గోపాల్ బోస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోపాల్ బోస్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ1947, మే 20
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
మరణించిన తేదీ2018, ఆగస్టు 26
బర్మింగ్‌హామ్‌
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాటింగ్, బౌలింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే1974 జూలై 15-16 - ఇంగ్లాండ్‌ తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్ డే ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 1 78 8
చేసిన పరుగులు 13 3,757 115
బ్యాటింగు సగటు 13.00 30.79 19.16
100s/50s 0/0 8/17 0/1
అత్యధిక స్కోరు 13 170 52
వేసిన బంతులు 66 4,405 246
వికెట్లు 1 72 5
బౌలింగు సగటు 39.00 26.97 26.80
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/39 5/67 2/26
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 40/– 3/–
మూలం: [1], 2006 ఫిబ్రవరి 8

గోపాల్ బోస్ (1947, మే 20 - 2018, ఆగస్టు 26) పశ్చిమ బెంగాల్ కు చెందిన భారతీయ క్రికెట్ ఆటగాడు.[1] బెంగాల్ తరపున దేశవాళీ క్రికెట్ తోపాటు 1974లో భారతదేశం తరపున ఇంగ్లాండ్‌తో అంతర్జాతీయ వన్డే మ్యాచ్ (13 పరుగులు, ఒక వికెట్) ఆడాడు.[2]

జననం

[మార్చు]

గోపాల్ బోస్ 1947, మే 20న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో జన్మించాడు.[3]

క్రికెట్ రంగం

[మార్చు]

సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యంతో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో మంచి ఆటతీరు కనబరచాడు. సిలోన్ (ప్రస్తుతం శ్రీలంక ) పర్యటన కోసం జాతీయ క్రికెట్ జట్టులో ఎంపికయ్యాడు. సునీల్ గవాస్కర్‌తో 194 పరుగుల భాగస్వామ్యం చేశాడు.[4] 1974-75 వెస్టిండీస్ పర్యటన కోసం 14-సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు, కానీ ప్లేయింగ్ ఎలెవెన్ నుండి తప్పించబడ్డాడు. తన కెరీర్ మొత్తంలో అనేక విజయాలతో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గోపాల్ బోస్ 1968/69 - 1978/79 మధ్యకాలంలో 78 ఫస్ట్ క్లాస్ గేమ్‌లలో ఎనిమిది సెంచరీలు, 17 అర్ధసెంచరీలతో 3757 పరుగులు చేశాడు. 72 వికెట్లు కూడా తీశాడు.[5]

కోల్‌కతా క్రికెట్ క్లబ్ ఆఫ్ ధాకురియాకి ప్రధాన కోచ్‌గా పనిచేశాడు.[6]

మరణం

[మార్చు]

గోపాల్ బోస్ 2018 ఆగస్టు 26న గుండెపోటుతో బర్మింగ్‌హామ్‌లో మరణించాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. "Gopal Bose Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-04.
  2. "IND vs ENG, India tour of England 1974, 2nd ODI at London, July 15 - 16, 1974 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-04.
  3. "Gopal Bose Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-04.
  4. "Former Bengal captain Gopal Bose passes away at 71". The Indian Express (in ఇంగ్లీష్). 2018-08-27. Retrieved 2023-08-04.
  5. "Former Bengal captain Gopal Bose passes away". Times of India. Retrieved 2023-08-04.
  6. Ghosh, Avijit. "Gopal Bose was Bengal's great cricket hope in the early 1970s". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-08-04.
  7. "Gopal Bose, former India player, passes away". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2023-08-04.

బయటి లింకులు

[మార్చు]