గోపరాజు రశ్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోపరాజు రశ్మి వాసవి మహిళా మండలి ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు. గోపరాజు సమరం యొక్క భార్య.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె ఏప్రిల్ 23 1951పార్లమెంటు సభ్యురాలు చెన్నుపాటి విద్య మరియు గాంధేయవాది చెన్నుపాటి శేషగిరిరావు దంపతులకు జన్మించారు.ఆమె తల్లి భారత దేశ 7వ మరియు 9వ లోక్ సభ సభ్యురాలు. రశ్మి 1971 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.యస్సీ చేసారు.1994 లో యు.కె లోని బిర్మింగం విశ్వవిద్యాలయంలో మేనేజింగ్ సస్టైనబుల్ రూరల్ డెవలప్ మెంటు పై శిక్షణ పొందారు.[2]

కెరీర్[మార్చు]

ఆమె వాసవ్య మహిళా మండలి అనే స్వచ్ఛంద సంస్థకు 1980 నుండి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఉన్నారు. ఆమె 2011 నుండి ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ అప్రోఫియేత్ అధారిటీకి సభ్యులుగానూ, 2012-14 మహిళా శక్తి యొక్క ప్రభుత్వ శాఖకు దక్షిణ విభాగానికి ఎన్నికైనారు.2009-2012 లో గ్లోబల్ ఫ్ండ్స్ కొరకు భారతదేశంలో గల కంట్రీ కోఆర్డినేటింగ్ మెకానిజం సంస్థలో సభ్యులుగానూ, 1994-2009 లలో విజయవాడలోని ప్రభుత్వ బాలుర వసతిగృహ పరిశీలనా బోర్డు మెంబరుగానూ, 2009 నుండి విజయవాడ లోని కంట్రీ వుమెన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు దక్షిణ ప్రాంత చైర్మన్ గానూ, 2010 నుండి విజయవాడ మధ్య పట్టణ రోటరీ క్లబ్ లో సభ్యులుగానూ, సేవలనందించారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]