrieved 4 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  8. Andhrajyothy (8 February 2024). "రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ". Archived from the original on 8 February 2024. Retrieved 8 February 2024.