చర్చ:చార్వాకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

సర్, నమస్కారములు

"చార్వాకుదు" వ్యాసాన్ని "చార్వాక దర్శనము" వ్యాసంతొ విలీనము చేయవలెనని ప్రతిపాదించారు. అయితె రెందు సందెహాలు వస్తునాయి.

A) చార్వాకుడు వ్యాసం, చార్వాక దర్శనము రెండు వ్యాసాలు వేర్వేరు హెడ్డింగ్ లతోనే వున్నాయి కదా! ఒకే హెడ్డింగ్ తో లేవు కదా! కనుక విలీనం చేయాల్సినవసరం ఉందా అని తెలిసికోనగోరతున్నాను.

B) ఒకవేళ విలీనమే చేయాల్సినవసరం వుందని భావిస్తే వికీ సంప్రదాయం ప్రకారం మొదట రాసిన “చార్వాకుడు” వ్యాసం లోనే తరువాత రాసిన లేదా విస్తరించిన వ్యాసాలను, అనగా “చార్వాక దర్శనం” వ్యాసాన్ని విలీనం చెయాలి కదా? అంతేగాని ఉల్టాగా మొదట రాసిన వ్యాసాన్ని తరువాత రాసిన వ్యాసంలో విలీనం చేయాలంటూ ప్రపోస్ చేయడమేమిటి? అర్ధం కావడం లేదు.

ఉదా: రచ్చబండ లో నిర్వాహకులు కె.వెంకటరమణ (⇒✉ 13:03, 16 జూలై 2015 (UTC) నాడు) గారు తెలియచేసిన్ విధం ప్రకారం ------ “ విలీనం చేయునపుడు పూర్వపు వ్యాసంలో కొత్తగా వ్రాసిన వ్యాసాన్ని విలీనం చేయాలి. దీనిపై వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 17#రెడ్డి గారికి వినతి విభాగంలో చర్చ జరిగింది అందులో చంద్రకాంతరావు గారు "తెవికీ సంప్రదాయం ప్రకారం ఏదేని వ్యాసం మొదట ప్రారంభించినదే ఉంచి తర్వాత చేర్చిన వ్యాసాలను తొలిగించడం కాని దారిమార్పులు చేర్చడం కాని చేయడం జరుగుతుంది. చాలా వ్యాసాలు తెవికీలో ఇదివరకే ఉన్ననూ కొందరు ఆ విషయం గ్రహించక మళీ కొద్దిపేరుమార్పుతో ఇదివరకే ఉన్న వ్యాసం కన్నా పెద్దగా, నాణ్యతతో రచించిననూ తర్వాత చేర్చబడిన వ్యాస సమాచారాన్ని మొదటగా సృష్టించిన వ్యాసంలోకి విలీనం చేయడం జరుగుతుంది." అని తెలియజేసారు. అదే సాంప్రదాయంతో అనేక వందల వ్యాసాలను విలీనం చేయడం జరుగుతుంది.”

ఉదా: పేజీ సమాచారాన్ని చూస్తే, “చార్వాకుడు” వ్యాసాన్ని 24.02.2008 న Girichand గారు ప్రారంభించారు. చివరగా 03.03.2015 న దిద్దుబాటు చేసింది Veera.Sj గారు. అదేవిధంగా “చార్వాక దర్శనం” వ్యాసాన్ని 03.03.2015 న Veera.Sj గారు ప్రారంభించారు. చివరగా 07.07.2015 న దిద్దుబాటు చేసింది Veera.Sj గారు. అనగా రెండు వ్యాసాలలో తోలిసారిగా రాసినది Girichand గారి “చార్వాకుడు” వ్యాసమే. ఒకవేళ రెండూ వ్యాసాలూ ఒకటే అంటూ విలీనం చేయాలని భావిస్తే వికి సంప్రదాయం ప్రకారం “చార్వాకుడు” వ్యాసంలోనే రెండవ వ్యాసం విలీనం కావాలి కదా! --Vmakumar (చర్చ) 01:17, 27 జూలై 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Vmakumar గారూ, మీరు చెప్పిన విషయం సరియైనది. విలీనం చేసినపుడు రెండు వ్యాసాల చరిత్రలను చూసి మొదటి దానిలో రెండవది విలీనం చేయడం జరుగుతుంది. కానీ విలీనం మూస ఉన్నంత మాత్రాన తర్వాత వ్యాసంలో మొదటి వ్యాసాన్ని విలీనం చేయలేము. పద్ధతి ప్రకారం చార్వాక దర్శనము లోనే విలీనం మూసను ఉంచాలి. విలీనం చేయమని కోరిన వాడుకరి చర్చా పేజీలో ఎందుకు విలీనం కోరుకుంటున్నారో వివరంగా వ్రాస్తే యితరులకు అర్థమవుతుంది. ఈ రెండు వ్యాసాలు ఒకటేనా? వేర్వేరుగా వ్యాసాలుగా ఉండవచ్చా? విలీనం అవసరమా? మీ అభిప్రాయాలను తెలుపగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 02:00, 27 జూలై 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Vmakumar మరియు కె.వెంకటరమణ గార్లకి, వికీ నియమాల ప్రకారమే విలీనం చేయగలరు. - శశి (చర్చ) 06:46, 27 జూలై 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సర్, నమస్కారములు ఒక వ్యాసాన్ని వేరొక వ్యాసంలో విలీనం చేయవలెనని ప్రతిపాదించినది ఎవరో (వాడుకరి పేరు) తెలుసుకొనడం ఎలా? ప్రస్తుత విలీన ప్రతిపాదనను చేసినది. గిరిచంద్ గారా, వీరా Sj గారా, వికీ నిర్వాహకులా లేదా వేరే ఎవరైనా థర్డ్ పార్టీ వాడుకరా .ఇది తెలిస్తే ప్రతిపాదకుడి ఉద్దేశ్యం కొంతవరకు అర్ధమై నాకు సందేహ నివృత్తి అవుతుంది.

--Vmakumar (చర్చ) 07:31, 27 జూలై 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సర్, విలీనానికి ప్రతిపాదించినది veera (శశి వాడుకరి పేరు) గారు అని తెలిసింది. కొంత క్లారిటీ వచ్చింది.

నా అభిప్రాయంలో రెండు చార్వాకుడు , చార్వాక దర్శనము వ్యాసాల విలీనం చేయకుండా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది

ఒక వ్యాసాన్ని ( అది మొలక దశ లోనిది కావచ్చు లేదా ప్రాధమిక దశ లోనిది కావచ్చు) వేరే ఎవరైనా మరింతగా రాయాలనుకొంటె (మరింత విస్తరించి కావచ్చు లేదా మరింత దిద్దుబాటు చేసి కావచ్చు) తదుపరి వ్యాసకర్త కు కలుగుతున్న ఒక రకమైన చిన్న ఇబ్బందిని (?) అర్ధం చేసుకొనడానికి సహేతుకంగా ప్రయత్నిస్తే ఇటువంటి విలీన ప్రతిపాదనలు రావు. చర్చలూ వుండవు అని భావిస్తున్నాను.

ఇక విషయానికి వస్తే విలీనం చేయకుండా ఉంటేనే బాగుంటుంది అని భావిస్తున్నాను. రెండిటి వస్తువు ఒకటే (నాస్తికత్వంమే). కాని వస్తువును ఎవరి పరంగా చెప్పారు అన్నది ముఖ్య విషయం. మొదటిది దార్శనికుడి పరంగా, రెండవది దర్శనం పరంగా చెప్పారు.

మొదటి వ్యాసం హెడ్డింగ్ “చార్వాకుడు” . అంటే ఇక్కడ కూడా వస్తువు “ నాస్తికత్వమే “ అయినప్పటికీ ఆ వస్తువును “ఒక వ్యక్తి” పరంగా మాత్రమె చెపుతూ వుండాలి. ఆ వ్యక్తీ చార్వాక దర్శన ప్రారంభకుడు లేదా గురువు లేదా అనుచరుడు ఎవరైనా కావచ్చు. ఈ వ్యాసంలో మేటర్ అంతా ఆ వ్యక్తీ చుట్టూ తిరుగుతుంది. ఆ వ్యక్తీ బోదించిన దర్శనానికి మాత్రం ప్రాధాన్యత కొద్దిగ తక్కువగా వుంటుంది. అంటే “చార్వాకుడు” అనే వ్యాసంలో ఉండాల్సిన విషయాలు ఇవి: చార్వాకుని బోధనలు (అవి దర్శనం సిద్దాంతాలే అనివార్యంగా కానవసరం లేదు. ఆ దర్శనంకి చార్వాకుడి పరంగా చేసిన విశ్లేషణలు వ్యాఖ్యలు కూడా కావచ్చు), చార్వాకుని వ్యక్తీగత విశేషాలు, పుట్టుక మరణం, చార్వాకుని రచనలు , చార్వాకుని ప్రేరణకర్తలు , గురువులు, శిష్యులు వారి గురించి టూకీగా, చార్వాక దర్శనంలో చార్వాకుని పాత్ర గురుంచి తదితర విషయాలు . అంటే చార్వాకుడు వ్యాసంలో చర్చించాల్సిన మేటర్ ప్రధానంగా “చార్వాకుడు(అంటే వ్యక్తీ గురించి) ” మాత్రమె అని అర్ధమవుతుంది.

ఇకపోతే రెండవ వ్యాసం హెడ్డింగ్ ప్రకారం “చార్వాక దర్శనం”. అంటే ఆ వ్యాసం చర్చించాల్సిన విషయాలు ఈ విధంగా వుంటాయి: దర్శనం ఏమిటి. అది ఏమి చెపుతుంది. ఆ దర్శన సిద్దంతాలేమిటి. ఆ దర్శన బోదకులెవరెవరు వారు చెప్పిన విషయాలు స్థూలంగా వివరణ (చార్వాకుడు వ్యక్తీ గురించి చెప్పినా క్లుప్తంగానే చెప్పాలి. ఎందుకంటే రచయిత చెప్పబోయేది దర్శనం గురించి, దార్శనికుడి గురుంచి కాదు కనుక ) . ఆ దర్శనం ఎలా ఏఏ పరిస్థితుల కారణంగా పుట్టింది , ఎలా క్షీణించింది. ఆ దర్శనానికి వచ్చిన టీకాలు, విశ్లేషణలు గురుంచి క్లుప్తంగా మాత్రమే, ఆ దర్శనం సమాజంపై చూపిన ప్రభావం గురుంచి ఇత్యాది విషయాలను దర్శన పరంగానే వివరిస్తూ, విశ్లేషిస్తూ రాస్తే ఆ విషయాలు “చార్వాక దర్శనం” అనే వ్యాసంలో కనిపించాలి. అయితే ఈ విషయాలన్నీ మన ప్రస్తుత “చార్వాక దర్శనం“ వ్యాసంలో విధిగా కనిపించకపోయినా పరవాలేదు. హెడ్డింగ్ “చార్వాక దర్శనం“ అని వుంది కాబట్టి రాబోయే కాలంలో ఆ వ్యాసంలో మార్పులు చేర్పులు చేయబూనేవారు, ముఖ్యంగా విస్తరించే వారు పరిగణించవలసిన విషయం ఇది. వారు చేర్చవలసిన మేటర్ ఆ విధంగానే వుండాలి. అంటే చార్వాక దర్శనం వ్యాసంలో చర్చించాల్సిన మేటర్ ప్రధానంగా “దర్శనం” మాత్రమె అని అర్ధమవుతుంది.

ఇకపోతే రెండు వ్యాసాలను తరచి చూస్తే రెండవ వ్యాసం అయిన “చార్వాక దర్శనం”లో వస్తువుని ఒక దర్శన పరంగా చెప్పబడిన వ్యాసం . లోపలి మేటర్ దానికి తగిన విధంగానే వుంది. భవిష్యత్తులో ఈ వ్యాసాన్ని విస్తరించేవారు దర్శనం గురించిన విషయాలకే ప్రాధాన్యత ఇచ్చి చార్వాకుని (చార్వాకదర్శనంలో చార్వాకుడు మేరునగ శిఖర సమానుడు –crucial person కావచ్చు) గురించిన విషయాలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తూ పోతుండాలి. ఇక మొదటి వ్యాసానికి వస్తే మొదటి వ్యాసం “చార్వాకుడు” లో కూడా (సుమారుగా 1/3 వ్యాసం పైగా చార్వాకుని వ్యక్తిగత విషయాలు వుంది. ఉదా: మరణం ) చార్వాకుడి ప్రాధాన్యత నిస్తూ వుంది. (ఇకపోతే “చార్వాకుడి” వ్యాసంలో 2/3 మేటర్ చార్వాక దర్శనం గురించి వుంది కదా మరి విలీనం చేయాల్సిందే అనవచ్చు. కాని ఒక దర్శనానికి ఒక వ్యక్తి మేరునగ శిఖర సమానుడుగా వుంటే అధిక మేటర్ ఆ దర్శనం గురించి వున్నా పరవాలేదు.ఆ వ్యక్తీ గురించి కొన్ని విశేషాలు చెప్పినా ఆ హెడ్డింగ్ “చార్వాకుడు” వ్యాసానికి న్యాయం చేసినట్లే.) కాబట్టి రెండు వ్యాసాలను విడివిడిగా ఉంచితే భవిష్యత్తులో దర్శనం గురించి రాసే వారు మొదటి వ్యాసంలో విలీనం కావచ్చు. అదేవిధంగా భవిష్యత్తులో చార్వాకుడి గురించి ఇతర విశేషాలు చేర్చేవారు వారు రాసిన మేటర్ని “చార్వాకుడు” వ్యాసం లో విలీనం చేయవలసి వుంటుంది. కనుక రెండు వ్యాసాలను విలీనం చేయకుండా ఉంటేనే బాగుంటుంది అని భావిస్తున్నాను.

నోట్: దీనికి మరి కొద్దిగా వివరణని తెలియచేస్తున్నాను. మన తెలుగు వికీ లో బౌద్ధమతం పేరుతొ ఒక వ్యాసం వుంది. గౌతమ బుద్ధుడు పేరుతొ ఇంకొక వ్యాసముంది. మతం వేరు . మతస్థాపకుడు (వ్యక్తీ) వేరు. రెండు వ్యాసాలను విలీనం చేస్తామా? అదే విధంగా జైన మతం పేరుతొ ఒక వ్యాసముంది. వర్ధమాన మహావీరుడు పేరుతొ ఒక వ్యాస ముంది . రెండింటిని విలీనం చేయటం లేదు కదా! ఒకవేళ వస్తువు ఒకటే కదా అనుకుంటూ విలీనాలు చేసుకొంటూ పొతే గౌతమ బుద్ధుని వ్యాసాన్ని బౌద్దమతం వ్యాసంలో కలపాలి . అదే విధంగా జైన మతంలో వర్ధమాన మహావీరుని వ్యాసం కలపాలి . మళ్ళీ ఈ రెండు మహా వ్యాసాలను (మతాన్ని చెపుతున్నాయి కాబట్టి) మతము పేరుతొ వున్న మరో వ్యాసంలో కలపాలి. ఇలాపోతే తెలుఫు వికి లోని content మొత్తం అతి కొన్ని వ్యాసాలకే పరిమితమవుతుంది. ఆ కొద్ది వ్యాసాలూ కూడా సంలీనాలు-విలీనాల మూలంగా అత్యంత భారీ సైజు వ్యాసాలుగా మిగిలిపోయి విలీనాలు ఒక ప్రహసనంలా మిగిలిపోయే ప్రమాదముంది. --Vmakumar (చర్చ) 10:40, 27 జూలై 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Vmakumar గారూ, మంచి చర్చ ప్రారంభించినందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. మీరు సూచించిన చివరి "నోట్" సహేతుకంగా ఉంది. మీ భావన సరియైనదని భావిస్తాను. చార్వాకుడు వ్యక్తికి సంబంధించిన వ్యాసం. చార్వాక దర్శనము అనేది ఆయన బోధనల కు సంబంధించినది. కనుక విలీనం అవసరం లేదు. వేర్వేరుగా ఉంచాలని అభిప్రాయపడుతున్నాను. ఈ విలీన ప్రతిపాదన చేసిన శశి గారు ఒకసారి పరిశీలించి విలీన ప్రతిపాదనపై తమ అభిప్రాయాన్ని తెలియజేయవలసినదిగా కోరుచున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 14:26, 27 జూలై 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Vmakumar మరియు కె.వెంకటరమణ గార్లకి,
  • నేను ఇంత దూరం ఆలోచించలేదు. అయితే చార్వాకులు, చార్వాకుడు, చార్వాక దర్శనము ఒకటే అన్న భావనతోనే విలీనాలని ప్రతిపాదించాను (అవును. విలీనాలని ప్రతిపాదించినది నేనే.)
  • అయితే కుమార్ గారు చెప్పినది లాజికల్ యే (నోట్)
  • చార్వాక దర్శనం వ్యాసం ఆంగ్ల వ్యాసాన్ని మూలంగా చేసుకొని కొంత భాగాన్ని అనువదించాను. అయితే తర్వాత నా దృష్టిని నిర్వహణ మరియు పురుషవాదం ల పై కేంద్రీకరించటంతో దీనిని ఎక్కువగా విస్తరించలేకపొయాను.
  • వాస్తవానికి నాకు చార్వాకం పై ఏ మాత్రం అవగాహన లేదు. దీనితో ఈ వ్యాసంలోని కొన్ని ఆంగ్ల పదముల అనువాదానికి చాలా కష్టపడవవలసి వచ్చినది. ఉదా: అనుమితి (Inference) అర్థం ఏంటో నాకు ఇదమిత్థంగా ఇప్పటికీ తెలియదు.
  • వికీ ఒక సమిష్టి కృషి. ఏ ఒక్కరు వ్రాసిన వ్యాసం యథాతథంగా ఉండదు. కూడికలు, తీసివేతలు, మార్పులు సహజమే. అవసరం కూడా.
  • మన అందరి అంతిమ ధ్యేయం, వాశిపరంగా, రాశిపరంగా వికీలో వ్యాసాలని రూపుదిద్దటమే.
కావున ఈ మూడు వ్యాసాలకీ మీరు ఎటువంటి మార్పుచేర్పులు చేసినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దిగ్విజయంగా మీరు ఈ వ్యాసాలని పూర్తి చేయాలని కోరుకొంటూ, మీ - శశి (చర్చ) 14:50, 27 జూలై 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Vmakumar గారూ,విలీనం కోరిన వ్యక్తికి అభ్యంతరం లేనందున విలీనం మూసను తొలగించితిని.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 15:00, 27 జూలై 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]