Jump to content

చర్చ:కొండవీటి మురళి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాసం పట్ల నా అభ్యంతరాలు

[మార్చు]

విషయ ప్రాముఖ్యత సందేహాస్పదం. తగు ఆధారాల నిచ్చి విషయ ప్రాముఖ్యతను నిరూపించాలి. నిరూపించలేకపోతే, వ్యాసాన్ని తొలగించాలి. విషయ ప్రాముఖ్యత నిరూపణ అయ్యాక, వ్యాసాన్ని ఉంచాలనే నిర్ణయం జరిగితే -

-మూలాలు చేర్చాలి. మూలాలు ఎక్కడా ఇవ్వలేదు. ఇచ్చిన ఒక్క మూలమూ (world9.tv) వ్యాస విషయమైన వ్యక్తి పెట్టిన స్వంత వెబ్‌సైటే. అది మూలంగా పనికిరాదు. __చదువరి (చర్చరచనలు) 15:48, 22 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసానికి సబ్జెక్టు అయిన కొండవీటి మురళీ గారు నన్ను సోషల్ మీడియా మార్గాల్లో సంప్రదించి తొలగింపు నోటీసులోని అంశాలు తన ప్రతిష్టకు భంగకరంగా ఉన్నాయనీ, వీలైతే సంస్కరించమనీ, లేకుంటే తొలగించమనీ కోరారు. జీవించి ఉన్న వ్యక్తి జీవితచరిత్ర విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి కాబట్టీ, వారిచ్చిన మూలాలు ఏ మేరకు చదువరి గారు విజ్ఞాన సర్వస్వ రచనా నాణ్యతా ప్రమాణాల విషయంలో వెలిబుచ్చిన సందేహాలను అవి తీర్చగలవో నాకు తికమకగానే ఉన్నందున, ప్రస్తుతానికి దీన్ని మెరుగుపరచలేమని భావించి తొలగిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:45, 24 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ, వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కొండవీటి మురళి పేజీలోను, తతసంబంధిత పేజీల్లోనూ చెయ్యాల్సిన పని కూడా చేసెయ్యవలసినది.__చదువరి (చర్చరచనలు) 01:04, 25 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]