Jump to content

చర్చ:తమిళ అక్షరమాల

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

టైపు సహాయం

[మార్చు]

{{సహాయం కావాలి}}

  • ఋ, ౠ ల తర్వాత వచ్చే లు, లూ లు ఎలా రాయాలి?
  • బండి ర ఎలా రాయాలి?
సహాయానికి ధన్యవాదాలు శశి (చర్చ) 04:14, 28 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మరో ళ

[మార్చు]

చక్కటి వ్యాసం. కేవలం ఆసక్తి కొద్దే ఈ ప్రశ్న అడుగుతున్నాను. నా తమిళం అంతంత మాత్రమే ழ - మరో ళ (దీనిని ళ్హ అని పలకాలి, ళ కి హ వత్తు ఇచ్చినట్టు). నాకు ఇది "య"కు "ళ"కు మధ్య ఉండే శబ్ధంగా పరిచయం. ఇంగ్లీషులో zh గా రూప్యాంతరం చేస్తారు. అందుకే కొంతమంది "అయగి" కి దగ్గరగా పలికితే మరికొందరు "అళగి" కి దగ్గరగా పలుకుతారు. అయగర్ - అళగర్ నాకు తెలిసినది ఖచ్చితంగా సరైనదని చెప్పలేను. మీరు నిర్ధారించుకోండి --వైజాసత్య (చర్చ) 05:53, 28 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:వైజాసత్య గారూ. ఈ మిష్టరీని ఛేదించటానికి నేను ఎక్కని కొండా లేదు, మొక్కని రాయీ లేదు, చేయని ప్రయత్నమూ లేదు. అయితే నా ప్రయత్నాలన్నీ చాలా కాలం వృథా అయినవి. చాలా మంది తమిళ సోదరులని దీనిని ఎలా పలకాలో వివరించమని అడిగాను. నేను ఎలా ప్రయత్నించిననూ వారు అలా కాదు! అని మరల పలికి చూపించేవారు. (మీ లాగే నేను కూడా ఇది వేరే ఏవేవో అక్షరాల కలయికలు అనుకొన్నాను.) అయితే ఒక నాడు ఒక తమిళ శాస్త్రీయ సంగీత కార్యక్రమాన్ని మా నాన్నారు టీవీలో చూస్తున్నారు. తను ఆలపించే గీతాన్ని పరిచయం చేస్తూ గాయని ఒక అందమైన అని వివరించటానికి ఒరు అళ్హఘాన అని చాలా తేలికగా పలికినది. అప్పటికి కానీ నా ఫ్యూజులు కనెక్ట్ అయి బల్బులు వెలగలేదు. వ్రాయటంలో zh వాడిననూ వాళ్ళ ఉద్దేశ్యం z అనగా ళ్ అని అర్థమని డిసైడ్ అయ్యా అన్నమాట! - శశి (చర్చ) 11:50, 2 డిసెంబర్ 2013 (UTC)