Jump to content

చర్చ:ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వ్యాసం పేరు మార్పు గురించి

[మార్చు]

వ్యాసం పేరు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా కాకుండా ఆంధ్రప్రదేశ్ 13వ శాసనసభ సభ్యులు లేదా ఆంధ్రప్రదేశ్ 13వ శాసనసభ సభ్యుల జాబితా గా ఉండాలని ప్రతిపాదిస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు 13 శాసనసభలు ఏర్పడ్డాయి. రేపు ఎన్నికలు జరిగి మరో శాసనసభ ఏర్పడవచ్చు, అంతేకాకుండా ఇదివరకు ముగిసిన శాసనసభ సభ్యుల జాబితాలపై వ్యాసం సృష్టించవచ్చు. కాబట్టి ఈ వ్యాసంలోని జాబితా ఏ శాసనసభకు సంబంధించినదో వ్యాసం పేరులోనే స్పష్టంగా ఉండాల్సి ఉంటుంది, అంతేకాకుండా ఇతర (12వ, 11వ ఇలా) శాసససభ సభ్యుల జాబితాలపై వ్యాసాలు వ్రాయడానికి పేరు మార్చాల్సి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 16:02, 31 ఆగష్టు 2010 (UTC)

అవును పేరు మార్చి పాత వాటికి కూడా పేజీలు తయారు చేస్తే బాగుంటుంది.ఆంధ్రప్రదేశ్ 13వ శాసనసభ సభ్యుల జాబితా అంటే బాగుంటుందా లేక ఆంధ్రప్రదేశ్ 13వ శాసనసభ్యుల జాబితా అంటే బాగుంటుందా ?--శశికాంత్ 03:24, 1 సెప్టెంబర్ 2010 (UTC)
ఆంధ్రప్రదేశ్ 13వ శాసనసభ సభ్యుల జాబితా బాగుంది--అర్జున 04:47, 1 సెప్టెంబర్ 2010 (UTC)
పైన పేరుకొన్న అన్ని పేరులు సమంజసమే, కావున దారిమళ్ళింపు లింకు సృష్టిస్తే సరిపోతుంది. అ పేరు కాకుండా ఈ పేరు మాత్రమే వాడాలి, అని అంటే ఈ చేర్చకు అర్థము లేదు. చంద్ర కాంత్ చెప్పినట్లు ఎన్నికలు జరిగి మరో శాసనసభ ఏర్పడవచ్చు, కానీ అది రేపే జరగదు. ఇంక కొంత సమయం పట్టవచ్చు లేదా ఇదే చివరి శాసనసభ జాబితా కావచ్చు, అది ఎవరు చెప్పలేరు. ఎన్నికలు జరిగి కొత్త శాసనసభ ఏర్పడేవరకూ ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా ఇదే అవుతుంది, కావున ఈ వ్యాసం పేరు ౧౦౦(నూరు) శాతం(%) సమంజసమే. ఇప్పట్టివరకు ముగిసిన శాసనసభ సభ్యుల జాబితాలపై వ్యాసం సృష్టించడానికి ఈ వ్యాసం పేరు మార్చవలసిన అవసరం లేదు.--Ranjithsutari 10:26, 1 సెప్టెంబర్ 2010 (UTC)
ఇలాంటి వాటికి వికీపీడియాలో సాంకేతికంగా చిన్న చిట్కాలున్నాయి. ఉదాహరణకు మీరు మన మొదటి పేజీలో ఈ వారం వ్యాసానికి మూసలు ఎలా చేశారో పరిశీలిస్తే తెలుస్తుంది.--అర్జున 14:29, 1 సెప్టెంబర్ 2010 (UTC)

మెజారిటీ సభ్యుల అభిప్రాయాలను పాటించకపోవడం నియంతృత్వమే తప్ప ప్రజాస్వామ్యమనిపించుకోదు. విజ్ఞాన సర్వస్వంలో పనిచేయడం ఆషామాషీ కాదు. ఒక వ్యాసం వ్రాయాలంటే ఆ వ్యాసంపై పట్టు ఉండాలి. ఎక్కడినుంచో పట్టుకొనివచ్చి ఇక్కడ చేర్చి ఒక వ్యాసం తయారుచేశానోచ్ అనో, బాటుద్వారా మార్పులు చేసే అవకాశం ఉన్న సునాయాస దిద్దుబాట్లు చేసి నేను ఇన్ని మార్పులు చేశానోచ్ అనో అనుకోవడం మంచి పద్దతి కాదు. ఈ వ్యాసంలోని సమాచారమే గమనిస్తే పులివెందుల, టెక్కలి నుంచి విజయం సాధించిన శాసనసభ్యులు మరణించి ఏడాది గడిచింది. వేములవాడ నుంచి తెదేపా తరఫున గెలుపొందిన శాసనసభ్యులు 2010 ఉప ఎన్నికలలో తెరాస టికెట్టుపై విజయం సాధించారు (ప్రస్తుతానికి వ్యాసంలో పాత పేర్లు/ సమాచారం ఉన్నాయి). వ్యాసం చేర్చిన తరువాత సమయాభావం వలన మార్పులు చేయకపోవడం వేరు, వ్యాసం తయారుదశలోనే తప్పులు చేర్చడం వేరు. వ్యాసంపై పూర్తిపట్టు సాధించి వ్యాసాలు చేరిస్తేనే మన కృషికి సార్థకత లభిస్తుంది. వ్యాసంలో మార్పులు/చేర్పులు చేయాల్సిన అంశాలు ఇంకనూ చాలా ఉన్నాయి. సి. చంద్ర కాంత రావు - చర్చ 20:55, 1 సెప్టెంబర్ 2010 (UTC)

చంద్ర కాంత రావు గారు, Ranjithsutari గారు చేరి మూడునెలలైనా కాలేదు. కొత్తగా పనిచేసేటప్పుడు ఎక్కడైనా విభేదాలు సహజం. కాలక్రమేణా జట్టులో పనిచేయటం అలవాటవుతుంది. మొదటి సారి వ్యాసాలు అంత నాణ్యమైనవికూడా కాకపోవచ్చు. ఉదా: నేను రాసిన మొదటి వ్యాసములో నా స్వంతం అభిప్రాయాలే ఎక్కువ రాశాను. వాటిని తరువాత సరిచేశాను. వికీలో వ్యాసం రాయటానికి పండితులు అవసరం లేదుకదా. అందుకని తోటి వికీపీడియన్లకి అందులో కొత్తవారిని కించపరిచే వ్యాఖ్యలు చేయకుండా ప్రోత్సహించమని మనవి. సమిష్ఠిగా వ్యాసాలను మెరుగుపరచి తెలుగు వికీని నలుగురికి ఉపయోగపడేలా చేద్దాం--అర్జున 03:23, 2 సెప్టెంబర్ 2010 (UTC)
"నేను ఇన్ని మార్పులు చేశానోచ్ అని అనుకోవడం మంచి పద్దతి కాదు!!!" ఇది నాకు వర్తించదు, ఎందుకంటే వాడుకరి_పేజిలో నేను ఇన్ని మార్పులు చేశాను, నా దిద్దుబాట్ల సంఖ్య ఇంత-అంత అని చూపే గణాంకాలు లేవు. ఏది ఏమైన్నపటికి మీరు ఇచ్చిన సలహాలు, సూచనలు పాట్టించడానికి ప్రయత్నిస్తాను. వ్యాసంలో కొందఱు శాసనసబ్యుల పేర్లు మార్చే విషయం నేను గమనించాను, ప్రస్తుతం నియోజకవర్గాల పట్టిక సవరిస్తునాన్ను, తద్దుపరి శాసనసభ్యుల పట్టిక సవరించేట్టప్పుడు మిక్కిలినూతనమైన సమాచారము చేర్చుతాను.--Ranjithsutari 10:50, 2 సెప్టెంబర్ 2010 (UTC)
అర్జునరావు గారు, నేను అందరి మార్పులు చేర్పులను గమనిస్తుంటాను, ఎందరో కొత్త సభ్యులకు సలహాలు, సూచనలు ఇస్తుంటాను. తెవికీ అభివృద్ధికి వచ్చినవారు సూచనలు పాటించి ఎందరో తెవికీకి దోహదపడ్డారు, పడుతున్నారు. కాని ఈ సభ్యుడి వ్యవహారం మాత్రం నచ్చడం లేదు. నేను చెప్పేది నా స్వంత కార్యానికి అనుకుంటున్నాడో లేదా తెవికీలో విరోధాలు తేవాలని ప్రయర్నిస్తున్నాడో. ఇలాంటి ఒకరిద్దరు సభ్యులు ఇదివరకు తెవికీలో తారసపడ్డారు. తెలియక తప్పుచేయడం వేరు, తెలిసీ ఉద్దేశ్యపూర్వకంగా తప్పుచేయడం వేరు. ఈ సభ్యుడు మాత్రం రెండో కోవకే చెందుతాడు. మీరు చెప్పినట్లు కాలక్రమేణా పనిచేయడం అలవాటు అవుతుంది, నిజమే, ఆ అలవాటు తేవడానికే కదా మనం కొత్త సభ్యులకు సూచనలు ఇచ్చేది. ఇక వ్యాసాల నాణ్యత పెంచాలంటే పండితులు అవసరం లేదు కాని ఆ సభ్యుడే ఎంతచెప్పిననూ పట్టించుకోవడం లేదు అంతేకాని కించపరిచే ఉద్దేశ్యం మనకు లేదు. చిన్న దిద్దుబాట్లు మాని వ్యాసాల నాణ్యతపై దృష్టి సారిస్తే/ సారించాలని అనుకున్నప్పుడే పట్టు వస్తుంది. సమాజం లాంటి తెవికీలో ఒకరికొరకు మరొకరు తోడ్పడుతూ ముందుకు కదిలినప్పుడే గమ్యం చేరుకోగలము, ఈ భావన అందరికీ ఉండాలి. సి. చంద్ర కాంత రావు - చర్చ 19:41, 2 సెప్టెంబర్ 2010 (UTC)
చంద్రకాంతరావుగారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీ తెవికీ కృషి అభివందనలు. సభ్యులు ఒకే రకంగా వుండరు. మన సంభాషణ తెవికీ లో చిన్న చిన్న వ్యాఖ్యల ద్వారా జరుగుతుంది కాబట్టి, మనం చెప్పాలనుకున్నది, దానిని చదివిన వారికి అర్థమైనదాంట్లో తేడాలుంటాయి. ముఖ పరిచయాలకు అవకాశం ఉంటే, తేడాలు తక్కువగా వుండి, ఏకాభిప్రాయము సాధించటమో, లేక భిన్నాభిప్రాయాలను గౌరవంతో అర్థము చేసుకోవటం సులభం అవుతుంది. అందుకని అనుభవమున్న సభ్యులు కొంచెము ఓపిక బట్టితే మంచిది. మన తెవికీకి సంవత్సరానికొకసారి సభ్యులు కలిసి చర్చించే సభ (తెవికీమేనియా?) వచ్చే సంవత్సరములో జరగాలని కోరుకుంటున్నాను. వికీమీడియా భారత చాప్టర్ ప్రారంభమైన తరువాత దీని గురించి మరిన్ని వార్తలు, వివరాలు పంచుకుంటాను.--అర్జున 03:42, 3 సెప్టెంబర్ 2010 (UTC)
రంజిత్, నా గణాంకాలు చూసినందుకు సంతోషమే కాని అవి ఎలా వచ్చాయో కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ప్రారంభంలో నాకు తెలియనప్పుడు కొన్ని చిన్న దిద్దుబాట్లు చేశానేమో, సీనియర్ సభ్యుల సూచనలను వెంటనే పాటించాను. సభ్యుడిగా చేరిన మొదటి రెండు సంవత్సరాలు రోజూ ఐదారు గంటలు తెవికీకై వెచ్చించి నేను చేసిన కృషి సీనియర్ సభ్యులందరికీ తెలుసు. గత సంవత్సరం నుండి వృత్తికార్యక్రమాలలో తీరికలేకున్ననూ తెవికీ సెలవులో ఉన్ననూ నా దిద్దుబాట్ల కంటే నిర్వహణ కార్యక్రమాలకే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాను. ఇప్పటికీ రోజూ అరగంట, గంట సమయం తెవికీకి కేటాయించిననూ సభ్యుల మార్పులను చూడడం, అనవసర మార్పులు వెనక్కి చేయడం, కొత్త సభ్యుల అనవసర పేజీలను తొలిగించడం లాంటి నా చర్యలు తెలిసినవే. నా గణాంకాలు తెవికీ కృషిలో భాగంగా వాటంతట అవి వచ్చినవే కాని గణాంకాల పెంచుకోవడం కోసం నేను ఏనాడు ప్రయత్నించలేదు. రోజూ గంట సమయం వెచ్చించినా దిద్దుబాట్లు రెండంకెలకు కూడా చేరకపోవడం అందరూ చూస్తున్నారు, అలాంటప్పుడు పైమాట హాస్యాస్పదంగా అనిపిస్తోంది. ఏదైనా సరే పూర్తిగా తెలుసుకొనాలి. సి. చంద్ర కాంత రావు - చర్చ 19:52, 2 సెప్టెంబర్ 2010 (UTC)
చంద్ర కాంత్ గారు, పైన చేసిన వ్యాఖ్యలు మిమల్ని బాధపెట్టి వుంటే నన్ను క్షమించగలరు, తెవికీకి అభివృద్ధికి దోహదపడుతునందుకు మీకు ధన్యవాదాలు. ఎవరైనా నాపై వ్యాక్యాలు చేస్తే సమాధానం ఇస్తాను తప్ప ఇతర సభ్యులో తప్పులు వెతకడం నాకు ఇష్టంవుండదు. ఏదైనా సరే పూర్తిగా తెలుసుకొనాలి, లేదా తెలుసుకోకుంట ఎవరైనా తప్పు చేస్తే వారికీ పూర్తిగా తెలియచేయాలి, లేని పక్షాన తప్పు చేసిన వారితో చేర్చించిన ఉపయోగమువుండదు. నేను చేసిన మార్పులు-చేర్పులు పూర్తిగా గమనిస్తే బాగుండేది, delimitation తరువాతా కొన్ని నియోజకవర్గాల పేర్లలో మార్పులు చోటుచేసుకునవి, అలాంటి మార్పులు చేసేటప్పుడు తగిన సారాంశం కూడా పొందుపరిచాను. కానీ నేను చేసే మార్పులు-చేర్పులు కెవలం మీకు ఏకపక్షంగా అనిపిస్తే దానికి నన్ను బాద్యుడిని చేయడం సభభుకాదు.-Ranjithsutari 11:52, 3 సెప్టెంబర్ 2010 (UTC)
రంజిత్ గారు, ఆలస్యంగానైనా నా అభిప్రాయం అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు. డి-లిమిటేషన్ తరువాత పేర్లు మార్పుచేసినందుకు నేను అభ్యంతరమేమీ చెప్పలేదు, సరైన పేర్లు చేర్చినందుకు సంతోషమే, అసెంబ్లీ-->శాసనసభ మార్పుకై మాత్రమే (దీనిపై ఇదివరకు చర్చ జరిగింది) చెప్పాను. సలహాలు, సూచనలు పాటించడానికి ప్రయత్నిస్తామనడం కూడా మంచి పరిణామం. ఇక్కడ ఏదైనా సరే సభ్యులందరి సహకారంతో ముందుకు వెళితే అందరికీ మంచిది. మీ విలువైన సూచనలు ఏమైనా ఉంటే చర్చాపేజీలలో కాని రచ్చబండలో కాని తెలుపగలరు. సి. చంద్ర కాంత రావు - చర్చ 19:21, 3 సెప్టెంబర్ 2010 (UTC)
చంద్ర కాంత్ గారు, ఇదివరకు జరిగిన చర్చ వివరాలు నాకు తెలియదు , నా వాడుకరి చర్చ పేజిలో అర్జున అనే సబ్యుడుకి కూడా తెలియదు అని చాలా స్పష్టముగా చేపడము జరిగింది. మరోసారి అదే ప్రస్తావన వచినప్పుడు ఆ చర్చకు సంబంధిత లింకు పొందుపరిస్తే బాగుండేది. ఒకసారి చర్చలో ఏర్పడిన ఏకాభిప్రాయము, మరోసారి చర్చ జరిగితే అదే ఏకాభిప్రాయము కొనసాగుతుంది అని ముందుగానే తెల్చిచేపలేము. --Ranjithsutari 17:33, 4 సెప్టెంబర్ 2010 (UTC)
రంజిత్ గారు నేను చర్చను పొడగించదలుచుకోలేను, మీరు ఇదివరకు జరిగిన చర్చ లింకు అడిగారు కాబట్టి తెలుపుతున్నాను. నియోజకవర్గాల వ్యాసాలను రెండేళ్ళ క్రితం నేను మరియు నిసార్ అహ్మద్ గారు కలిసి సృష్టించాము. నేను ప్రారంభంలో రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా వ్యాసాలను సృష్టించేటప్పుడు అసెంబ్లీ పేరుతో సృష్టించాను. అదే సమయంలో నిసార్ గారు రాయలసీమ జిల్లాల నియోజకవర్గాల వ్యాసాలను శాసనసభ పేరుతో సృష్టించారు. దేవాగారు మూసలను తయారుచేసి అందులో శాసనసభ లింకులను పెట్టారు. ఆ తరువాత నేను కూడా ఆ లింకుల ఆధారంగా అదేపేరుతో సృష్టిస్తూ పోయాను. ఈ విషయంపై చర్చ జర్గిననూ ఎటూ తుది నిర్ణయం జరుగలేదు. ఆ తరువాత కొన్నాళ్ళకు నిసార్ గారు చాలా వ్యాసాలను అసెంబ్లీ నుంచి శాసనసభకు దారి మార్చినారు. చర్చలో సరైన నిర్ణయం జరుగకున్ననూ, చర్చాపేజీలలో వ్రాయకుండా పెద్ద సంఖ్యలో వ్యాసాలపేరు మార్పుచేసినారు. ఆ తరువాత చర్చను ఇక్కడ చూడండి. సి. చంద్ర కాంత రావు - చర్చ 18:49, 4 సెప్టెంబర్ 2010 (UTC)

శీర్షిక మార్పు గురించి

[మార్చు]

ఈ వ్యాసం పేరును ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009) అని గానీ ఆంధ్ర ప్రదేశ్ 13వ శాసనసభ సభ్యుల జాబితా అని గానీ ఉంచితే బాగుంటుంది. ఈ శీర్షికలో ఏ శాసన సభ లోని సభ్యులో తెలియజేయవలసిన అవసరం ఉన్నది. అదే బాటలో ఇతర సంవత్సరాల లోని జరిగిన ఎన్నికలలోని ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుల జాబితాలు తయారు కావచ్చు.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 10:25, 30 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]