చర్చ:ఈఫిల్ టవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Cscr-featured.svg ఈఫిల్ టవర్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2010 సంవత్సరం, 2 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia

పేరు మార్పు[మార్చు]

ఈఫిల్ టవర్ అనే ఉంచటం సబబేమో? అలానే చదువుకున్నాము, విన్నాము. ప్రపంచం మొత్తం ఐఫిల్ టవర్ అని పిలుస్తారనే దాంట్లో అసలు నిజం లేదు. ఉదాహరణ ఫ్రెంచి వాళ్ళు "ల తూరా దే ఎఫెల్" క్లుప్తంగ తూరా ఎఫెల్ అని పిలుచుకుంటారు (కావాలంటే ఈ వ్యాసంలో ఫొనెటిక్స్ నే గమనించండి) ఎఫెల్ అన్న పదాన్ని అమెరికా వాళ్ళు ఐఫిల్ అని పిలిచినంతమాత్రాన అది అధికారికమైపోదు. అసలు మిగిలిన ఇంగ్లీషు జనాలు ఐఫిల్ అని పిలుస్తారో లేదో నాకు తెలియదు. రామ ని తెలుగులో రాముడు, తమిళంలో రామర్, హిందీలో రామ్ అన్నట్టు ఏ భాషకు పొసిగినట్టు వాళ్ళు పిలుచుకుంటారు. కొత్త పదాలు సృష్టించమని కాదు. ఉన్నది ఉపయోగించవచ్చని నా అభిప్రాయం. --వైజాసత్య 02:58, 6 ఆగష్టు 2008 (UTC)

ఈఫిల్ టవర్ అని పేరు పెట్టి వ్యాసాన్ని మొదలు పెట్టింది నేనే. అయితే వేమూరి వారు లాంటి కొంతమంది ఐఫిల్ అని పిలుస్తారని చెప్పి కొన్ని ఆధారాలు చూపించారు. అందువలన పేరు మార్చాల్సి వచ్చింది. ఇంకా కొద్దిమంది అభిప్రాయాలు సేకరించి ఈఫిల్ టవర్ అనే పేరు పెడదాం. ఏమంటారు? రవిచంద్ర(చర్చ) 03:55, 6 ఆగష్టు 2008 (UTC)
ఈఫిల్ టవర్ అనేది సరైనది. పేరు మార్చడం మంచిదని నా అభిప్రాయం.Rajasekhar1961 07:32, 6 ఆగష్టు 2008 (UTC)
తెలుగులో ఐఫిల్ టవర్ అని ఎప్పుడూ, ఎక్కడా చూడలేను. ఈఫిల్ టవరే సరైనది. -- C.Chandra Kanth Rao(చర్చ) 16:38, 6 ఆగష్టు 2008 (UTC)
ఈఫిల్ టవర్ అనేది సరైనది. తెలుగు పుస్తకాలు, వార్తాపత్రికలు ఇలానే ఉపయోగిస్తాయి (http://www.andhraprabha.in/business/article-67063) Navamoini 22:32, 18 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

సంఖ్యలు[మార్చు]

సంఖ్యలను తెవికీలో రాసేప్పుడు కోట్లు, లక్షలు అని రాయాలి. మిలియన్లు, బిలియన్లలో అలవాటు లేని పద్దతి కాబట్టి చటక్కున అర్థం కావు..ఏమంటారు? Navamoini 16:56, 15 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

అవును. అదే సరి అనుకొంటాను. కానీ అనువాదం సమయంలో ఉన్న ఇబ్బందుల వలన మిలియన్లు, బిలియన్లు కూడా వ్రాస్తుంటారు. మిలియన్, బిలియన్ అనే వ్యాసాలు సృష్టిస్తే ఈ అసంబద్ధత కొంతవరకు సరి అవుతుంది అని నా అభిప్రాయం. --కాసుబాబు 19:26, 15 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]