వికాస్ గోరా
వికాస్ గోరా విజయవాడ నాస్తిక కేంద్ర సభ్యుడు. గోరా మనుమడు.
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన ప్రముఖ నాస్తికవాది, విజయవాడ నాస్తిక కేంద్ర నిర్వాహకుడు అయిన గోపరాజు విజయం, సుమతి దంపతులకు జన్మించాడు.[1] ఆయన భారతదేశంలో విపత్తు, అత్యవసర నిర్వహణ రంగంలో పనిచేస్తున్నారు.[2] ఆయన భారతదేశం, విదేశాలలో అనేక మానవతా సంస్థలకు సలహాదారుడు, కోచ్. ఆయన యునైటెడ్ నేషన్స్, మానవతా ఏజన్సీలు, విద్యా సంస్థలు, ఇంటర్ ఏజన్సీ నెట్ వర్క్స్, క్వీన్‌లాండ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియా, UNCRD, జపాన్, కేర్ ఇండియా, కోడీ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్, కెనడా, బాలల హక్కులు మొదలైన దేశాలు, సంస్థలలో పనిచేసారు. ఆయన అత్యవసర నిర్వహణ, కెపాసిటీ బిల్డిం కొకరు ఉన్న ఉప వర్గంలో సభ్యునిగా యున్నారు. ఆయన భారతదేశ ప్రభుత్వం యొక్క 12వ పంచవర్ష ప్రణాళికా యొక్క ప్లానింగ్ కమిషన్ లో సభ్యులు.[3]
ఆయనకు 2006-08 లో ప్రతిష్ఠాత్మకమైన రోటరీ వరల్డ్ పీస్ ఫెలోషిప్ లభించింది. ఈ అవార్డు యు.ఎస్.ఎ లోని రోటరీ ఫొండేషన్ నుండి లభించింది. ఈ ఫెలోషిప్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయంలో అధ్యయనానికి గానూ యివ్వబడింది. ఆయన అంతర్జాతియ సంబంధాలు, సమాజ సేవలు, కమ్యూనిటీ అభివృద్ధి, పరిసరాల జర్నలిజం, యు.ఎన్ డిప్లొమసి, అహింస మార్గం అంరియు శాంతి, సంఘర్షణల పై విశేష కృషి చేసారు.
ప్రపంచ హ్యూమనిస్ట్ మహాసభలు
[మార్చు]ఇంగ్లాండులోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ప్రపంచ హ్యూమనిస్ట్ మహాసభలలో పాల్గొని అభివృద్ధి చెందుతున్న దృక్పథాన్ని తెలియజేయడానికి నాస్తికకేంద్రం నుండి డాక్టర్ విజయం, వికాస్ గోరాలను ఆహ్వానించారు. ఈ అంతర్జాతీయ మహాసభలలో వెయ్యికి పైగా ప్రతినిధులు 50 దేశాల నుండి పాల్గొంటున్నారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Sumathi Vijayam dead
- ↑ Vikas Gora to speak on world peace in Brazil
- ↑ "Vikas Gora, India". Archived from the original on 2014-10-12. Retrieved 2015-07-26.
- ↑ ప్రపంచ హ్యూమనిస్ట్ మహాసభలకు డాక్టర్ విజయం, వికాస్ గోరా పయనం
ఇతర లింకులు
[మార్చు]