చర్చ:అణువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రసాద్ గారూ, ఆంగ్లంలో atom అనే పదానికి అర్థం "పరమాణువు" అని తెలుగు రసాయన శాస్త్ర పుస్తకాలలో ఉంది. "అణువు" అనే పదానికి ఆంగ్ల సమానార్థం molecule అని ఉంటుంది. ఈ వ్యాసం ఆంగ్ల వ్యాసంలో గల atom యొక్క అనువాదంలా కనబడుతుంది. మన భాషలో atomic structure అనగా పరమాణు నిర్మాణం అని అర్థం. ఈ వ్యాసం ఒక సారి పరిశీలించండి.-- కె.వెంకటరమణ 13:12, 17 ఫిబ్రవరి 2015 (UTC)

కె.వెంకటరమణ గారు, తప్పకుండా చూస్తానండి. JVRKPRASAD (చర్చ) 13:22, 17 ఫిబ్రవరి 2015 (UTC)
వ్యాసకర్త వ్రాసిన వ్యాసములోని కొన్ని వాక్యములు చదివాను. వ్యాసము వ్రాస్తున్న వారికే, వారు వ్రాస్తున్న వ్యాసము అసలు అణువు గురించా లేక పరమాణువు గురించినా అన్న ధర్మసందేహము కలిగి, ప్రస్తుతానికి వారు సశేషం చేసి ఉన్నారు. వారు వ్రాస్తున్న విషయము దేని గురించో తప్పక గుర్తిస్తారని ఆశించవచ్చును. సూక్షంగా చెప్పాలంటే, రెండు లేదా అంతకంటే ఎక్కువ పరమాణువుల కలయికతో ఏర్పడే, ఎటువంటి ఆవేశం లేని అతి సూక్ష్మకణము అణువు అని చెప్పుకోవచ్చని అనుకుంటాను. కొద్దికాలము ఆగి వ్యాసములో మార్పులు చేయవచ్చును. ఈలోగా వ్యాసకర్త గమనిస్తారని ఆశిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 13:52, 17 ఫిబ్రవరి 2015 (UTC)

దారిమార్పు[మార్చు]

చర్చ: పరమాణు సిద్ధాంతం చర్చ ప్రకారం ఈ వ్యాసాన్ని పరమాణువు అనే పేరుకు మారుస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 09:09, 15 సెప్టెంబరు 2020 (UTC)