చర్చ:ఇస్లామోఫోబియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


తొలగించండి[మార్చు]

ఇటువంటి వివాదాస్పద వ్యాసాలను తొలగించడమ్ మంచిది - --Svrangarao 05:03, 5 డిసెంబర్ 2008 (UTC)

నేను కూడా తొలగింపుకు అనుకూలం రవిచంద్ర(చర్చ) 05:31, 5 డిసెంబర్ 2008 (UTC)
నేను తొలగింపునకు వ్యతిరేకం. ఆంగ్ల వికీపీడియాలో కూడ సుధీర్గ చర్చ జరుగుతున్నది, మీడియేషన్కు కూడ వెళ్ళినట్టున్నది. అసలు వ్యాసం కంటే చర్చ నిడివి 5-6 ఇంతలు పెరిగిపోయి, కొంత మంది సభ్యులు ఆగ్రహ ఆవేశాలాకు లోనయ్యి అనుచిత వ్యాఖ్యలు చెయ్యటం దురదృష్టకరం. చర్చ అనేక అనవసర విషయాలమీదకు కూడ వెళ్ళింది. సవ్యమయిన చర్చ చేసి, విజ్ఞాన సర్వస్వంలో వ్యాసాలు వ్రాయటానికి వికీ కానీ ఎవరి మతం మీద వారు గొప్పచెప్పుకోవటానికి, ఇతర మతాలమీద అక్కసు వెళ్ళగక్కటానికి కాదు. వ్యాసం వ్రాశేటప్పుడు నిజాన్ని వ్రాయాలి. ఆ విషయం నిజమయినప్పుడు భరించే శక్తి సభ్యులు చూపించాలి. ఇప్పుడు వ్యాస భాగంలో వివాదాస్పదంగా నాకైతే ఏమీ అనిపించటంలేదు.--SIVA 12:32, 22 డిసెంబర్ 2008 (UTC)
వీరి వాదన మరీ చాదస్తంగా ఉంది. పూర్వం గ్రహణాల గురించి చిజం చెపితే జాతకాల్ని నమ్మేవారు ఎలా భయపడే వారో ఇప్పుడు ఉగ్రవాదాన్ని విమర్శిస్తే మత భక్తులు అలా భయపడుతున్నారు. సంతకం చేయకుండా చేసిన ఈ వ్యాఖ్యానాన్ని చేసిన వారు: 219.64.75.231 (talk) 06:13, డిసెంబర్ 28, 2008
ఈ వ్యాసాన్ని అనువదించేటప్పుడే అనువాదం సరిగ్గా చెయ్యలేదు. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు కాలంలో కూడా ముస్లింల పట్ల భయం ఎక్కువ ఉండేది. ఇస్లామోఫోబియా యొక్క చరిత్ర ఇక్కడ చేర్చలేదు. సంతకం చేయకుండా చేసిన ఈ వ్యాఖ్యానాన్ని చేసిన వారు: 59.88.112.28 (talk) 07:29, డిసెంబర్ 28, 2008
క్రైస్తవ సామ్రాజ్యవాదులు, ముస్లిమ్ ఉగ్రవాదులు మొత్తం ప్రప్రంచాన్నే భయపెడుతున్నారు. ఈ విషయాల గురించి తెలుసుకుంటే తప్పేమిటి? సంతకం చేయకుండా చేసిన ఈ వ్యాఖ్యానాన్ని చేసిన వారు: 219.64.185.14 (talk) 15:37, డిసెంబర్ 27, 2008
సంతకం పెట్టటానికి కూడ భయపడే వాళ్ళు ఇతరులలో వాళ్ళు ఊహించుకున్న భయం గురించి వ్యాఖ్యలు చెయ్యటం!!! అజ్ఞాత వ్యక్తీ, ఒక్క విషయం తెలుసుకో. వికీపీడియా బ్లాగు కాదు, ఎదో ఒక ప్రేలాపన చేసి వెళ్ళిపోవటానికి. అనవసరంగా లేని అర్ధాలను అన్వయించకుండా, నేను వ్రాసిన విషయం చదివి, అర్థం చేసుకుంటే బాగుంటుంది.--S I V A 16:58, 29 డిసెంబర్ 2008 (UTC)

ఈ వ్యాసంలో ఇస్లాం అనుకూల వాక్యాలు ఎక్కువ చేర్చారు[మార్చు]

ఈ వ్యాసంలో ఇస్లాం అనుకూల వాక్యాలు ఎక్కువ చేర్చడం జరిగింది. వాటిలో కొన్ని వాక్యాలు నేను ఎడిట్ చేశాను. సంతకం చేయకుండా చేసిన ఈ వ్యాఖ్యానాన్ని చేసిన వారు: 59.88.112.28 (talk) 07:05, డిసెంబర్ 28, 2008

ఇది ఇస్లాం వ్యతిరేక వ్యాసం కాదు[మార్చు]

ఇస్లామోఫోబియా వ్యాసం ఇస్లాంని కించపరచడానికి కాదు. అది ఇస్లాంని వ్యతిరేకించే హిందువులు మరియు క్రైస్తవులని విమర్శించడానికి రచించినది. అందుకే వైజాసత్య మరియు Kumarrao మొదట దీన్ని ఎడిట్ చేసి తమకి అనుకూలమైన మార్పులు చెయ్యడానికి ప్రయత్నించారు. సంతకం చేయకుండా చేసిన ఈ వ్యాఖ్యానాన్ని చేసిన వారు: Gummanagaraju (చర్చమార్పులు) 17:39, డిసెంబర్ 5, 2008

ఏ మతాన్ని విమర్శించినా తప్పు కాదు. నేను నా సొంత మతమైన హిందూ మతాన్నే వదిలి పెట్టాను. అరేబియా నుంచి ఓడలు, ఒంటెల మీద మన దేశానికి వచ్చి స్థిర పడిన పరదేశీయుల మతాన్ని విమర్శించడం ఎలాగూ లెక్కలోకి రాదు. సంతకం చేయకుండా చేసిన ఈ వ్యాఖ్యానాన్ని చేసిన వారు: 219.64.185.14 (talk) 15:42, డిసెంబర్ 27, 2008
నాస్తికులైనా మత భక్తులైనా తమ అభిప్రాయాలు చెప్పడం తప్పుకాదు. ఈ వ్యాసాన్ని తొలిగించడం ఉచితం కాదు. రోగానికి మందు వేస్తే రోగం పెరుగుతుందని భయపడినట్టు ఉంటుంది. సంతకం చేయకుండా చేసిన ఈ వ్యాఖ్యానాన్ని చేసిన వారు: Mrityunjaya (చర్చమార్పులు) 06:44, డిసెంబర్ 28, 2008

తాకీదు[మార్చు]

హిందూ మతం మరియు ఇస్లాం మతాలు "మహోన్నతమైన మీనార్లు", అవి ఎండుటాకులు కావు, కొందరు నికృష్టులు ఊదితే అవి పడిపోవడానికి. వీటికి మీలాంటి (ఇద్దరు సభ్యులూను) వారి సహారా ఈ మతాలకు మరియు వారిని అవలంబించేవారికి అక్కరలేదు. మీ సొంత బాకాలు ఊదుకోవాలంటే, మీరు సొంత వెబ్‌సైట్లు, సొంత బ్లాగులు తెరుచుకోండి, వాటిలో మీ ఆలోచనలను పొందు పరచుకోండి. తెవికీ ఇలాంటి బాకాలకు వేదిక కాదు. ఇది విజ్ఞాన సర్వస్వం. ఇందులో వైజ్ఞానిక విషయాలు వ్రాయండి. మా సొంత ఆలోచనలు మా బాకాలు మేము ఊదుకోలేమా? మేము విమర్శలు చేయలేమా, లోకజ్ఞానం మాకు లేదా?, ఏమిటి మీకు తెలిసిన నిజాలు, నిజాలు ప్రూవ్ చేయడమేమిటి? మీ వాగ్ధాటిలో అంత సత్తువ ఉంటే, ఏదైనా ఒక బ్లాగులో కలుసుకుందాం రండి, అక్కడ వాదులాడుకుందాం! అపుడు తెలుస్తుంది ఎవరి వాదనలలో ఎంత సత్తువ ఉందో ఎంత నిజాయతి ఉందో ఎంత సత్యముందో, ఒళ్ళంతా విషం నింపుకుని, అవతలి వాళ్ళకు వైద్యం చేయడానికి వచ్చారా? మీకు "అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ" అనే శ్లోకానికి అర్థం తెలుసా? దీని అర్థం తెలుసుకుంటే మీ (మా) జన్మలు ధన్యం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీకు నిజంగానే హిందూమతం, ఇస్లాం మతం పట్ల అపార ప్రేమలుంటే, లక్షలకొద్దీ కన్‌స్ట్రక్టివ్ వ్యాసాలు వ్రాయవచ్చు. అలా చేయండి, అవి అందరికీ మంచి ఫలాలనిచ్చే వృక్షాలవుతాయి, వీటి వలన లభించే పుణ్యంతో మీకు మోక్షమూ కలుగవచ్చు. మీకు సన్మతి ఇవ్వాలని మనసారా ఆ పరమేశ్వరుణ్ణి (అల్లాహ్) ను కోరుకుంటున్నాను. నిసార్ అహ్మద్ 13:16, 5 డిసెంబర్ 2008 (UTC)

హిందువుల గ్రంథమైన మను స్మృతిలో స్త్రీలు, శూద్రుల గురించి ఎంత నీచంగా వ్రాసి ఉందో 600 పేజిల ఒరిజినల్ తెలుగు అనువాదం చదివితే తెలుస్తుంది. ఈ రోజే శ్రీకాకుళం జామియా మస్జిద్ దగ్గర హైదరాబాద్ వారు ప్రచురించిన ఖురాన్ తెలుగు అనువాదం కొని చదివాను. ఇంతకు ముందు నేను చదివిన ఖురాన్ పాఠాలన్నీ ఆంగ్లంలోనివే. ఖురాన్లో స్త్రీల గురించి ఏమి వ్రాసి ఉందో కూడా నాకు తెలుసు. కానీ నేను అవన్నీ ఇక్కడ వ్రాయలేదు. ఎందుకంటే ముందు మతం పేరుతో సాగుతున్న ఉగ్రవాదాన్ని, వాషింగ్టన్ ప్రేరేపిత యుద్ధాలని విమర్శించడం ముఖ్యం కాబట్టి. సంతకం చేయకుండా ఈ వ్యాఖ్యానాన్ని రాసిన వారు: Gummanagaraju (చర్చమార్పులు) 19:07, డిసెంబర్ 5, 2008

అదేదో సినిమాలో విలన్ మాటిమాటికీ అంటుంటాడు "చరిత్రడక్కు, చెప్పింది విను" అని. సెక్యూలరిజం పేరుతో వోట్లు దందుకునే మన రాజకీయ నాయకులు కూడా ఆ విలన్ లాంటి వాళ్ళే. అందుకే. డా. జయగోపాల్ గారు అన్నారు "బైబిల్ లో ఏముందో బయట పెడితే ఈ దేశం క్రైస్తవుల వోట్లు పడవు" అని. మనుసృతిలో ఏముందో చాలా మంది హిందువులకి తెలియదు, ఖురాన్ లో ఏముందో చాలా మంది ముస్లింలకి తెలియదు. అవి తెలియకుండానే మతం పేరుతో ఒకరినొకరు చంపుకుంటారు. సంతకం చేయకుండా ఈ వ్యాఖ్యానాన్ని రాసిన వారు: Kumarsarma (చర్చమార్పులు) 11:17, డిసెంబర్ 8, 2008

వీరిని బ్లాక్ చేయండి[మార్చు]

ఈ వ్యాసాలు తొలగించడమేగాదు, ఈ సభ్యులనూ 'బ్లాక్' చేయండి, వీరేదన్నా హోటల్లో కూర్చొని మాట్లాడుకోమని చెప్పండి. వీరి సోది వినడానికి ఇక్కడ "డైనింగ్ హాల్" లేదు. ప్రపంచాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్న తీవ్రవాదులకూ ఉగ్రవాదులకూ వీరికీ తేడా ఏమిటో చెప్పండి. భారత్ లోని ప్రజలకు మనోభావాలకూ గాయాలయ్యాయి, వాటినుండి కోలుకోవడానికి మందు పూయాలిగాని, ఇలా ఇంకా గాయం చేయడం భావ్యమా? వీరు మారరు, వీరిని మార్చడం తరం గాదు. తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే "ఎలిమెంట్స్" వీరు. వీరిని పూర్తిగా 'బ్లాక్' మరియు 'బ్యాన్' చేయాలని, ఆదర్శప్రాయులైన తెవికీ నిర్వాహకులకు వినమ్రంగా మనవి చేస్తున్నాను. నిసార్ అహ్మద్ 05:46, 5 డిసెంబర్ 2008 (UTC)

వీరి సంభాషణ[మార్చు]

ఇక్కడ సభ్యులు:Kumarrao వ్రాసిన వాక్యాలు తొలిగించాను.

"ఇస్లాము మతము మానవజాతిని, ప్రపంచ శాంతినీ ఎంత అతలాకుతలము చేసిందో గత వేయి సంవత్సరాల చరిత్ర, నడుస్తున్న చరిత్ర ప్రబల తార్కాణము. ఆన్ని మతములూ శాంతిని ప్రభోధిస్తాయి. కాని ఒక్క ఇస్లాము మతము మాత్రమే హింసను, అసహనాన్ని, ద్వేషాన్ని ప్రీరేపిస్తుంది. అంతేకాక యుద్ధమునూ, హింసనూ పవిత్ర కార్యముగా పరిగణిస్తుంది."

బైబిల్ లో మోషే విగ్రహారాధకులని చిత్రహింసలు పెట్టి చంపిన కథలు చదవలేదా? కేవలం ఇస్లాంని విమర్శించడం తప్పు.

చర్చ[మార్చు]

59.90.160.86 గారు, మీరు వికీలో సభ్యులై చర్చ సాగించండి. భిన్న అభిప్రాయాలను గౌరవించడము నేర్చుకోండి. నేను వ్రాసిన వాక్యములు తొలగించి అసంబద్ధమైన విషయాలు ఉటంకించారు చర్చలో. నేను వ్రాసిన విషయములకు ఆధారములు కొరాన్ లోనే ఉన్నాయి.Kumarrao 04:26, 5 డిసెంబర్ 2008 (UTC)

ఖురాన్ లో హింస లేదని నేను చెప్పలేదే. ఆది శంకరాచార్యుని కాలంలో హిందువులు నాస్తికుల్ని, బౌద్ధుల్నీ, జైనుల్నీ ఎలా చిత్ర హింసలు పెట్టి చంపారో కూడా నేను చదివాను. ఉగాండాలో ఈదీ అమీన్ హిందువుల నరమాంసం ఎలా తిన్నాడో కూడా నాకు తెలుసు. ఈ వ్యాసం ఇస్లాం మతాన్ని విమర్శించడానికి వ్రాయలేదు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే ఒక వర్గం ముస్లింల గురించి చెప్పడానికి వ్రాసాను.

  • ఒక మతం వాళ్ళకు ఇంకో మతం ఫోబియా.మతంకంటే మానవత్వం గొప్పది.మనమంతా మంచి నేర్చిన మనుషులం.పూర్వం ఎవరో పెంటతిన్నదృశ్యాలు ఇప్పటికీ గుర్తుచేసేకంటే మనప్రజలు శాంతిసామరస్యాలకోసం ఇప్పుడు ఏం చెయ్యాలో చెబితే బాగుంటుంది.అన్ని మతాలవాళ్ళూ వారి వారి మతాల కోసం అకృత్యాలకు పాల్పడ్డవారే. కానీ ఒక మతం కొమ్ముకాసే వారికి సొంతమతం పేరుతో జరిగే అరాచకాలు పుణ్యకార్యాలుగా కనబడతాయి.నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమే.పుట్టిన బిడ్డలు ఫలానా మతంలో పుట్టాలని కోరుకుని పుట్టరు.ఏది ఏమిటో తెలుసుకున్నాక నేను ఆస్తిక హేతువాది ని మానవవాది ని అయ్యాను.నామకార్ధంగా ముస్లిముల పేర్లుపెట్టుకుని శాంతియుత జీవనం గడుపుతున్ననాలాంటి భరతమాత ముద్దుబిడ్డలు ఈ దేశంలో కోట్లాదిమంది ఉన్నారు.మానినపుండు మళ్ళీ సెలపోసేలా చేసే మతవాద రచయితలు కూడా ఉగ్రవాదంలో భాగస్తులే.ఒకవేళ అంతగా అకృత్యాలు చేసే ఇస్లామ్ మతాన్ని వద్దనుకొని ఈనాటి ముస్లిములు బయటకు రాదలుచుకున్నా హిందూ మతంలో మాత్రం చేరే చట్టపరమైన అవకాశం లేదే?అందరికీ సగౌరవంగా బ్రతికే దారికావాలి.కౌరవ సంతతినైనాసరే నిందించి నలిపి చంపటం కంటే మానవత్వంతో కలుపుకు పోవటమే మంచిది.ఎప్పుడో ఎవరో చేసిన అకృత్యాలను మళ్ళీ మళ్ళీ కొన్ని తరాలపాటు గుర్తుచేసి ఆ మతంలో ఉన్నఈనాటి వారసుల్ని నిందలువేసి అవమానిస్తే అది హిందూ మతం ప్రకారం మోక్షసిద్ధినిస్తుందా?హింసకు జవాబు హింసేనా? అహింసకాదా?ఎవరు తప్పుచేస్తే వారినే శిక్షించాలి.ఆంగ్ల వికీనుండి గ్రహించినా అశుద్ధం అశుద్ధమే.దాన్నే ఇష్టంగా ఎత్తుకొచ్చి అందరికీ చూపించటం అనర్ధదాయకం.వికీలో ఇలాంటి వ్యాసాలు ఎందుకు?ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ వ్యాసం?వెంటనే తొలగించండి.--Nrahamthulla 14:50, 7 డిసెంబర్ 2008 (UTC)

మతానికి హేతువాదానికి మధ్య ఏమాత్రం పొంతన ఉండదు. Facebookలో పరిచయమైన నా పాకిస్తానీ మిత్రుడు మొబీన్ చుగ్టాయ్ "Islam and Secularism: A Fundamental Divide) అనే పేరుతో ఒక వ్యాసం వ్రాసాడు. అది ఒక ప్రముఖ పాకిస్తానీ దిన పత్రికలో కూడా ప్రచురితమయ్యింది. నేను ఈ మధ్య ఖురాన్ తెలుగు అనువాదం చదివాను. అందులో ఏకైక దేవున్ని నమ్మే ముస్లింలు, యూదులు, నస్రానీలు (Nazoraeans) మాత్రమే స్వర్గ ప్రాప్తికి అర్హులని, మిగిలిన వారు నరకానికి పోతారని వ్రాసి ఉంది. ఖురాన్ లో చేర్చడానికి నిరాకరించిన ప్రవచనాలని బయట పెట్టినందుకు సల్మాన్ రష్దీ తల నరికేయాలని ఫత్వా ఎందుకు జారీ చేశారు? Koran advocates tolerance only on Jews and Nazoraeans in non-muslim communities. They do not tolerate atheists and pagans.

  • ఇస్లాం దృష్టిలో ఉగ్రవాదం హరామ్ (నిషిద్ధం). ఇస్లామ్ లో ఈ హరామ్ పనికి చోటులేదని, ఇస్లాం మానవత్వానికి కట్టుబడి ఉందని జమీయతుల్ ఉలమాయె హింద్ ఫత్వా జారీచేసింది.
  • ఉగ్రవాదుల మృతదేహాలను ముక్కలు, ముక్కలుగా కోసి సముద్రంలో పారేయాలని ముస్లిం పెద్దలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ప్రజల రక్తాన్ని మలినం చేసిన వారికిదే సమాధానమని వారు పిలుపునిచ్చారు.ఇస్లాంలో హింసకు, ఉగ్రవాదానికి తావు లేదని ఉగ్రవాదుల మృత దేహాలను పూడ్చిపెట్టడానికి స్థలాన్ని నిరాకరించాలని ,ఉగ్రవాదులు నిజమైన ముస్లింలు కాదని, పంజాబ్‌లోని పాటియాలా జిల్లా సమనాలో జరిగిన కాన్ఫరెన్స్‌లో ముస్లిం మత పెద్దలు, ఇతర ముస్లిం ప్రముఖులు ,హర్యానా గవర్నర్ ఎకే కిద్వాయ్ అన్నారు.ఆంధ్రజ్యోతి 4.12.2008.
  • ముస్లిం మతపెద్దలు ఇలాంటి ఫత్వాలు ప్రకటించటం నిజంగా పెద్దమార్పేనని గ్రహించండి.హింసను సమర్దించే లేఖనాలను పిడివాదులు ఎల్లకాలం బోధించలేరు.అలాంటి లేఖనాలు ఖురాన్ లో ఉంటే వదిలెయ్యాల్సిందే.బైబిల్,భగవద్గీతలో కూడా హింసకు పురికొల్పే లేఖనాలున్నాయి.కానీ ఆయా మతస్తులు అలాంటి లేఖనాలను పెడచెవినపెట్టి శాంతిమార్గాన్ని ఎలా అవలంబించారో ఖురాన్ లేఖనాలను కూడా అలాగే కోట్లాది ముస్లిములు పట్టించుకోరు.చంపండి ,యుద్ధం చెయ్యండి అని లేఖనాల్లో ఉన్నా మనం ఆ పనులు చెయ్యలేము.హింసలు మారణహోమాలు జరిగీ జరిగీ గుణపాఠంగా రానురాను ఇంకా మతాలలో మానవత్వం పెరిగి తీరుతుంది.--Nrahamthulla 14:28, 8 డిసెంబర్ 2008 (UTC)

హిందువులలో ఎక్కువ మందికి వేదాలలో ఏముందో తెలియదు కానీ వేదాలు గొప్పవని నమ్ముతారు. ముస్లింలలో కూడా ఎక్కువ మందికి ఖురాన్ మరియు హదిస్ లలో ఏముందో తెలియదు కానీ వీరు ఖురాన్ మరియు హదిస్ గొప్పవని నమ్ముతారు. అందుకే ఖురాన్ మరియు హదిస్ లని విమర్శించిన సల్మాన్ రష్దీ మరియు తస్లీమా నస్రీన్ల పైన అంత ద్వేషం వారికి. అసంగత విషయాలు, ఒక దానికొకటి పొంతన లేని విషయాలు ఉన్న మత గ్రంథాలు మనిషికి నీతిని నేర్పలేవు. అవి వేదాలైనా, రామాయణం అయినా, ఖురాన్ అయినా, హదిస్ అయినా. రంగనాయకమ్మ గారు వ్రాసిన "రామాయణ విషవృక్షం" పుస్తకం చదవండి. ఒకప్పుడు కేవలం వినోదం కోసం వ్రాసిన కథల్ని సేకరించి వాటిని మత గ్రంథాలలో చేర్చేవారు. కేననికల్ బైబిల్ నుంచి తొలిగించిన కొన్ని కథలు ఖురాన్ లో కనిపిస్తాయి. ఇది తెలిసిన వారు బైబిల్ ని నమ్మాలా ఖురాన్ ని నమ్మాలా? మీరు వ్యక్తి గతంగా ఈ కథల్ని నమ్మొచ్చు కానీ ఇవే అక్షర సత్యాలని ప్రచారం చెయ్యొద్దు. 121.245.44.202

తొలగింపు నిర్ణయం[మార్చు]

ఈ వ్యాసంలో "తొలగించు" మూస చాలా కాలంనుండి ఉన్నది. సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లుగా కనిపించడం లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి గనుక వోటింగ్ అవుసరం అని భావిస్తున్నాను. సభ్యులు గమనించవలసిన విషయం ఏమంటే ఈ వ్యాసం నచ్చకపోవడం అనేది తొలగించడానికి కారణం కారాదు. అది సభ్యుల వ్యక్తిగత అభిప్రాయం కావచ్చును. వికీ విధానాలకు వ్యతిరేకం అయితే మాత్రం వ్యాసాన్ని తొలగించాలి. దయచేసి మీ అభిప్రాయాలను, అందుకు కారణాలను క్రింద వ్రాయండి. సంతకం చేయడం మరచిపోవద్దు. --కాసుబాబు 11:11, 21 మే 2009 (UTC)Reply[ప్రత్యుత్తరం]


తొలగింపునకు అనుకూలం, కారణాలు

చర్చలో శివగారు చెప్పినట్లు, తెవికీ మతవిషయాలను ప్రచారంచేసే వేదికా గాదు, ఇతరమతాలపై కొందరికి గల అక్కసును వెళ్ళగక్కడానికి ప్లాట్‌ఫామ్ గాదు. ఒక విషయాన్ని భూతంగా మలచి ప్రజలలో భయాందోళనలు కలుగజేయుట విజ్ఞాన పుస్తకమైన తెవికీ తన పుటలలో అంగీకరించదు. ఫోబియా అనేపదము పాశ్చాత్యులది, వారు ఇలాంటి సూడో-క్రిటేయిటివిటీలో దిట్టలు. అందుకే లెఫ్టిస్టులు అమెరికన్లకు బద్ధ వ్యతిరేకులు. పాశ్చాత్యులు తయారు చేసిన భూతాలలో ఇస్లామోఫోబియా ఒక భూతం. వారి ప్రయోజనాలను ముప్పుకలుగజేసే ప్రతి విషయాన్నీ ఒక భూతంగా తయారుచేసి ప్రపంచం ముందుకు పెడతారు. మనమూ వారి కళ్ళద్దాల ద్వారా చూడాలనే అంక్షయేమీ లేదు. ఇలా వ్రాస్తూపోతే నెగటివ్ డిఫ్యూజన్ ఆఫ్ థాట్స్ తో, కోకొల్లలుగా భూతాలు తయారవుతాయి. వాటిని చూసి జడిసిపోయే జెనరేషన్ ను తయారుచేసే ఉద్దేశ్యంలో మనంలేము. ఇలాంటి నెగటివ్ బయాస్ కలిగిన విషయాలను "Nipped at the bud", మొగ్గలోనే తుంచేయాలి. ఓ విశాలమైన ఉన్నతమైన విజ్ఞానపూరితమైన ఆలోచనల ఆకాశాన్ని సృష్టించగలగాలి. అది తెవికీ అయితే ఇంకా సంతోషం. Where the mind is without fear and the head is held high; Where knowledge is free; ...............Into that heaven of freedom, my Father, let my country awake. అహ్మద్ నిసార్ 18:34, 21 మే 2009 (UTC)Reply[ప్రత్యుత్తరం]

  • నేను 7 ,8 డిసెంబర్ 2008 న తెలియజేసిన పై కారణాలను బట్టి ఈ వ్యాసాన్ని తొలగించాలి అని కోరుతున్నాను--Nrahamthulla 02:52, 22 మే 2009 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఒక్కమాటలో నేను తొలగించడానికి అంగీకారం తెలుపుతున్నాను. కానీ ఇక్కడ కొంత వివరణ అవసరమనుకుంటున్నాను. చర్చా పేజీల్లో ఒక విషయం యొక్క గుణగణాలను, మంచి చెడ్డలను బేరీజు వెయ్యటం అనవసరం. ఇది వికీ మార్గదర్శకం కూడాను. చర్చా పేజీల్లో వ్యాసాన్ని చర్చించాలి గానీ వ్యాసం యొక్క విషయాన్ని గురించి కాదు. ఉదాహరణకు భగత్ సింగ్ వ్యాసంలో ఆ వ్యాసం సమగ్రంగా ఉందా లేదా అన్నదే మన లక్ష్యం కానీ భగత్ సింగ్ మంచివాడా చెడ్డవాడా అని మళ్ళాగుళ్ళాలు పడటం కాదు. నిసార్ గారూ, నెగటివ్ బయాస్ కు పాజిటివ్ బయాస్ కు పెద్దతేడా లేదు. ఇస్లామోఫోబియా చెడ్డది, ప్రోత్సహించకూడదు అన్నంత మాత్రానా వ్యాసం ఉండకూడదు అనుకోవటంలో హేతువు లేదు. యుద్ధాలు, మారణకాండలు, కులవ్యవస్థ, సతి వంటి సాంఘీక దురాచారాలన్నీ చెడ్డవే అయితే వాటిపై వికీలో వ్యాసాలున్నంతమాత్రాన వికీ వాటిని ప్రోత్సహిస్తున్నట్టు కాదు. ఈ వ్యాసాన్ని ఓపికుంటే సమగ్రంగా తీర్చిదిద్దవచ్చు. కానీ ప్రస్తుతం ఆధారం లేని అభిప్రాయాలు, అసంబద్ధ సాధారీకరణలు మాత్రమే ఉన్నందున మరియు ప్రస్తుత తెలుగు వికీ స్థాయిలో ఈ విషయానికి అంత విషయ ప్రాధాన్యత లేని కారణంగా దీన్ని తొలగించాలి. --వైజాసత్య 03:30, 22 మే 2009 (UTC)Reply[ప్రత్యుత్తరం]


తొలగింపునకు వ్యతిరేకం కారణాలు
  • మతపరమైన హింసాత్మక వ్యాసాలు కూడా ఉండాలి. కానీ అవి నిజానిజాల్ని సరైన మూలాలతో తెలియజేసేవిగా ఉండాలి. ఇవి కొందరికి బాధకలిగించినా చరిత్రను యధాతథంగా ఉంచడానికి మనం అందరూ ప్రయత్నించాలి. వ్యక్తిగత అభిప్రాయాలుగా ఉండకూడదని నా అభిప్రాయం.Rajasekhar1961 04:09, 22 మే 2009 (UTC)Reply[ప్రత్యుత్తరం]


ప్రస్తుత పరిస్థితి

పైన సభ్యులు చెప్పిన అబిప్రాయాలను క్రింది విధంగా సమీక్షించవచ్చును (కాసుబాబు సమీక్ష)

  1. ఇందులొ ఉన్న విషయం సుహ్రుద్భావాన్ని దెబ్బ తీసేది. ప్రయోజనం లేనిది. నెగిటివ్ బయాస్‌తో కూడుకొన్నది. కనుక తొలగించాలి.
  2. సూత్ర ప్రాయంగా వ్యాసాన్ని ఉంచవచ్చును కాని ప్రస్తుతం ఇది నిరాధార విషయాలతో ఉన్న వట్టి చెత్త. కనుక తొలగించవచ్చును.
  3. కొందరికి బాధ కలిగించినా చారిత్రిక సత్యాలను కప్పిపెట్టలేము. ఇది వ్యక్తిగత భావాలను అమలు పరచే వేదిక కాదు. కనుక వ్యాసాన్ని ఉంచవచ్చును.


నా అభిప్రాయం (కాసుబాబు)

ఈ వ్యాసం కంటే ఈ చర్చా పేజీ ఎక్కువ ఉపయోగకరం అని నాకు అనిపిస్తున్నది. షుమారుగా 8 లైన్లున్న వ్యాసానికి 200 పైగా లైన్ల చర్చ జరిగింది. ప్రస్తుతానికి తొలగించామనుకోండి. మళ్ళీ ఒకరు ఒక సంవత్సరం తరువాత ఇదే వ్యాసం ప్రారంభిస్తే అందుకు అడ్డు చెప్పే నియమాలు ఏవీ లేవు. వికి మౌలిక సూత్రాల ప్రకారం (1) ఇలాంటి వ్యాసం వ్రాయడానికి నిషేధం లేదు (2) సరైన ఆధారాలు లేని విషయాలు (లెదా పూర్తి వ్యాసం) తొలగించవచ్చును.


ఇప్పటికి ఉన్న విషయం ప్రకారం, "ఆధారాలు చూపనందున" ఈ వ్యాసాన్ని తొలగించవచ్చును. అయితే మరొక ప్రయత్నంగా వ్యాసాన్ని తిరగ వ్రాయాలని యత్నించాను. వివాదాస్పదమైన క్రొత్త వ్యాసాలు మొదలుపెట్టేవారికి ఇది సూచనగా ఉంటుందని కూడా ఆశిస్తున్నాను. మరొకసారి సభ్యులు వ్యాసాన్ని పరిశీలించి తమ అభిప్రాయాలు చెప్పమని కోరుతున్నాను. సబ్యుల స్పందనను బట్టి "తొలగించు" మూస ఉంచాలో తీసేయాలో నిర్ణయించవచ్చును --కాసుబాబు 13:52, 29 మే 2009 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఇస్లామోఫోబియా ప్రపంచ వ్యాప్తముగా ఉన్న మనోభావన. అది సమర్ధనీయమా కాదా అన్నది ఈ వ్యాస విషయము కాదు. వ్యాసము సరియగు ఆధారాలు లేకుండా చాల రోజులు పడి ఉన్నది. ఇపుడు ఒక రూపము దాల్చినది. వ్యాసమును ఇంకా మార్పు చేర్పులతో పఠనాయోగ్యము చేయవచ్చును. తొలగింపు సమర్ధనీయము కాదు.Kumarrao 15:58, 29 మే 2009 (UTC)Reply[ప్రత్యుత్తరం]