చర్చ:ఆర్యవర్ధన్‌రాజ్
ఈయన గురించి అంతర్జాలంలో పెద్దగా సమాచారం లభించడం లేదు. నాకెందుకో ఈ వ్యాసం ఇతని గురించి అతిగా రాసినట్లనిపిస్తోంది.--రవిచంద్ర (చర్చ) 18:53, 20 అక్టోబరు 2016 (UTC)
పాక్షికతతో సమస్యలు: ఆర్యవర్ధన్ రాజ్ ఉదాహరణ
[మార్చు]వికీపీడియాలో వికీపీడియా:నిష్పాక్షిక దృక్కోణం అన్నది 5 మూల స్తంభాల్లోనూ, 3 కోర్ కంటెంట్ పాలసీల్లోనూ ఉన్నది, అలా చూస్తే అత్యంత కీలకమైనది. నిజానికి వికీపీడియాను ఇందరు పాఠకులు నమ్ముతున్నారంటే దానికి కారణం మన నిష్పాక్షికతే. తెలుగు వికీపీడియాలో ఇంతటి నిష్పాక్షికతకు చాలాసార్లు దెబ్బ తగలడం తీవ్రమైన సమస్యలు చోటుచేసుకోవడం జరుగుతూంది. దానికి ఒక ఉదాహరణగా: ఆర్యవర్ధన్‌రాజ్ అన్న వ్యాసం నిలుస్తోంది.
దాదాపుగా 82 వేల పైచిలుకు బైట్లున్న ఈ వ్యాసంలో మొదటి నుంచీ చివరి వరకూ ఆర్యవర్ధన్ రాజ్ అన్న వ్యక్తిని ప్రశంసిస్తూ పలు ఆలంకారికమైన భాషను గుప్పిస్తూ వచ్చింది. ప్రధానమైన అంశం ఏమిటంటే "పాతికేళ్ల వయస్సుకే 30కిపైగా డాక్టరేట్లు, 12కు పైగా గౌరవ డాక్టరేట్లను జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి అందుకొ"న్నాడన్నది. అయితే 2018 నవంబరులో ఇదే వ్యక్తి మీద పోలీసులు నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసుకుని యువతను మోసం చేసి లక్షలాది రూపాయలు సంపాదించాడన్న అభియోగంపై కేసులు నమోదుచేశారు. (సాక్షి వార్త, మన తెలంగాణ వార్త) పోలీసుల కథనం ప్రకారం ఆర్య వర్ధన్ రాజ్ గా చలామణి అవుతున్న నాగరాజు ఇంటరు చదువుకుని నగరానికి వచ్చి పేరు మార్చుకుని పలు నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసుకున్నాడు, ఇతరులకు కూడా విదేశీ విశ్వవిద్యాలయాల పేరిట పలు నకిలీ పీహెచ్ డి, డిగ్రీ సర్టిఫికెట్లు ముద్రించి ఇస్తున్నాడు. అభియోగం ప్రకారం అలా లక్షలాది రూపాయలు జనం నుంచి తీసుకున్నాడు.
పత్రికల్లో సానుకూలమైన, మరీ చెప్పాలంటే అద్భుతాలు చేస్తున్నట్టున్న కథనాలు ప్రచురింపజేసుకున్నది కూడా ఈ పథకంలో భాగమే కావచ్చునని నా వ్యక్తిగతాభిప్రాయం. మరి అలాంటి స్థితిలో ఇదేమీ తెలియనప్పుడు రాసిన ఈ వ్యాసం అలాంటి ఇమేజీకి దోహదం చేసివుండొచ్చునని భావించవచ్చు. నిజానికి కొందరు బయటివాళ్ళు ఈ వ్యాసాన్ని చూపి, అతని గురించి ఇటీవల వచ్చిన వార్తని పంపి ఇతన్ని "హీరో"గా చూపారని నా వద్ద మన వికీపీడియాను ఎద్దేవా చేశారన్నది ఇక్కడ ప్రస్తావనార్హమే అనుకుంటాను. పాఠకులు ఏమన్నా అనకున్నా మనకి ఈ వ్యాసం తీరు ఒక మచ్చలానే ఉంది.
ముందుగా మనకు తెలియదు కదా మరి ఏం చేయగలం అంటే:
- భారీ ఎత్తున ప్రశంసా వాక్యాలు, పొగడ్తలన్న మాటనే మించిపోయే వాక్యాలు పరిహరించి ఉండాలి.
- అసలు అతని బ్లాగుల్లో ఉన్న మూలాలు వాడి అతని వ్యాసాన్నే తయారుచేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.
- ఉన్న కాస్త మూలాలు ప్రధానంగా ఇతనేదో తాళపత్ర గ్రంథాలను డిజిటైజ్ చేశాడని ఉండగా మిగిలిన సమాచారం అంతా ఏ సరైన ఆధారం లేకుండా పొగడ్తలతో రాసుకుంటూ వెళ్ళడం సరికాదు.
- ఫోటోలు కూడా చాలా అసందర్భంగా ఉన్నాయి.
- ప్రముఖుల ప్రశంసలు విభాగంలో ముగ్గురు నోబెల్ బహుమతి గ్రహీతలు, ఇద్దరు దేశాధ్యక్షులు, పలువురు భారత రత్న గ్రహీతలు, మరెందరో మహనీయులు అంతంత గొప్పగా ప్రశంసించారన్న వాక్యాలకు కనీస మూలాలు లేకపోవడం వికీపీడియా నిర్ధారత్వానికి పెద్ద మచ్చ.
ఇలా అడుగడుగునా రకరకాల పాలసీలకు ఎదురు వెళ్తూ ఉన్న ఈ వ్యాసం మనకి పాలసీలకు కట్టుబడాల్సిన అవసరాన్ని, నిర్ధారత్వం ప్రాధాన్యతని తెలియజెప్తోంది. రవిచంద్ర గారు ఏనాడో 2016లోనే స్పందించారు. ఇతర సభ్యులు కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తారని భావిస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 12:17, 13 ఫిబ్రవరి 2019 (UTC)
ఆర్యవర్ధన్ రాజ్ వ్యాసం వికీపీడియాకు మాయని మచ్చ
[మార్చు]వ్యాసం చదివి నేను అర్థం చేసుకున్న విషయాలు మీ ముందుంచుతున్నాను.మొదటగా నేను చెప్పేది అంత్యుత్వాహం అనర్ధాలకు మూలం.వ్యాసం రాసేటప్పుడు ఇంత గొప్ప వ్యాసం నేను రాస్తున్నాను అనే అభిప్రాయం మన మనస్సులో ఏర్పడిందంటే, ఇంకొన్ని అసందర్బ విషయాలు,అభూత కల్పనలు, ఊహించి రాసే విషయాలు మనకు తెలియకుండానే వ్యాసంలో వచ్చి చేరతాయి.ఈ విషయాలు ఏ ఒక్కరికో సంబందించినవి కావు.అందరికీ వికీపీడియన్లుకు వర్తిస్తాయి.
వ్యాసం పరిశీలించండి. మొదటలో రాసిన 3 వాక్యాలు (5 లైన్లు) ఒకసారి చాలదన్నట్లుగా అదే వ్యాక్యాలు ‘జీవిత విశేషాలు’ విభాగంలో మరలా ఘంటాపధంగా చెప్పినట్లు రాయబడింది.ఇదొక్కటి ఉదాహరణ మాత్రమే.ఇలాంటివి వ్యాసంలో పలుమార్లు రాసి వ్యాసంలో దాదాపు 20 లింకులు అతని స్వంత బ్లాగు నుండి, ఇతర వెబ్సైట్లు నుండి ఇవ్వబడ్డవి. నేడు ఆ లింకులలో ఒక్క లింకు మాత్రమే కనపడుతుంది. మిగతా లింకులు ఏ ఒక్కటీ ఆదారంగా లేదు. అన్నీ ది సైట్ కెనాట్ బి రీచ్డు అని వస్తుంది.
2017 నవంబరు 26న ఇతనిని పలు నేరారోపణలు మీద అరెస్టు చేసి మన తెలంగాణ పేపరులో పోలీసు ప్రెసు మీట్ లో వార్తలు గుమ్మరించబడినవి. 2017 నవంబరు 27న సాక్షి పేపరులో ‘గిన్నిస్’కూ డూప్లికేట్ అనే వార్తా కథనం వచ్చింది.ఇవి వచ్చి కూడా సంవత్సరం పైగా అయ్యింది. ఈ నేరారోపణలు అన్నియు వికీపీడియా వ్యాసంలో అతనికి మద్దతుగా రాసిన విషయాలు మీదనే.వ్యాసానికి సంబంధంలేని విషయాల మీద కాదు.మనం ఎప్పడో స్పందించాల్సిన విషయం. ఏది ఏమైనా ఇలాంటి వ్యాసాలు వికీపీడియాకు మాయని మచ్చ, తీరని లోటు లాంటివి.
వ్యక్తులు గురించి రాసే వ్యాసాలకు తగిన ఆధారాలుతో వ్యాసం పూర్తిగా డ్రాప్టు రూపంలో పూర్తి చేసిన తదుపరి కనీసం ముగ్గురు వాడుకరుల స్క్రీనింగు టెష్ట్ తరువాత, ఆ విషయాలు చర్చా పేజీలో చర్చించిన తరువాతనే పభ్లిష్ చేసే సదుపాయం అవసరమా అనే అబిప్రాయం ఈ వ్యాసంవల్ల కలుగుతుంది. కొంత కాలం వ్యక్తుల వ్యాసాల మీద విరామం విధించి గతంలోని అన్ని వ్యక్తుల వ్యాసాలు ప్రాజెక్టు వర్కుగా చేపట్టి పున:సమీక్ష చేయవలసిన ఆవశ్యకత కూడా ఉందని నా అభిప్రాయం.చెప్పటం తేలికే గావచ్చు. లేదా ఏదైనా ఇతర మార్గాలు గురించి ఆలోచించగలరు.--యర్రా రామారావు (చర్చ) 16:32, 13 ఫిబ్రవరి 2019 (UTC)
- రామారావు గారూ, జీవించి ఉన్న వ్యక్తులకు సంబంధించిన వ్యాసాన్ని ఎవరైనా రాసినప్పుడు నిర్వాహకులం చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ ఉదాహరణ గుర్తుచేస్తోంది. అయితే వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు, నేరుగా రాయవచ్చు అన్న సూత్రానికి ఏ మార్పూ ఉండదని నా ఉద్దేశం. మనం చేయగలిగిందల్లా అటువంటి వ్యాసాలను త్వరగా పరిశీలించి, టాగులు చేసి తొలగించడమో శుద్ధి చేయడమో. దీర్ఘకాలికంగా సముదాయ సభ్యులకు పలు పాలసీల గురించి అవగాహన కల్పిస్తూ ఉండడం మరికొంత మేలు చేస్తుందని అనుకోలు. స్పందించినందుకు ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 17:25, 13 ఫిబ్రవరి 2019 (UTC)
నకిలీ అనే వార్త
[మార్చు]ఈ ఆర్యవర్ధన్ నకిలీ అనే వార్త ఇక్కడ ఉన్నది. ఈ వ్యాసాన్ని సమూలంగా మార్పులు చేయాల్సి ఉంది. విచిత్రం ఏమిటంటే ఇండియన్ ఎక్స్ ప్రెస్ లాంటి పత్రిక కూడా ఇతని మోసాలకు నమ్మి వ్యాసం ప్రచురించడం సిగ్గు చేటు. రవిచంద్ర (చర్చ) 01:41, 17 ఫిబ్రవరి 2019 (UTC)
- సాక్షి వార్త కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. రవిచంద్ర (చర్చ) 01:51, 17 ఫిబ్రవరి 2019 (UTC)
తొలగింపు ప్రతిపాదన
[మార్చు]ఈ వ్యాసాన్ని వెంటనే తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను. భిన్నాభిప్రాయం గల సభ్యులు వెంటనేతమ అభిప్రాయాలు తెలుపగలరు. రవిచంద్ర (చర్చ) 01:52, 17 ఫిబ్రవరి 2019 (UTC)
- రవిచంద్ర గారూ, తొలగించేద్దాం. --పవన్ సంతోష్ (చర్చ) 06:22, 18 ఫిబ్రవరి 2019 (UTC)
- మీరు చెప్పినదానికి ఒక్కరోజు ఆగి చూశాం. ఆ మాటకి వస్తే, సంవత్సరాలుగా ఇది తెవికీలో నాణ్యత దిగలాగుతూ ఉంది. కాబట్టి వేగంగా తొలగించాల్సిన వ్యాసంగా మీరు చేసిన టాగ్ చాలా సబబైనదని నమ్ముతూ తొలగించేశాను. --పవన్ సంతోష్ (చర్చ) 13:21, 18 ఫిబ్రవరి 2019 (UTC)
- మంచి పని చేశారు. ఈ వ్యాసాన్ని సృష్టించిన భాస్కరనాయుడు గారితో సహా మిగతా సభ్యులెవరూ కూడా స్పందించలేదు కావున సమస్య లేదనుకుంటున్నాను. రవిచంద్ర (చర్చ) 05:48, 19 ఫిబ్రవరి 2019 (UTC)
- మీరు చెప్పినదానికి ఒక్కరోజు ఆగి చూశాం. ఆ మాటకి వస్తే, సంవత్సరాలుగా ఇది తెవికీలో నాణ్యత దిగలాగుతూ ఉంది. కాబట్టి వేగంగా తొలగించాల్సిన వ్యాసంగా మీరు చేసిన టాగ్ చాలా సబబైనదని నమ్ముతూ తొలగించేశాను. --పవన్ సంతోష్ (చర్చ) 13:21, 18 ఫిబ్రవరి 2019 (UTC)