చర్చ:క్రైస్తవ ఛాందసవాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.


Untitled[మార్చు]

ఇటువంటి వివాదాస్పద వ్యాసాలను తొలగించడమ్ మంచిది - --Svrangarao 05:03, 5 డిసెంబర్ 2008 (UTC)

నిజం మాట్లాడకు, పరువు పోతుంది అని వాదించే రకం మనుషులు అమెరికా పై చేస్తున్న విమర్శలని తొలిగిస్తున్నారు. So, I am reverting these vandalistic attempts.

ఈ వ్యాసం నిండా ఆధారం లేని వ్యాఖ్యలున్నాయి. దీన్ని తొలగించాలి --వైజాసత్య 15:30, 3 డిసెంబర్ 2008 (UTC)

అవును. తొలగించవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:37, 3 డిసెంబర్ 2008 (UTC)

ఈ వ్యాసం చదివితే అమెరికా వళ్ళు భయపడాలి కానీ మీరు భయపడుతున్నారేమిటి? In God We Trust (మేము దేవున్ని బలంగా నమ్ముతాము) అని కరెన్సీ కాగితాల మీద ముద్రించిన చరిత్ర అమెరికాకి ఉంది.

  • అనామకులుగా రాస్తున్న ఆధారాలు లేని సమాచారాన్ని ఇతరుల్ని నొప్పించేవిగా ఉన్నవాటిని మొక్కలోనే తృంచాలి.Rajasekhar1961 15:58, 3 డిసెంబర్ 2008 (UTC)
పైతుడుపుగా నేను కొన్ని కత్తరింపులు వేసినా ఇక్కడ తలాతోకా సంబంధంలేని విషయాలన్నీ ఈ సభ్యుడు వ్రాస్తున్నారు. కేవలం అమెరికా వ్యతిరేకత, ఆస్తికుల వ్యతిరేకతతో కాక విజ్ఞానపరంగా వ్యాసాలు వ్రాయాలని మనవి. ఈ వ్యాసం ఉండటంలో ఇబ్బంది లేదు. కానీ ఇందులో ఎలాంటి సమాచారం పొందుపరచాలో ఆంగ్ల వికీ వ్యాసంలో చూడండి. యధాస్థితి కొనసాగితే ఈ వ్యాసాన్ని తుడిచివెయ్యాల్సి వస్తుంది --వైజాసత్య 16:46, 3 డిసెంబర్ 2008 (UTC)
ఈ వ్యాసం వికీపీడియాకు మూల స్థంభమైన తటస్థ దృక్కోణం అనే నిభంధనను ఉల్లంఘిస్తున్నది. దీనిని తుడిచివేయాలి లేదా తటస్థ దృక్కోణంలో తిరగరాయాలని ప్రతిపాదిస్తున్నాను. మిగతా సభ్యులు తమ అభిప్రాయాలను తెలపాలని మనవి. అభ్యంతరకర రీతిలో ఉండే వాక్యాలను మూలాలు పేర్కొనని ఎడల తొలగించాల్సి వస్తుందని వ్యాసకర్త గమనించగలరు. రవిచంద్ర(చర్చ) 04:14, 4 డిసెంబర్ 2008 (UTC)

తలాతోకా లేని విషయాలు[మార్చు]

క్రూసేడ్లకు క్రైస్తవ ఛాందసవాదానికి సంబంధమేమిటో చెప్పండి? --వైజాసత్య 05:05, 4 డిసెంబర్ 2008 (UTC)

రామాయణం అంతా చదివి రామునికి సీత ఎమవుతుంది అని అడిగాడట!

వ్యంగ్య వ్యాఖ్యలు కట్టి పెట్టి అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వండి. రవిచంద్ర(చర్చ) 05:15, 4 డిసెంబర్ 2008 (UTC)

తెలిసి తెలిసి తప్పులు చేస్తే దేవుడు కూడా దిగి వచ్చి మీకు సమాధానం చెప్పలేడు.

క్రూసేడ్లలో క్రైస్తవులు, ముస్లింలు ఇరువురూ పాల్గొన్నారు. మరి అది క్రైస్తవ ఛాందసవాదమెందుకయ్యింది? --వైజాసత్య 05:20, 4 డిసెంబర్ 2008 (UTC)

పవిత్ర భూమి (ఇస్రాయెల్ - పాలస్తీనా భూభాగాలు) గురించి బైబిల్ లో కూడా వ్రాసి ఉంది కాబట్టి బైబిల్ చందస్సుకీ దీనికీ సంబంధంలేదనడం వితండవాదం. ఇస్లామిక్ చందస్సుకీ దీనికీ సంబంధం లేదని నేను అన లేదు.

మీరు బీరకాయ పీచు సంబంధాల్ని బాగా లాగుతున్నట్టున్నారే. చక్కగా క్రూసేడ్లు వ్యాసంలో వ్రాయచ్చుకదా. వ్యాసాలు చదివేవారికి, వ్రాసేవారికి విజ్ఞానదాయకంగా ఉండాలి. నినాదాలు/ ప్రాపగాండా కాదు. మీరు కనిపెట్టిన ఒకే విషయాన్ని (జార్జి బుష్షు-ఇరాక్ యుద్ధం) అన్ని వ్యాసాల్లో ఇంకేం లేనట్లు వ్రాసేస్తే ఎలా (సుత్తి ఉన్నవాడికి సమస్యలన్నీ మేకుల్లానే కనబడతాయని ఒక తత్త్వవేత్త అన్నారు. ఎవరో చెప్పుకోండి చూద్దాం) --వైజాసత్య 05:34, 4 డిసెంబర్ 2008 (UTC)

కొంత భాగం Hide చేస్తున్నాను[మార్చు]

"యహోవా(Jehovah) జార్జ్ బుష్ కలలో కనిపించి ఇరాక్ మీద బాంబులు వెయ్యమని చెప్పాడట! అందుకే అతను ఇరాక్ పైన దాడి చేశాడట. జార్జ్ బుష్ పాలస్తీనీయులని భయపెట్టడానికి ఆ విషయం పాలస్తీనా అధికారులకి ఫోన్ చేసి చెప్పాడు." ఈ భాగాన్ని ప్రస్తుతానికి Hide చేస్తున్నాను. ఎందుకంటే

  1. "ఛాందస వాదానికి" ఈ ఇరాక్ యుద్ధానికి స్పష్టంగా సంబంధం లేదు.
  2. సదరు పత్రికలో హెడింగ్‌లో ఉన్న విషయం వార్తలో లేదు. అక్కడ వ్రాసిన విషయం - I'm driven with a mission from God. God would tell me, 'George, go and fight those terrorists in Afghanistan.' And I did, and then God would tell me, 'George go and end the tyranny in Iraq,' and I did." ... .... "I'm surely not going to justify war based upon God. Understand that. Nevertheless, in my case, I pray that I will be as good a messenger of His will as possible. And then of course, I pray for forgiveness. - దీనిని "కలలో కలిపించి చెప్పాడట" గా మారిస్తే విపరీతంగా ఉంటుంది.) -->


మనిషికి దేవుడు కనిపించాడంటే ఎవ్వడూ నమ్మడు. కలలో దేవున్ని చూసి నిజంగా చూసినట్టు లేదా దేవుని మాటలు విన్నట్టు భ్రమ పడినా అది గొప్ప చాదస్తమే. ఈ రకంగా చూస్తే జార్జ్ బుష్ నిజంగా చాందసవాదే.

మనిషికి దేవుడు కనిపించాడంటే మీరు నమ్మకపోవచ్చు. కానీ నమ్మేవాళ్ళు ఉండవచ్చు. ఎవరూ నమ్మరు అని మీరెలా చెప్పగలరు? మీరేమైనా ప్రపంచంలో ఉండే ప్రజలందరినీ సర్వే చేశారా? ఉదాహరణకు రామక్రిష్ణ పరమహంస కాళికాదేవితో మాట్లాడాడు అని చెబితే నేను నమ్మాను. మీరు నమ్ముతారా? నేను నమ్ముతానా అన్నది ఇక్కడ సమస్య కాదు. రవిచంద్ర(చర్చ) 06:38, 4 డిసెంబర్ 2008 (UTC)


నమ్మకాల్ని నమ్మేవాళ్ళు నిత్యం అవే నమ్మకాలని పట్టుకుని వేలాడుతారని అనుకోలేము. చిన్నప్పుడు నేను రంభ-రాంబాబు సినిమా చూసి నేను రంభని పెళ్ళి చేసుకుంటానని అంటే నా ఫ్రెండ్స్ నవ్వారు. మనిషికి దేవుడు కనిపించడం లేదా మనిషి దేవతని పెళ్ళి చేసుకోవడం లాంటివి చాలా అసంభవం అని చాలా మంది మత భక్తులకి కూడా తెలుసు.

మరి మీరు నమ్మని విషయాలను నమ్మేవారిని చాంధసులంటారా? ఎవరి నమ్మకాలు వాళ్ళవి. పక్కవారి అభిప్రాయాలను గౌరవించడం మన సంస్కృతిలో భాగం. రవిచంద్ర(చర్చ) 07:01, 4 డిసెంబర్ 2008 (UTC)


నమ్మకాల్ని ఎంత నమ్మినా అవి మరీ ఇంత చాదస్తంగా తయారవ్వకూడదు. దేవుడు కనిపించడమేమిటి? ఫలానా దేశం మీద బాంబులు వెయ్యమని చెప్పడమేమిటి? వింటేనే ఇంత చాదస్తం ఎలా పుడుతుందా అని సందేహం కలుగుతోంది.

వ్యాసం పరిధిని గమనించండి[మార్చు]

అజ్ఞాత సభ్యునికి మనవి. ఒక విషయంపై మీకు utter contempt ఉండవచ్చును. ఇందులో అస్సలు పేచీ అవసరం లేదు. మీ అభిప్రాయాలగురించి వికీపీడియాకు ఏ విధమైన ఆభ్యంతరం లేదు. వాటిని వికీపీడియా ప్రోత్సహించదు, ఖండించదు. కనుక మీ అభిప్రాయాలతో ఇతరులు విభేదిస్తున్నారని భావించవద్దు.

ఇక్కడ సంగతి ఏమంటే - (1) "క్రైస్తవ ఛాందస వాదం" అనే వ్యాసంలో ఆ విషయం స్థలోచితమైనదా? అందులో వ్రాయడానికి ఇంతకంటే ఉచితమైన విషయాలు లేవా? (2) మీరు వ్రాసిన విషయం నిష్పక్షపాతంగా, peer reviewed dependable sources నుండి తీసుకొన్నారా? - వరకు మాత్రమే. వివాదాస్పదమైన వ్యాసాలలో ఈ ప్రమాణాలు ఖచ్చితంగా పరిశీలింపబడతాయి. కనుక మీ వాదాన్ని నెగ్గించుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేయడం అనవుసరం. ఇది వాదనకు సరైన వేదిక కాదు. అభిప్రాయాలు వెలువరిచే మైకు కాదు. మిమ్ములను ఒప్పించాలని, మార్చాలని తాపత్రయం వికీపీడియా సభ్యులకు లేదు. ప్రామాణికం కాని విషయాలు మాత్రం తప్పకుండా తొలగింపబడతాయి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:30, 4 డిసెంబర్ 2008 (UTC)

వ్యాసం స్థలోచితమైనదే[మార్చు]

నా మిత్రుడు పెన్మెత్స సుబ్బ రాజు పశ్చిమ గోదావరి జిల్లాలో నేత్రదాణ ప్రోత్సాహక సంఘం పెట్టాడు. ఆ సంఘంలో ఒక క్రైస్తవుడు కూడా చేరాడు. కానీ ఆ క్రైస్తవుని తల్లి చనిపోయినప్పుడు అతను ఆమె కళ్ళు దానం చెయ్యడానికి అంగీకరించలేదు. నేత్ర దానం చేస్తే స్వర్గంలో కళ్ళు కనిపించవట, వీళ్ళ అమ్మ గారు దేవున్ని చూడలేరట. క్రైస్తవుల నమ్మకం ప్రకారం తీర్పు దినం అనేది ఉంటుంది. ఆ రోజు నాడు సమాధుల నుంచి ఆత్మలు లేచి దేవుని దగ్గరకి వెళ్తాయి. ఉన్నాడో లేడో తెలియని దేవుని కోసం విలువైన కళ్ళని మట్టిలో కలిపేస్తున్నారు నేత్ర దానం చెయ్య కుండా. నిజాలు మాట్లాడకుండా అజ్ఞానానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం చాలా ప్రామాదకరం.

మీ దృష్టిలో ప్రామాణికత ఏమిటి? జార్జ్ బుష్ తనకి దేవుడు కనిపించాడని పాలస్తీనా అధికార్లకి ఫోన్ చేసినప్పుడు ఆ వార్తని మొదట BBC (బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పరేషన్) ప్రచారం చేసింది. ఆ తరువాతే మిగిలిన అమెరికా, బ్రిటిష్ మీడియా వారు ప్రచారం చేశారు. BBC సామ్రాజ్యవాద వ్యతిరేక మీడియా కాదు. అది సామ్రాజ్యవాద అనుకూల మీడియా. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అమెరికా సామ్రాజ్యవాదులకి మిత్రులు కాబట్టి వాళ్ళు జార్జ్ బుష్ గురించి వ్రాసినవి వ్యక్తిగత విమర్శలని అనుకోలేము.[1]

మీకు బయటి ప్రపంచం పెద్దగా తెలిసినట్టులేదే. బిబిసీ అమెరికా వ్యతిరేకతకు పెట్టినకోట అని అందరికీ తెలిసినదే కదా If you watch the BBC for any 24 hours, you see institutionalised anti-Americanism. [2] --వైజాసత్య 04:13, 8 డిసెంబర్ 2008 (UTC)

బి.బి.సి. అమెరికా-బ్రిటిష్ సామ్రాజ్యవాదుల మీడియా అని సామ్రాజ్యవాద వ్యతిరేకులందరికీ తెలుసు.

హ హ హా ;-) అలాగే --వైజాసత్య 04:28, 8 డిసెంబర్ 2008 (UTC)

అమెరికా సంగతి మూడవ ప్రపంచ దేశాల వారికి బాగా తెలుసు. Facebookలో నాకు పరిచయమైన మిత్రులలో ఎక్కువ మంది పాకిస్తాన్, టర్కీ మరియు జోర్డాన్ లాంటి మూడవ ప్రపంచ దేశాలకి చెందిన వారే. నాకు తెలిసినంత వరకు అల్-జజీరా మరియు కొన్ని లాటిన్ అమెరికా దేశాల పత్రికలు, వెబ్ సైట్లు మాత్రమే ఆంగ్లో-అమెరికా సామ్రాజయవాదులకి వ్యతిరేకంగా వార్తలు ఎక్కువగా వ్రాస్తుంటాయి.

తొలగింపు నిర్ణయం[మార్చు]

ఈ వ్యాసంలో "తొలగించు" మూస చాలా కాలంనుండి ఉన్నది. సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లుగా కనిపించడం లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి గనుక వోటింగ్ అవుసరం అని భావిస్తున్నాను. సభ్యులు గమనించవలసిన విషయం ఏమంటే ఈ వ్యాసం నచ్చకపోవడం అనేది తొలగించడానికి కారణం కారాదు. అది సభ్యుల వ్యక్తిగత అభిప్రాయం కావచ్చును. వికీ విధానాలకు వ్యతిరేకం అయితే మాత్రం వ్యాసాన్ని తొలగించాలి. దయచేసి మీ అభిప్రాయాలను, అందుకు కారణాలను క్రింద వ్రాయండి. సంతకం చేయడం మరచిపోవద్దు. --కాసుబాబు 11:13, 21 మే 2009 (UTC)


తొలగింపునకు అనుకూలం, కారణాలుతొలగింపునకు వ్యతిరేకం కారణాలు

వ్యాసం సబబుగానే ఉన్నది. కాకపోతే చాంధసవాదం అన్న పదం పేరులో ఉంటే బాగాలేదని అనిపిస్తుంది. వ్యాసం పేరు ఏదైనా మార్చి వ్యాసాన్ని అలాగే ఉంచవచ్చని నా అభిప్రాయం. — రవిచంద్ర(చర్చ) 11:20, 21 మే 2009 (UTC)

రవిచంద్రగారితో ఏకీభవిస్తున్నాను. పేరు విషయంలోనూ రవిచంద్రగారి ఆలోచన సరియైనది. వ్యాసంలో డెప్త్ మరియు ఎనాలిటికల్ ప్రెజెంటేషన్ లోపించింది. ఎత్తిపొడుపులా కాకుండా జెనెరస్ విజన్ తో బేలన్స్‌డ్ గా మలిస్తే వ్యాసం హుందాగా తయారుగావచ్చు. అహ్మద్ నిసార్ 18:11, 21 మే 2009 (UTC)
ఫండమెంటలిజం అన్న పదానికి ఛాందసవాదం అన్న అనువాదం తప్ప తెలుగులో మరే పదం లేకపోవడంతో అది తప్పట్లేదు. కొన్ని అసంబద్ధమైన వ్యాసం పరిధిలోకి రాని అంశాలను తొలగించి. ఈ వ్యాసాన్ని ఉంచేయవచ్చు --వైజాసత్య 15:09, 22 మే 2009 (UTC)
అన్ని మతాల్లోనూ ఛాందసవాదమున్నది. అది శ్రుతిమించితే మానవ జాతికి వినాశకారకమవుతుంది. చరిత్ర పుటలకెక్కుతుంది. నిజాలను ధైర్యముగా ఒప్పుకునే విశాలభావము 21వ శతాబ్దములో అన్ని మతానుయాయులకు ఉండాలి. ఇది ప్రస్తుత వ్యాసానికి కూడ వర్తిస్తుంది. మూలాలను ఉటంకించుతూ నిష్పాక్షికముగా వ్రాయాల్సిన అవసరమున్నది. వ్యాసము తొలగించుట పరిష్కారము కాదు.సందర్భమును బట్టి బ్రేకులు వేస్తూ ఉండవచ్చు.Kumarrao 15:51, 22 మే 2009 (UTC)
ప్రతి నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్లే ప్రతిదానికి మంచీ, చెడూ రెండూ ఉంటాయి. అయితే కేవలం విమర్శగానే చూడటం మాత్రం సరైనది కాదు. ఇదివరకు ఒక అజ్ఞాత సభ్యుడు కేవలం మతాలను విమర్శించడం కోసమే రచనలు చేస్తున్నప్పుడు మతాలకు వ్యతిరేకంగా వ్యాసాలు వద్దు అని చర్చ తీసినది నేనే. చరిత్రను చూస్తే ప్రతి మతంపై ఇతర మతాల అకృత్యాలు ఉన్న సంగతి వాస్తవమే కావచ్చు, అంతమాత్రాన ఇతర మతాలను విమర్శించడం సమంజసం కాదు. ఇది చాలా సున్నితమైన విషయం అని నేను ఎప్పుడో చెప్పాను. విమర్శ అనేది విమర్శగానే ఉండాలి కాని కక్షతో, పగతో చేసేది/రాసేదిగా ఉండకూడదు. ప్రస్తుతం వ్యాసాలలో ఉన్న వివాదాస్పద మరియు ఆధారంలేని వాక్యాలను తొలిగిస్తే సరిపోతుంది. ఒక మతానిపై కేవలం అకృత్యాలు మాత్రమే కాకుండా ఇతర మతస్థులు చేసే మంచి పనులు కూడా వ్యాసాలలో చేర్చాలి. ఎందుకంటే పరాయి మతస్థులందరూ ఎదుటి మతంపై విమర్శించే వ్యక్తులు కారు. -- C.Chandra Kanth Rao-చర్చ 20:18, 22 మే 2009 (UTC)
సమీక్ష (కాసుబాభు)

పై వ్యాఖ్యల తరువాత వ్యాసాన్ని మరొకసారి పరిశీలించాను. వ్యాసంతో స్పష్టంగా సంబంధం లేనివి, ఆధారాలు చూపనివి అయిన భాగాలను ప్రస్తుతానికి Hidden comment రూపంలో ఉంచాను. మరియు "తొలగించు" మూసను తీసివేస్తున్నాను --కాసుబాబు 19:35, 7 జూన్ 2009 (UTC)